సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదమాత
భారతీయ వాఙ్మయమైనటువంటి వేదములన్నింటికి మూలాధారము గాయత్రియే. గాయత్రి స్ర్తి వేదము మాత. ఏ విధంగా ఆలోచించినప్పటికినీ స్ర్తిజన్మమూ చాలా పవిత్రమైనది. ఉత్కృష్టమైనది. సౌజన్యమైనది, సౌశీల్యమైనటువంటిది. వైదిక సంస్కృతీ సంప్రదాయముల యందు స్ర్తికి అత్యంత ప్రధానమైన స్థానమివ్వబడింది. వైదికోపాసన యందు సత్యవతి, అన్యవతి, అంగవతి, నిదానవతి పేర్లతో వేదములు అనేక విధములుగా శక్తిని గురించి చాటుతూ వచ్చాయి.
‘సత్యవతి’ అనగా పాలలో వెన్నవలె భగవంతుడు సర్వత్రా నిండి ఉంటున్నాడనే సత్యమును ప్రకటించటం. భగవంతుడు ప్రకృతికి భిన్నంగా లేడు. ప్రకృతి పురుషుల స్వరూపమే దివ్యత్వము. వెన్న ప్రతి పాలబొట్టులోను సర్వత్రా వ్యాపించినట్లుగా, ప్రకృతియందు దైవము సర్వత్రా వ్యాపించి వున్నాడనే తత్త్వమును వేదము నిరూపిస్తూ వచ్చింది.
రెండవది అన్యవతి. ఈ ప్రకృతియందు సర్వత్రా వ్యాపించినటువంటివే ఈ పంచభూతములు. అవి పరమాత్మునియొక్క అంశములే ననేటటువంటి విషయాన్ని ప్రచార ప్రబోధాలు సలుపుతూ వచ్చింది వేదము. దీనినే ‘అన్యవతి’ అన్నారు.
మూడవది ‘అంగవతి’. కొన్ని విధములైన గుర్తులను పురస్కరించుకొని, ఫలానా దైవము ఫలానా గుర్తులకు సరియైన రీతిలో సాక్షాత్కరిస్తాడనే సత్యమును ప్రబోధిస్తూ వచ్చింది. శాస్తమ్రు ఉదాహరణకు త్రిశూలధారి. త్రినేత్రధారి ఈశ్వరుడని, శంఖచక్ర గదాధారి విష్ణువని, నెమలి పింఛములు ధరించినటువంటివాడు కృష్ణుడని, కోదండధారి రాముడని- ఈ విధంగా ఒక్కొక్క దైవ స్వరూపమునకు ఒక్కొక్క గుర్తును గురించి ప్రబోధిస్తూ ఉండేటటువంటిది ‘అంగవతీ ఆరాధన’ అన్నారు.
నాల్గవది ‘నిదానవతి’. దీనిని అనేక మార్గాలలో మనం పొందటానికి అవకాశం ఉన్నదని వేదములు ప్రబోధిస్తూ వచ్చాయి. నవవిధమైన భక్తి మార్గములలో ఈ ‘నిదానవతి’ని పొందవచ్చునన్నారు.
భారతీయ వాఙ్మయమంతయు కూడానూ శక్తిని ‘సత్యవతి, అన్యవతి, అంగవతి, నిదానవతి’, అనేటటువంటి స్ర్తిరూపములు ధరించినటువంటిదిగా నిరూపిస్తూ వచ్చింది. పేరులు వేరుగాని దివ్యత్వం మాత్రం ఒక్కటే. గమ్యం ఒక్కటే గాని, మార్గములు మాత్రం భిన్నంగా ఉంటున్నాయి.
గాయత్రీ మాత
గాయత్రిని వదలకు. నీవు ఏ యితర మంత్రాన్నైనా వదలవచ్చు కాని గాయత్రిని వదలకు, ప్రతి దినం గాయత్రి మంత్రాన్ని విధిగా కొన్ని సార్లయినా జపించాలి. అది నిన్ను కాపాడుతుంది. నీ వెక్కడవున్నా. ఏం చేస్తున్నా అది నీకు రక్ష.
పాశ్చాత్యులు ఈ మంత్రంపై పరిశోధనచేశారు. ఈ మంత్రాన్ని సుస్వరయుక్తంగా చదివినప్పుడు పరిసరాలను అది చైతన్యవంతం చేస్తున్న సంగతిని వారు కనుగొన్నారు. గాయత్రిని జపించటంవల్ల బ్రహ్మ ప్రకాశం కలుగుతుంది. నీ బుద్ధి ప్రకాశిస్తుంది. గాయత్రియే అన్నపూర్ణ. ఈ సృష్టినంతటినీ చైతన్యవంతం చేస్తున్న శక్తి అదే!

శ్రీ సాయ గీత - భగవాన్ శ్రీ సత్యసాయ సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.

ఇంకా ఉంది