సబ్ ఫీచర్

శ్రీసాయిగీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావడి కుండలు
జీవితంలో కష్టసుఖాలు కావడికుండల్లా వుంటాయి. ఒకటిలేక మరొకటి వుండదు. సంతోషానికీ, సంతోషానికీ మధ్య విచారం. విచారానికీ, విచారానికీ మధ్య సంబరం. గులాబీ వెంటనే ముల్లుంటుంది. సాధకుడు ముల్లు తగలకుండా గులాబీని కోసుకోవాలి. తేనెటీగలు కుట్టకుండా తేనె తీసికోవాలి. అడ్డంకులకు భయపడి నీ దారినుండి తొలగరాదు. సాహసంతో ముందుకు సాగు!
నారికేళ పాకం
రామాయణం, మహాభారతం, భగవద్గీత- వీటిని బాగా పారాయణ చేయి. అయితే గుడ్డిగా కాదు. అందంగా బైండ్ చేయబడిన గ్రంథాలను కొంటారు. సాంబ్రాణి పొగో, అగరుబత్తీలో వెలిగించి ధూపం వేసి నమస్కరిస్తారు. వాటిముందు సాష్టాంగ దండప్రణామం చేస్తారు. పారాయణం ప్రారంభిస్తారు. మంచిదే. కాని, ఆ పవిత్ర గ్రంథాలు బోధించే నీతి ఏదయినా బుర్రకెక్కుతూ వున్నదా? ఆచరణలో కన్పిస్తూవున్నదా? కేవలం పైపై మెరుగుల పారాయణమేనా? పై పీచు ముఖ్యం కాదు. లోపలి కొబ్బరిని గ్రహించు, తరించు.
మిత్రమ్మన్యులు
కొంతమంది మిత్రులకు నీపై కన్న నీ జేబుపై మమకారం జాస్తి. నీ జేబులో డబ్బులు అయిపోయాయనుకో, వారిక కనుపించరు. నీకు ఏదో ఒక చెడు అలవాటుచేసి, నీతోపాటు తామూ ఆ ‘సుఖాన్ని’ జుర్రుకోవాలని చూసే సావాసగాళ్లు నీ చుట్టూ తారట్లాడుతూనే వుంటారు. వాళ్లబారిన పడ్డానా, ఇక అంతే!
మందలో కలవకు
ఎవరయినా నిన్నవమానంచేస్తే నీవు పట్టించుకోవు. అప్పుడేం జరుగుతుంది? ఆ అవమానం బయలుదేరినచోటికే తిరిగి వెళుతుంది. (నిన్నవమానించాలనుకున్న వ్యక్తే చిన్న బుచ్చుకోవాల్సి వస్తుంది). రిజిస్టర్డు లెటరువస్తే తీసుకోలేదనుకో. అదెవరు పంపారో వారికే తిరిగి వెళుతుంది కదా! ఉత్తరం తీసుకొని, అందులో సంగతులు చదివి నీ బుర్ర పాడుచేసుకోవద్దు. తిప్పి పంపిస్తే సరి! దానివల్ల నిన్నవమానం చేద్దామనుకున్న వారిని సరిదిద్దే అవకాశం కూడా నీకు రావచ్చు. అవమానం జరిగిందని ప్రతీకారం చేయాలనుకున్నావో, నీవూ ఆ మందలో కలిసిపోతావు. జాగ్రత్త!
సంతృప్తి మిన్న
కర్మమార్గంలో, ధర్మ మార్గంలో సూటిగా బ్రహ్మంవైపు పయనించు. నీ గమ్యం అదే! కర్మ చేయాలి. గత్యంతరం లేదు. ప్రతి వ్యక్తికీ విధ్యుక్త ధర్మమంటూ వుంది. అది వారి వారి ప్రవృత్తినిబట్టి, ప్రతిభనుబట్టి ఏర్పడింది. దానిని నెరవేర్చు. పాపభీతితో, దైవభక్తితో నీ ధర్మాన్ని నీవు పాటించు. అందులో కష్టం కలిగితే సహించు. నష్టం కలిగితే భరించు. గెలుపయినా, ఓటమయినా ఒకటేనని భావించు. సాధకుడిని సాగదీసి సరిగా మలచేదానికి అతనిపై పడే సమ్మెటపోటులే సంకటాలు. బయటికి కన్పించే సంపదలకన్నా లోపల వెలసి వున్న సంతృప్తి ఎంతో మిన్న. దానిని సాధించు.
అదే నివేదన
భగవంతుడే రక్షకుడు. ఇది గుర్తుంచుకో.
నీకు దిక్కు తోచనప్పుడు ఆయనే దిక్కు. ఆయనను నీవు మరచినా, ఉపేక్షించినా, వదిలేసినా కూడ ఆయనే నీకు రక్షకుడు. నీ మోక్కులాయనకు అక్కరలేదు. నీవు తెచ్చే పండ్లూ, ఫలాలూ, కానుకలూ, నైవేద్యాలూ ఆయనకెందుకు? ఆయన నిత్య సంతోషి. పూర్ణుడు, నిస్సంగుడు, దివ్య తేజుడు.
నీ కర్తవ్యం నీవు నెరవేర్చు. ఆయన కదే నివేదన.
నీలో ముగ్గురు!
ఆధ్యాత్మిక శక్తి సాధనకోసం బోలెడు ఖర్చుపెట్టుకొని ప్రపంచమంతా తిరగక్కరలేదు. నీ యింట్లోనే కూర్చో. నీలోనే ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకో! దానికోసం అక్కడా యిక్కడా తిరగక్కరలేదు. భగవంతుడు బయటెక్కడో లేడు. ఆయన నీలోనే వున్నాడు. నీవు జీవుడివే కాదు, దేవుడివి! నీవు వొకే వ్యక్తివి కాదు. నీలో ముగ్గురు వున్నారు. ఒకటి: నీ దేహాన్ని నీవు ‘నేను’అనుకుంటావు. ఆ ‘నేను’ మొదటి వ్యక్తి. ఇతరులు నిన్ను చూసి ‘నీవు’అనుకుంటారు. ఇది రెండవ రూపం. యదార్థంగా నీవు నీవే! అది మూడవ రూపం, అసలు రూపం. దేవుడెక్కడో వున్నాడనీ, ఆయనకోసం ఎక్కడెక్కడో వెదకాలనీ అనుకోకు. ఆయన నీలోనే వున్నాడు.
శ్రీ సాయ గీత - భగవాన్ శ్రీ సత్యసాయ సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.
ఇంకా ఉంది