సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్మయోగి
ప్రపంచం ఒక కొలిమి. ఒక కర్మాగారం. ఇక్కడ ఎవరికివారు నిజాయితీతో నిరంతరం కృషిచేసి, తమ భావిని తాము తీర్చిదిద్దుకోవాలి! జీవితం విసిరే సవాళ్లను స్వీకరించి నెగ్గుకొని రావటానికి భగవంతుడు యిచ్చిన తెలివితేటలను, ఆయుస్సును ప్రయోజనకరంగా వినియోగించుకోగలిగే వాడే నిజమైన కర్మయోగి!
ఒక్క భారతదేశమునే కర్మభూమి అన్నారు. ఈ దేశంలో మాత్రం వైదిక కర్మల నాచరించినంత మాత్రాన, మిగిలిన దేశాలన్నీ ఏ విధంగా అభివృద్ధికి రాగలవని సంశయం వద్దు. ఇంజన్ ఒక్క దానిలో డ్రైవర్ ఏవో కొన్ని మరలు త్రిప్పినంతనే, దాని వెనుక తగిలింపబడిన అనేక రైలుపెట్టెలు ఆ ఇంజన్‌ను అనుసరించి పట్టాలమీద నడపటం లేదా! అట్లనే, ఈ లోకంలో కర్మభూమియైన భారతదేశమునే ఇంజన్‌గాను, మిగిలిన దేశాలను రైలుపెట్టెలుగాను భగవంతుడు సంకల్పించాడు.
సహజ లక్షణం
పక్షులు పంటకోసం విత్తులు వెదపెడుతున్నాయా? జంతువులు నేలను ‘యిది నాది, అది నాది’అంటూ గిరిగీసుకొని దున్నుతున్నాయా? భగవంతుని సంతతి అయిన ప్రకృతిలో సహజంగా కన్పించేది నిష్కామకర్మే. ఆడుతూ పాడుతూ, ఎగురుతూ, దూకుతూ అవి కాలం గడుపుతాయి. ‘తాము చేసే దానికి ఫలితం ఏమిటి?’ అని అవి ఆలోచిస్తాయా? అసలా సంగతే అవి పట్టించుకోవు. దేనిపైనా ముందుగా అవి ఆశపెట్టుకోవు. అవి ఏ పనులుచేసినా తమ సహజ లక్షణంగా చేస్తాయి.
కృషి-మానసిక కృషి
వ్యవసాయం జీవనంకోసం అయితే మానసిక వ్యవసాయం జీవితంకోసం. సైన్స్ ద్వారా భౌతికమైన పదార్థాలను మలచుకొని, మనిషి మరింత సుఖవంతంగా, సౌకర్యంగా జీవించాలని చూస్తున్నాడు. అధ్యయనం నీ మానసిక ప్రవృత్తులను తగువిధంగా మలచుకొని శాంతి, సంతోషాలను పెంచుకొనటానికి, స్థితప్రజ్ఞను అలవరచుకోడానికి ఉపయోగపడాలి.
సెయింట్
మేటర్ (పదార్థం), స్పిరిట్ (ఆత్మ) అనేవి రెండు అర్థావృత్తాలు. ఈ రెండింటినే ప్రకృతి, పరమాత్మ అన్నారు. ఈనాడు మేటర్‌ను పరిశీలన చేస్తున్నారు గానీ, స్పిరిట్‌ను పరిశీలన చేయడం లేదు. సృష్టిని పరిశీలన చేసేవాడు సైంటిస్ట్. సృష్టికర్తను పరిశీలన చేసేవాడు సెయింట్.
పూజ
పూజ అంటే ఏమిటి? రోజూ యిన్ని గంటలసేపు మొక్కుబడిగా వేసికొని, తీసేసే యూనిఫాం కాదు. నీ తలపులను పూలుగా చేసి యన దోసిట్లోపోయి. నీ పనులను మధుర ప్రేమ ఫలాలుగా మార్చి ఆయన కరకమలాలకు అందించు. ఆయన పాదపద్మాలను అభిషేకించే పవిత్ర తీర్థంగా నీ కన్నీటిని వర్షించు!
ఏకాగ్రత- మననం- ధ్యానం
ఏకాగ్రత, ధ్యానం రెండూ ఒకటే అని చాలామంది అనుకుంటారు. నిజానికి రెంటికీ సంబంధం లేదు. ఇంద్రియాలకు లోబడే సంగతి ఏకాగ్రత. ధ్యానం ఇంద్రియాలకు అతీతం. చాలామందికి తమ మనస్సును ఒకచోట కేంద్రీకరించగలగటమే ధ్యానం అన్న భావన వుంది. అది చాలా తప్పు. అదే వారిని పక్కదోవ పట్టిస్తోంది. ఏకాగ్రత మనకు నిత్య నైమిత్తికంగా చేసే పనులను చక్కగా నిర్వహించటంలో తోడ్పడుతుంది. ధ్యానం ఆత్మశుద్ధికీ, ఆత్మదర్శనానికి దారితీస్తుంది.
ఏకాగ్రతకూ, ధ్యానానికీ మధ్య వున్నది మననం. అది రెంటికీ సంబంధించింది. ఏకాగ్ర చిత్తాన్ని సాధించి యింకొంచెం పైకిపోతే, రుూ లౌకిక ప్రపంచపు గొడవలు నీకు పట్టవు. లౌకిక ప్రపంచ పరిధిని అధిగమించ గలిగితే మనన స్థాయిని చేరుకుంటావు. మనస్సు ప్రాపంచిక విషయాలతో తెగతెంపులు చేసికోగలగ గానే, మనన స్థాయిని చాటి ధ్యాన స్థాయికి చేరుకుంటావు.
జన్మకు పరమార్థం
మనిషి ఆయువెంత? అతి స్వల్పము! సంసారమో, బహువిస్తారం! కాలమో? అనాది, అనంతం! నీకున్న వ్యవధిలో, నీకున్న పరిధిలో, నీకిచ్చిన పనిని నీవు పూర్తిచేయాలి. నీ ముందున్న కార్యం జటిలమే. దానిని సాధించటానికే ఎన్నో జన్మల పుణ్యాన్ని ఖర్చుచేసికొని మనుజ జన్మ ధరించావు. ఇంతకూ నీకు నొప్పచెప్పిన పనేమిటి? నీలోని గూఢంగావున్న పరమాత్మను దర్శించటం! తరించటం! అది తక్కువ పనేం కాదు, మరి!

శ్రీ సాయ గీత - భగవాన్ శ్రీ సత్యసాయ సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.
ఇంకా ఉంది