సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వామీ నీతో నీ లోనే...
మూడు సంగతులను గుర్తుపెట్టుకో.. నీవెక్కడున్నాసరే , సేవ చేస్తూనే ఉండు. ఇతరులకు సాయపడేందుకు లభించిన అవకాశాలను వదులుకోకు. ఇంకొకరి దుఃఖాన్ని బాధనూ, ఇబ్బందినీ తొలగించడానికీ నీ శక్తి యుక్తులన్నీ వినియోగించు. రెండవది నీవెక్కడ ఉన్నా ఏం చేస్తున్నా కానీ నీ సాధనను వదులుకోవద్దు. వాయిదా వేయవద్దు. అది అధ్యయనం కానీ జపం కానీ, ధ్యానం కానీ, నామ సంకీర్తనం కానీ, సేవ కానీ ఇంకేతరమైన సాధన కానీ దానిని కొనసాగిస్తూనే ఉండు. మూడవది అన్నిటికన్నా ముఖ్యం. నీవెక్కడున్నా , ఏం చేస్తున్నా, ఏ వేళనైనా స్వామీ నీతోనే ఉన్నాడన్న విషయాన్ని మరవకు.
సత్యం కన్నమించిన ధర్మం లేదు. ఈ సంగతే వేదాలు చెప్పాయి. సత్యం ఒక్కొక్కసారి మరుగున పడ్డట్టు వక్రంగా ఉన్నట్లు విఫలమైతున్నట్లు కనిపించవచ్చు. అప్పుడే భగవంతుడు అవతరిస్తాడు. సత్యాన్ని ప్రతిష్ఠిస్తాడు.
భగవంతుడు సత్యాన్ని ధరిస్తాడు. సజ్జనులు సత్యాన్ని అనుసరిస్తాడు. దుర్జనులను కూడారక్షించేది సత్యమే. ముక్తినిచ్చేది సత్యమే. శక్తి నిచ్చేదీ సత్యమే. మనసులోని సందేహాలను తొలగించి అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి వెలుగిచ్చేది సత్యమే. దివ్య ప్రకాశం సత్యమే. దైవాన్ని ఆహ్వానించు. నీ గుండెలో నిలుపుకో. బ్రహ్మం గురించి సదా తపించు. బ్రహ్మజ్ఞానాన్ని పొందు. అప్పుడే నీవు బ్రాహ్మణుడివి కాగలవు.
పురాణ సారం
వ్యాస మహర్షి లోకగురువు. ఆయన పద్దెనిమిది పురాణాలను రచించాడు. ఆ పురాణాల సారం ఏమంటే
శ్రూయతాం ధర్మ సర్వస్వమ్
యదుక్తం గ్రంథ కోటిభిః
పరోపకారః పుణ్యాయ
ఆపాయ పర పీడనం
‘పుణ్యం’ అంటే ఇతరులకు ఉపకారం చేయటం.
‘పాపం’ అంటే ఇతరులకు హాని చేయడం.
అన్ని పురాణాల సారం ఇదే. కోటి గ్రంథాలు చదివినా ఇంతకు మించి ఇంకేమీ లేదు.
ఇతరులకు మేలు చేయి. అదే ఔషధం, ఎవరికీ అపకారం చేయకు. తలపెట్టకు. ఇదే పథ్యం .
సుఖదుఃఖాలకు , మానవమానాలకు, కలిమిలేములకు ఇలాంటి ద్వంద్వాలతో బాధపడుతుంటారు లోకులు.
సమదర్శనం (అన్నింటినీ ఒకే విధంగా చూడటం) వారికి చేతగాదు. సంసారమనే రోగానికి సేవే చికిత్స.
ఆత్మ దర్శనం
‘విమానాన్ని చక్రాలెందుకు?’ అని కొందరు అడుగుతారు. ఆకాశంలోకి ఎగరడానికి ముందు కొంత దూరం విమానం రన్‌వే పైన పరుగెత్తాల్సి ఉంటుంది. ఆకాశంలోకి లేచిన తర్వాత చక్రాలను అది లోనికి ముడుచుకుంటుంది. సాధకుడు అధ్యాత్మికంగా ఒక స్థాయికి వచ్చిన తరువాత నియమాలు అన్నింటినీ విమాన చోదకుడు విమాన చక్రాలను లోనికి తీసుకొన్నట్లుగానే సాధకుడు ఒక స్థాయికి వచ్చిన తరువాత అతడూ తన నియమాలను సడలించుకోవచ్చు. ఇతరులకు సేవా సమితి ద్వారా సేవ చేస్తూనే నీ ఆధ్యాత్మిక అభ్యున్నతి కోసం సాధన చేస్తూనే ఉండాలి. పరసేవ ఆత్మసేవ ఈ రెండూ ధన ఋణ ధృవాలవంటివి. రెండూ కలసి ఆనందం అనే మెరుపు వస్తుంది. అన్ని ఆందోళనలూ, భయాలు, ఆత్రుతలూ ఆ ఆనంద ప్రవాహంలో కొట్టుకొని పోతాయి. సేవ, సాధనల ద్వారా ఆత్మ దర్శనం చేయండి. మీకివే నా ఆశీస్సులు.
అలోల యోగం
ముఖ్యం ఈ మూడు
అవతారస్వరూపుని అనుగ్రహం లభించాలంటే ముఖ్యంగా మూడు గుణాలను అలవర్చుకోవాలి. ఒకటి. ఏ పని స్వార్థ బుద్ధితో చేయకు.నలుగురికీ ఉపయోగపడాలనే తత్వాన్ని పెంచుకో. రెండు సాధన. అంతా ఆత్మదర్శనా పేక్షతో చేయి. చిత్త శుద్ధి అన్నింటికన్నా ముఖ్యం.
రెండు సాధన చేయి. ఆత్మదర్శనాపేక్షో చేయి. మూడుచిత్తశుద్ధి అన్నిటికన్నా ముఖ్యం.
ఇంకా ఉంది

శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.