సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమానుబంధం
నేను ఉంగరాలనూ, తాయత్తులనూ, అర్చామూర్తులనూ అనుగ్రహిస్తుంటాను. ఎందుకో తెలుసా? వాటిని అందుకొన్నవారికీ, నాకూ మధ్య ఒక అనుబంధాన్ని అవి ఏర్పరుస్తాయి. వారికేదన్నా ఆపద కల్గినప్పుడు క్షణమాత్రంలో అవి నావద్దకు వచ్చి, కావలసిన శక్తిని గ్రహించి క్షణమాత్రంలో వెనక్కు వెళ్లిపోతాయి. ఆపదనుండి భక్తుని గట్టెక్కిస్తాయి.
ఉంగారాలూ, తాయెత్తులూ అవీ వున్నవాళ్లకే నా కృప పరిమితం అనుకోవద్దు. ఆర్తిగా ననె్నవరు పిలిచినా, ఏ పేరుతో పిలిచినా, ఏ రూపుతో కొల్చినా అందరికీ నా అనుగ్రహం లభిస్తుంది.
నాతో ప్రేమానుబంధం ఏర్పరచుకో! నా కృపామృతాన్ని అందుకో!
దూరం
స్వామికి అనుగ్రహం రాలేదని కొందరు అంటుంటారు. అది సరికాదు. నీ హృదయంపై కప్పిన మాలిన్యం పొరను నీవు గీరివేశావా, కృపారసం నీ గుండెకు అంటటానికి? ఏవేవో అవసరాలకోసం వస్తావు. ఎక్కడో వుంటావు. అంటే నీవు ఎంత దూరంలో కూచున్నావని కాదు. నీ మనసు ఎంత దూరంలో ఉంది-అని. నా దృష్టిలో దూరాన్ని మీటర్లలోనూ కిలోమీటర్లలోనూ కాదు కొలిచేది. ఆర్తి తీవ్రతనుబట్టి కొలవాలి. నీవెంత ఆర్తిగా పిలుస్తే నేనంత తొందరగా పలుకుతాను. నిజానికి, నేనెక్కడో లేను, నీతోనే వున్నాను. సదా నీలోనే వున్నాను. ఆ సంగతి నీవెరగవు. ఇప్పటికైనా ఆ సంగతి నీవు గ్రహించు. నన్నుపయోగించుకో. భగవాన్‌కై తపించు. తరించు.
నా ఫోన్ నాదే!
మీరు నాకు ఫోన్‌చేస్తారు. నేను దొరుకుతాను. ఎవరికి? ఎవరు మనసారా ఆర్తితో పిలుస్తున్నారో వారికి! ‘నీవు నా దేవుడివి కావు’, అంటారు కొందరు. ‘కాను’అంటానే్నను. నీవే మా దేవుడివి!’ అంటే అవునంటాను. నేను మీ గుండెలో వుంటే మీకు ఫోనులో దొరికినట్లే! కాని గుర్తుంచుకోండి! నా పోస్టు మీరనుకునేది కాదు వేరే! నా ఫోనూ వేరే! వాటికి పోస్టుడబ్బాలూ, టెలిఫోను తీగలూ అక్కరలేదు. మీ హృదయంనుండి నాకు సరాసరి కబురందుతుంది. ఈ విధానంలోనూ నియమాలూ, నిబంధనలూ వున్నాయి. వాటిని శాస్త్రాలు చెప్పాయి. మీరు వాటిని తెలుసుకోవచ్చు.
జ్ఞానాగ్ని దగ్ధకర్ములు
మీరు పుట్టపర్తికి రాగానే సరిపోతుందా? నా సంకల్పం, నా అనుగ్రహం లభించాలంటే సాధన చేయాలి.
పూర్వజన్మ సంచితంపోదు అని కొందరంటుంటారు. అది తప్పు. ప్రారబ్ధాన్ని కూడా భగవాన్ దగ్ధంచేయకలరు. నిప్పుకణం పడితే గుట్టంత దూది ఎలా తగలబడి పోతుందో, అలాగే ఎంతటి ప్రారబ్ధాన్నైనా, భగవత్సృప నిశే్శషంగా దగ్ధంచేస్తుంది. అందుకే ‘జ్ఞానాగ్ని దగ్ధకర్మం’ (జ్ఞానమనే నిప్పుతో దహించబడిన కర్మ) అని చెప్పటం జరిగింది. కర్మ అనే గుట్టంత దూదిని జ్ఞానకణం క్షణంలో దహించగలదు.
ఫలం, పత్రం
నాదగ్గరకు వచ్చేవాళ్లు పండ్లు, పూలు మొదలయినవి తేవద్దు అన్న ప్రకటన మీరు చూసే వుంటారు. అది చూసి మీలో కొందరికి విచారం కలిగి వుండొచ్చు. నాకు తెలుసు. నాదగ్గరకు వుత్త చేతులతోనే రండి! మీ చేతుల నిండా అనుగ్రహాన్ని నింపుతాను. మీ చేతుల నిండా పండో, పత్రమో వుంటే నా కృపను ఎక్కడపోయను?
దూషణ
విమానం ఫలానాచోట దిగుతుంది. ఎందుకు? అంతకుముందే అక్కడ టికెట్ కొని సీటు రిజర్వుచేయించుకొన్న వారిని ఎక్కించుకొని పోయేందుకు. భగవంతుడు కూడా అవతరించాడు. ఎందుకు? అర్హులైనవారికి ముక్తినిచ్చి రక్షించేందుకు. మిగిలినవారు కూడా ఆయనను గురించి తెలిసికొంటారు. ఆయన కృపనుపొందే మార్గాలను అనుసరిస్తారు. ముక్తి సంపాదించుకుంటారు. అయితే కొంతమందికి విమానం ఎక్కేందుకు అవకాశం లభించదు. వాళ్లు కోపంగా విమానాన్ని తిట్టుకుంటారు. కాని విమానానికి కోపం వస్తుందా రాదు. అలాగే తాము కోరింది జరగలేదని కొందరు అవతారమూర్తిని విమర్శిస్తారు. దూషిస్తారు. ఆయనకవేం పట్టవు.
ఓటమికి తావు లేదు
ఈ సాయి అవతారంలో ఓటమికి తావేలేదు. నేననుకున్నది అవుతుంది. నేను సంకల్పించింది జరుగుతుంది.
నేనే సత్యం, సత్యానికి జంకూ, కొంకూ వుండవు. సంకోచాలకూ, సందేహాలకూ అతీతమైనదే సత్యం.
వారూ నా వారే!
అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాల్లోనూ, హాంకాంగ్‌లోనూ వున్న భక్తులు సత్యసాయి భక్తమండలులనూ, స్టడీ సర్కిల్స్‌నూ స్థాపించుకొంటున్నారు. నేను తెలుగులో యిచ్చిన ప్రసంగాలను విని అర్థంచేసికోడంకోసం వారు తెలుగు నేర్చుకుంటున్నారు కూడ.నావరకు నాకు అంతా వొకటే. ఒకరు దగ్గరా, మరొకరు దూరం కారు. అంతా నావారే. కొంతమంది నాకు దూరంగా వుండాలని చూస్తారు. భగవంతునికి అంకితమైతే వారూ నాకు దగ్గరివారే. ఏ నామంతో, ఏ రూపంతో వారు భగవంతుని సేవించినాచాలు వారూ నావారే అవుతారు.
ఇంకా ఉంది