సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏసు
జీసస్ పుట్టినప్పుడు ముగ్గురు అరేబియన్ సాధువులు అక్కడ చేరారు. అందులో ఒకరు ఆ బిడ్డను చూచి ఇతను దైవమును ప్రేమించేటటువంటివాడుగా తయారవుతాడు అన్నాడు. రెండవ సాధువు చూచి దైవముచేత ఇతను ప్రేమించబడుతాడు అన్నాడు. మూడవవాడు చూచి దైవమే ఇతను, ఇతనే దైవము అన్నాడు. భగవంతుడిని ప్రేమించేటటువంటివాడు దైవదూత. భగవంతుని ప్రేమకు గురి అయినటువంటివాడు దేవుని కుమారుడు. ఈ దివ్యతత్త్వాన్ని ఏకత్వంగా భావించుకొని ఆనందించేటటువంటివాడు తండ్రి కుమారుడు. ఈ యిరువురూ ఒక్కరే. కనుక మనం మొట్టమొదట భగవంతుని ప్రేమించేటటువంటి దూతలుగా తయారుకావాలి. అప్పుడే మనం మెసెంజర్ ఆఫ్ గాడ్ అవుతాం. అయితే మెసెంజర్ ఆఫ్ గాడ్ అని పేరుపెట్టుకొని దైవముయొక్క సందేశమును విరుద్ధంగా జగత్తుకు చాటటంలో ఏమాత్రం అర్థం ఉండదు. ఇట్టి వారందరూ ‘మెసెంజర్స్’కారు. ‘మిస్-ఎంజర్స్’ అనగా పక్కదారి పట్టినవారు, తమయొక్క దివ్యత్వాన్ని కోల్పోయినటువంటివారు. దైవవాణిని జగత్తునకంతా చాటటానికి అందరూ పూనుకోవాలి.
జన్మదినం
నా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని నాకుండదు. అటువంటి స్వల్పమైన విషయాలపైకి నా మనసుపోదు. నా వొకేఒక కోరిక నా ఆనందాన్ని మీ అందరితో పంచుకోడం. మీకు ఆనందం కలిగినరోజే నా పుట్టినరోజు. ‘లోకాస్సమస్తాస్సుఖినో భవంతు’- అన్నదే నా ఆకాంక్ష. అన్ని లోకాలూ సుఖంగా, సౌభాగ్యవంతంగా వుండాలి. మానవాళి అంతా వొకటేనని గ్రహించు, ప్రేమ, సేవలతో ప్రతివ్యక్తిలో సంతోషాన్నీ తృప్తినీ పెంచు. అందరి మనసులలో అదే కోరికను, తపనను నింపు.
సాయియే సాక్షి
‘సా’అంటే సర్వసాక్షి. ‘అయి’అంటే అమ్మ, ఇక బాబా అంటే ఏమిటి? తండ్రి. కనుక సాయియే తల్లీతండ్రీ. మాతాపితరుల ప్రేమను నిరంతరం నీకందిస్తుంటాడు. నీ ఆలోచనలకూ, మాటలకూ, చేతలకూ ఆయనే సాక్షి.
స్వామి ఉండగా...
స్వామి దగ్గరనుండి ‘అది తెచ్చాం, యిది తెచ్చాం’అంటారు కొందరు. స్వామి ‘నాకిది అనుగ్రహించారు. అది అనుగ్రహంచారు’అంటారు మరికొందరు. వాళ్లందరితోటి ఎందుకు? వరదుడు ఇక్కడే వున్నాడు. నీ ఎదురుగా! కామధేనువు ఎదుట వుండగా, ఆవుల బేరం నీకెందుకు? కల్పతరువు నీ పెరట్లో వుంది. నీవేది అడిగినా అది యిస్తుంది. ఇక నీకు ఆ చెట్టుతో, రుూ చెట్టుతో ఏం పని? మేరుపర్వతం నీ ముంగిట్లో వుండగా, బిచ్చగాళ్ల నడుగుకోటం ఎందుకు? బంగారం, వెండీ ఎందుకు?
మీమధ్యకు భగవాన్ వచ్చారు. మీకు అండదండగా వున్నారు. మొరటు వాళ్లనీ, మూర్ఖులనూ ఆశ్రయించటం ఎందుకు?
సుదినం
ఏనాడూ భక్తులు తన్మయతత్వంతో స్వామి నామాన్ని మధురంగా గానం చేస్తారో ఆరోజు నిజంగా సుదినం!
ఏనాడూ పేదల కన్నీళ్లు తుడుస్తామో. ఏనాడూ అంతా అన్నదమ్ముల్లా దగ్గరవుతామో ఆరోజు నిజంగా సుదినం!
ఏనాడూ భగవాన్ మనవద్దకు వచ్చి దేవదేవుని దివ్యగాథలను వినిపిస్తారో ఆరోజే నిజంగా మనకు సుదినం!
మిగతా రోజులన్నీ సుదినాలుకావు తద్దినాలూ, దుర్దినాలూ!
ప్రేమ ‘మిరకిల్’
సాయి చెప్పింది చేయి! నీ మనసులో చేరిన సైతాన్‌ను ఎదుర్కో! కడదాకా పోరాడు! ఆటకట్టించు! అప్పుడే నా ప్రేమకు సంపూర్ణంగా పాత్రులౌతారు.
నేను చేసే అద్భుతాలన్నిటిలోకీ మిన్న నా ప్రేమే! మానవులందరి వాత్సల్యం ప్రేమవల్ల పొందగలవు. అప్పుడంతా చక్కబడుతుంది. బాగవుతుంది.
ప్రేమను విశాల హృదయంతో అందరికీ పంచు, సంకుచితంగా ప్రవర్తించకు!
ఒకటే -రెండు కాదు
నేనేం చేసినా అది ప్రచారంకోసం కాదు. ఇతరులను ఆనందపరచటానికీ కాదు. నేనానందించటానికా? నాకితరులను సంతోషపెట్టాల్సిన పనేముంది? ఇంకొకరి ఆమోదాన్నీ, ప్రశంసలనూ అందుకోవాలన్న తాపత్రయమూ నాకు లేదు. ఎందుకని? నీవే నేను. నేనే నీవు కనుక. అందరికీ చైతన్యం యిచ్చే శక్తినినేనే కనుక.
నేను వేరు, తామువేరు అనుకొనేవాళ్లు భ్రమలో వున్నారు. ‘నేను’ ‘మనం’ రెండు కాదు. ఒకరమే. ఏకమేవా ద్వితీయం. ఉండేది ఒక్కటే- రెండుకాదు. స్వామి మీ హృదయంలోనే వున్నారు. ఇంక ఏ సందేహాలతోనూ సతమతం కావొద్దు, అజ్ఞానులనే వీధికుక్కలు మొరుగుతూ వుంటేనేం. సత్యమనే ఏనుగు హుందాగా రాజమార్గాన సాగిపోతూనే వుంటుంది.
స్పందన
నీవుండే యిల్లు ఈ దేహం. అలాగే భగవంతుడుండే యిల్లు ప్రపంచం. ఒక చిన్న చీమ నీ కాలివేలిపై కుడితే వెంటనే నీ మనస్సు అది కుట్టినచోటికి వెళుతుంది. చేయి ఆ చీమను తీసి పారేసేందుకు అక్కడ వాలుతుంది.
ఎక్కడ ఏ ఉపద్రవం కలిగినా నీవు అలాగే స్పందించాలి. ఎంత దూరంలో జరిగినాసరే. ఆ ఉపద్రవం కారణంగా బాధపడేవారిపట్ల నీకు సానుభూతి, ప్రేమకలగాలి. అంతా నీ బంధువులే, అందరికీ నీవు సాయం చేయాలి.
ఇంకా ఉంది