సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిన్ను నీవు తెలుసుకో
నీవెవరవో నీవు తెలుసుకో. అప్పుడే నీకు శాంతి కలుగుతుంది.
వెనకటికి ఎవరో తన పేరు మరచిపోయాడట! నీవు వాడిలాగా వున్నావు. నువ్వెందుకు వచ్చావు రుూ లోకంలోకి! అది మరచిపోయావు. నీ పనేమిటో నీకు గుర్తులేదు. ఇప్పటికైనా నీ కర్తవ్యాన్ని గ్రహించు. అంతర్ముఖుడివికా. అప్పుడే నీకు భద్రత, శాంతి లభిస్తాయి. ఇందుకే నీ బుద్ధికి పదును పెట్టుకో. సత్సంగత్యం, జపం, ధ్యానం, నామస్మరణ యిత్యాదులతో మనస్సును క్షాళనం చేసికో. సత్యాన్ని దర్శించే ప్రయత్నం చేయి!
అశాంతి పర్వం
మనిషి తాను చేస్తున్నదే మంచిదనే భ్రమలో వున్నాడు. అజ్ఞానం వల్ల, పెడబుద్ధివల్ల శాస్త్రాలను ఉపేక్షిస్తున్నాడు. మానవత్వాన్ని వదిలి దానవత్వాన్ని అవలంబిస్తున్నాడు. ద్వేషం, ఈర్ష్య, అసూయ, మోక్షం, గర్వం మొదలయిన వాటికి దాసుడై తనకు మంచి ఏదో తానే మరచిపోతున్నాడు. విస్తృతమైన తన సంస్కృతీ సంపదలను పక్కకు నెట్టేశాడు. వీటన్నిటి ఫలితం ఏమిటి? మనశ్శాంతి లేకుండా పోవటమే. సమాజంలో శాంతి లేకపోవటం. దేశదేశాల మధ్య శాంతి లేకపోవటం.
సిగ్గుచేటు
భారతదేశం ఆసియా జ్యోతిగా పేరొందింది. పశ్చిమ దేశాలకు జ్ఞానభిక్ష పెట్టింది. కాని ఆ భారతమాత బిడ్డలు నేడు అజ్ఞానాంధకారంలో మగ్గుతున్నారు. పశ్చిమ దేశాల వారి సైన్సును చూసి అబ్బురపడుతున్నారు. అశాంతిని అనే్వషిస్తున్నారు. తమ అమూల్య వైదిక వారసత్వాన్ని విస్మరించి గుడ్డివారిలా ప్రవర్తిస్తున్నారు. ఇది జాతికే సిగ్గుచేటు.
అంతా జయమే!
నీ వెంట భగవాన్ వుండి నీ ఆలోచనలనూ, నీ మాటలనూ, నీ పనులనూ గమనిస్తున్నారని గ్రహించు. అందరిలోనూ నిన్ను చూచుకో. నీలో అందరినీ చూసుకో. అదే శాశ్వతానందానికీ, శాంతికీ బాట.
బాహ్య ప్రపంచ సామ్రాజ్యం మనకెందుకు? ఆత్మ సామ్రాజ్యానికి అధిపతులం అవుదాం! లోపలి శత్రువును వదిలేసి, వాడు రోజురోజుకూ బలపడుతుంటే ఉపేక్షించి, బయటి శత్రువులపైకి దండెత్తి ప్రయోజనం ఏమిటి? మన వెంట శ్రీ కృష్ణుడుండగా మనసు ఓడించగలవారెవరు? ఆయన దయ వుంటే చాలు. అంతా జయమే!
ప్రశాంతి
సినిమాకు వెళ్లి వస్తావు. వెళ్లేటప్పటికన్నా వచ్చేటప్పుడు నీ మనసు ఎక్కువ ప్రశాంతంగా వుంటోందా ఆలోచించు. సినిమా చూస్తుంటే నీకెంతో ఉద్రేకం కలుగుతుంది. నీలో ఆవేశకావేశాలను రెచ్చగొట్టినట్లవుతోంది. పాశవిక ప్రవృత్తిని రేకెత్తిచ్చినట్లవుతుంది. దీనికి బదులు వౌనంగా వుంటావు. జపమో, ధ్యానమో చేస్తావు. భజన చేస్తావు. అప్పుడెంత ప్రశాంతి కలుగుతుందో చూడు. నీకెంత బ్యాంక్ అకౌంటున్నప్పటికీ, నీకెన్ని డిగ్రీలున్నప్పటికీ, నీవెంత కండలు పెంచిన వస్తాదువైనప్పటికీ, అటువంటి ప్రశాంతి లభిస్తున్నదా? ఆలోచించు.
శాంతి ఎక్కడ?
ఈరోజుల్లో అందరికీ సుఖం కావాలి. వొళ్లలవకుండా చేసే వుద్యోగాలు కావాలి. మంచి పలుకుబడిగల పదవులు కావాలి. బంగళాలూ, కార్లూ, ఆస్తులూ కావాలి. కాని వాటన్నిటికన్నా ముఖ్యం, ‘నాకు శాంతి కావాలి’, అన్న తపన ఏది? సుఖం, శాంతి రెండూ వొకటే నన్న గందరగోళంలో పడ్డారు జనం. ఏది, ఏదో వారికే తెలియదు. బాగా డబ్బున్నవాళ్లు, పదవి వున్నవాళ్లు, పలుకుబడి వున్నవాళ్లు శాంతి లేకుండా వున్నారు. ఇది నిజమో కాదో నీవే విచారించు. తెలిసికో. బ్యాంకు పాస్ బుక్కులలో శాంతి దొరకదు. బంగళాలలో అది కనిపించదు. గోదాములలో యినప్పెట్టెలలో అది లభించదు. నీ ఆలోచనే తారుమారుగా వుంది.
వట్టి మాటలు కట్టిపెట్టు
నీవు అనుకొంటున్న దానినే బయటకు చెప్పటం నేర్చుకో. అనుకొనేదొకటి, అనేదొకటీ కారాదు. ద్వేషంతో సెగలు పొగలు కక్కుతూ, మనిషి యుద్ధానికి దిగుతాడు. పైకి మాత్రం శాంతి వచనాలు పలుకుతూ, శాంతి సదస్సులు నిర్వహిస్తాడు. తను శాంతికోసం చేస్తున్న కృషి గురించి గొప్పలు చెప్పుకుంటాడు. ఏం లాభం? ముందు మీ హృదయాన్ని శాంతి మంటపం చేయండి. ఆత్మవంచనకూ, పరుల వంచనకూ తప్ప పనికిరాని శాంతి సదస్సులతో అప్పుడు పని వుండదు. వట్టి మాటల వల్ల ఏం వొరుగుతుంది?
శాంతి సాధన
మానవుని సహజ స్వభావం ఏమిటి? శాంతి! అశాంతి కాదు. శాంతి పొందటానికి మనిషి రకరకాల మార్గాలు అనుసరిస్తున్నాడు. బాగా సంపాదించుకొంటున్నాడు. బాగా కండలు పెంచుకొంటున్నాడు. కళలూ, శాస్త్రాలూ అభ్యసిస్తున్నాడు. అయితే యిందువల్ల శాంతి లభిస్తున్నదా? లేదు. ఎందువలన? ఈ కోరికలన్నీ తీరుతున్నా, మనిషిలో నిజమైన కోరికలున్నాయే అవి తీరటల్లేదు. నిజమైన కోరిక అంటే ఏమిటి? సత్యదర్శనం చేయాలన్న కోరిక వుంటున్నది. అమృతత్వం సాధించుకోవాలన్న కోరిక వుంటున్నది. ఇవి దేహంకోరే కోరికలు కావు. దేహి కోరుకునేవి. ఈ కోరికలు తీరినప్పుడే దేహిసత్యాన్ని దర్శిస్తాడు. జ్యోతిని చూస్తాడు. అమృతత్వాన్ని పొందుతాడు. శాంతి సిద్ధిస్తుంది.
ఇంకా ఉంది