సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైత్రీ
నిజమైన శాంతి ఎలా లభిస్తుంది? స్నేహంవల్ల, ‘శాంతికి పునాది మైత్రి’ అంటుంది వేదం. మైత్రి అంటే స్నేహం, కరుణ, దయ- ఈ మూడింటి కలిమిడి, మైత్రీ అంటే నా మాట, నా చేత, నా ఆలోచన, ఈ మూడూ ఒకే విధంగా వుండటం. అంటే, థ్రికరణ శుద్ధి. దీనినే ప్రహ్లాదుడు ‘తను హృద్ భాషల సఖ్యము’ అన్నాడు. ‘మన స్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం మహాత్మనాం’. మహాత్ములకు మనసు, వాక్కు, కర్మలలో తేడా రాదు, ఒకటే.
పరస్పరం అర్థం చేసికొంటూ, ఏ పొరపొచ్చాలూ లేకుండా అంతా ఒకే మాట, ఒకే బాట, ఒకే ఆలోచనగా మెలగటమే మైత్రీ అంటే.మీ కళ్లు తెరిపించాలని నాకెందుకీ తాపత్రయం? ఊబిలో యింకా యింకా కూరుకొని పోకముందే మిమ్మల్ని బయటికి లాగాలని ఎందుకీ ఆరాటం? మీ పట్ల నాకుండే ప్రేమే అందుకు కారణం!
ముగ్గుర్నీ కలుపు- ముక్తి!
ఒక గృహమునందు ముగ్గురు వ్యక్తులు నివసించు సమయంలో ఒకరినొకరు అర్థము చేసుకొని, ఒకరినొకరు అనుసరించి అన్యోన్యముగ జీవించినప్పుడు అదియే స్వర్గము. అదియే అమృతము. అదియే ఆనందము. ఈ విధముగా గాక గృహములో మువ్వురూ మూడు మార్గములను అనుసరిస్తూ, ఒకరినొకరు అర్థం చేసుకొనక, ఒకరినొకరు భిన్న భావములను అనుసరిస్తూ ద్వేషిస్తూ, జీవించినప్పుడు ఇంతకంటే నరకము మరొకటి లేదు. స్వర్గ నరకములు రెండును కూడనూ మానవుని యొక్క ప్రవర్తనలపై ఆధారపడి ఉంటున్నవి. మన దేహమే గృహము. ఈ గృహములో మనోవాక్కర్మలనేటువంటి ముగ్గురు వ్యక్తులు జీవిస్తున్నారు. కనుక ఈ మనస్సు, వాక్కు, ప్రవర్తన ఈ మూడింటి ఏకత్వమే నిజమైన మానవత్వము. దీనినే వేదాంత పరిభాషయందు ‘త్రికరణ శుద్ధి’ అన్నారు. మనస్సు తలంచిన దానిని మాట రూపకంగా వెల్లడి చేయడం, మాటతో వెల్లడి చేసిన దానిని హస్తరూపకముగా ఆచరించటము- ఈ మూడింటి ఏకత్వమే నిజమైన మోక్షము.
ఆచరణ ముఖ్యం
బోధించటం కాదు, ఆచరించటం ముఖ్యం. రాజకీయ రంగాన్ని తీసుకున్నా, విద్యారంగాన్ని తీసుకున్నా, పరిపాలనా రంగాన్ని తీసుకున్నా, ఆఖరుకు ఆధ్యాత్మిక రంగాన్ని తీసుకున్నా ఆదర్శాలు వల్లించే వారికి కొదవ లేదు. కాని ఆచరించేవారే కరవయ్యారు. వేదికలపైన అంతా హీరోలే కాని, ఆచరణలో జీరోలు. ప్రేమ శాంతి, సంతోషాలను ఎలా వర్షిస్తుందో నీ జీవితంలో నీవే ఋజువు చేయి. అన్ని మతాలూ ఒకే లక్ష్యంవైపు తీసుకొనిపోతాయి అన్న విషయాన్ని అనుభూతి పూర్వకంగా చాటు. అంతా సోదరులేనన్న విషయం ఆచరణలో చూపు.
ఇదే మలుపు!
‘నీ దేహాన్ని మంచి పనులకు ఉపయోగించాలి’, అన్న శ్రద్ధ నీకు కలిగిందనటానికి నిదర్శనం నీవు ప్రశాంతి నిలయానికి రావటమే. ఇదే నీ జీవితంలో గొప్ప మలుపు. నీకూ, మీ అందరకూ నాతో వున్న బంధుత్వం అనాది. అది శాశ్వతానుబంధం. దానికి లౌకిక సంబంధం లేదు. హృదయంలో పొంగి పొరలే దివ్యమైన ఆకాంక్షలవల్ల మన సంబంధం ఏర్పడింది. అందువల్ల హృదయమే ప్రశాంతి నిలయంగా మారుతుంది.
అప్పుడన్ని తీర్థాలూ, క్షేత్రాలూ నీకు నీలోనే దర్శనమిస్తాయి. ఊరూరూ పట్టుకొని తిరిగే పనుండదు.
ఈ విజయం సాధించకుండా రామభక్తుడననీ, కృష్ణ భక్తుడననీ, ఇంకేదో దేవుని భక్తుడననీ చెప్పుకొనే అర్హత నీకు లభించదు.
నా సందేశం
ఈత రానివాడు యింకొకరికి ఈత ఎలా నేర్పుతాడు? ఇంట్లో బియ్యం నిండుకుంటే సంతర్పణ చేసేదెలా? ఇంకొకరికి ప్రేమ, భక్తి, స్థిరచిత్తం, శాంతి, సమదృష్టి మొదలయిన వాటిని గురించి చెప్పాలంటే నీవు వాటిని సంపాదించుకోవాలి. తామేది చెబుతున్నారో అది చేయటానికి పూనుకోని గురువుల వల్లనే భారతదేశం అనేక విధాలుగా హేళనకు గురయింది.
నా సందేశాన్ని ప్రపంచమంతటా చాటాలన్న ఉత్సాహం మీ అందరికీ ఉందని నాకు తెలుసు. కాని దానికి ఒక చక్కని మార్గం ఉంది. ముందు మీరు నేను చెప్పింది ఆచరించి చూపండి! అప్పుడే నా సందేశం దిగంతాలకు పాకుతుంది.
వేస్టా? బెస్టా?
కొంతమంది అజ్ఞానులకు భజనలన్నా, పూజలన్నా, జపాలన్నా నవ్వులాటగా వుంటుంది. ‘అంతా వుత్తటైంవేస్ట్!’ అంటుంటారు వారు. నీళ్లు పెట్టిన పొలంలో బస్తాలకొద్దీ వడ్లను (విత్తనాలను) గుమ్మరిస్తుంటే చూసి, తిండి గింజలన్నీ పాడుచేస్తున్నారని నవ్వుతారేమో ఆ పెద్దమనుషులు! కాని మనం నేలపై గుమ్మరించిన ప్రతి బస్తా ధాన్యానికీ పదిరెట్లు కొద్ది మాసాలలోనే పుడమితల్లి మనకు తిరిగి యిస్తుందని మీకు తెలుసు!
భగవచ్చింతనలో గడిపిన కాలమే సద్వినియోగం అయినట్లు! దానివల్ల మీకు మనశ్శాంతి, మనోబలం లభిస్తాయి.
ఇంకా ఉంది