హీరోగా జక్కన్న తనయుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజవౌళి తనయుడు కార్తికేయ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడా? ప్రస్తుతం నటనపరంగా శిక్షణలో ఆరితేరుతున్నాడా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. బాహుబలి సినిమాతోపాటు జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరక్టర్‌గా, కొన్ని సినిమాకు పబ్లిసిటీ డిజైనర్‌గా కార్తికేయ వర్క్ చేశాడు. నాని నటించిన మజ్ను సినిమాలో రాజవౌళితోపాటు కెమెరా అప్పియరెన్స్ ఇచ్చిన కార్తికేయ ఇప్పుడు నటనకు సంబంధించిన శిక్షణను తీసుకుంటున్నాడని సమాచారం. తాత (విజయేంద్రప్రసాద్) స్టార్ రైటర్. తండ్రి పెద్ద డైరెక్టర్. ఆ ఫ్యామిలీకి సంగీత దర్శకుడు కీరవాణి సపోర్టు ఎలాగూ వుంది. ఇంతమంది దిగ్గజాలు వెనకుండగా కార్తికేకు భయమేల? ఇక ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం.