Others

దేశ విభజనకు ‘కామ్రేడ్ల’ మద్దతు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలగమనంలో డెబ్బయి సంవత్సరాలంటే దేశ ప్రగతికి సంబంధించి పెద్ద అవకాశాన్నిచ్చిన వ్యవధి సుమా! స్వాతంత్య్ర సమరం, స్వరాజ్య కాంక్ష నెరవేరిన సందర్భం, ఆ తర్వాతి పరిణామాలను, చారిత్రక వాస్తవాలను మనం ఎన్నటికీ విస్మరించలేం. మన దేశానికి బ్రిటిష్ వారి నిరంకుశ పాలన నుంచి స్వతంత్య్రం రావడమే కాకుండా, కొన్నివేల సంవత్సరాల నుంచి అఖండంగా వున్న దేశం రెండు ముక్కలైంది. ఇప్పుడు కొంచెం క్లుప్తంగా ఆ విషయాలను నెమరు వేసుకుందాం. ఏ విధంగా చూసినా గతం లేని వర్తమానం వుండదు కదా!
1947లో దేశంలోని రాజకీయ పక్షాలు దాదాపుగా రెండే రెండు. ఒకటి కాంగ్రెస్, రెండవది కమ్యూనిస్టు పార్టీ. కాంగ్రెస్‌కు మహాత్మాగాంధీ నాయకత్వం. ఆ పార్టీ సారధ్యంలోనే 1942 ఆగస్టులో ‘క్విట్ ఇండియా’ ఉద్యమం నడిచింది. కమ్యూనిస్టు పార్టీ నిర్మొహమాటంగా ఈ దేశ విభజనను పూర్తిగా బలపరిచింది. ఆ వివరాలు గమనిద్దాం. దీనికి చాలా ‘బాక్‌గ్రౌండ్’ ఉంది. అప్పట్లో మన కమ్యూనిస్టుల రాజకీయాలన్నీ సోవియట్ రష్యా చుట్టే తిరిగాయి.
స్టాలిన్-హిట్లర్ ఒప్పందం..
1939 ఆగస్టు 23న రష్యా, జర్మనీ అధినేతలు స్టాలిన్, హిట్లర్‌లు ఒక అంగీకారానికి వచ్చారు. ప్రపంచ కమ్యూనిస్టు పార్టీలు అన్నీ మొదట్లో బిత్తరపోయినా తరువాత దీనిని ‘సోవియట్ యూనియన్, మిగతా ప్రపంచ మానవాళి మధ్యగల బంధాల సమానత్వం’ అని అభివర్ణించాయి. సెప్టెంబర్ 3న బ్రిటన్-ఫ్రాన్స్‌లు జర్మనీ మీద యుద్ధం ప్రకటించాయి. సెప్టెంబర్ 17న రష్యా పోలండ్‌లో తన భాగం తీసుకునేందుకు ఆ దేశంలోకి ప్రవేశించింది. 1939 డిసెంబర్‌లో రష్యా ఫిన్‌లాండ్‌ను ముట్టడించింది.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 1939 ఆగస్టు 9,10 తేదీలలో సమావేశమైనపుడు- తామెప్పుడూ దురాక్రమణకు గురైన దేశాల పట్లే అనుకూలంగా వుంటామనీ, దురాక్రమణకు గురైన భారత్‌ను ఏనాటికైనా స్వతంత్ర దేశంగానే తాము చేయగలమని, కాబట్టి భారతదేశానికి బ్రిటన్ ప్రభుత్వం స్వతంత్రాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. అంతవరకూ తాము అహింసాయుతంగానే బ్రిటన్‌తో పోరాడతామని, కాబట్టి బ్రిటిష్‌వారు యుద్ధ ప్రయత్నాలకు అడ్డం వుండదని కాంగ్రెస్ పార్టీ చెప్పింది.
కాగా, హిట్లర్ 1941 జూన్ 22న సోవియట్‌నే ముట్టడించాడు. దీంతో కథ అడ్డం తిరిగింది! భారత కమ్యూనిస్టులకు ఏం చేయాలో వెంటనే తోచలేదు. ఎట్టకేలకు 1941 డిసెంబర్‌కు వారికి స్పష్టత వచ్చింది. తమ పార్టీ ఇప్పుడు ‘పీపుల్స్ వార్’ అయిందని, ఇప్పుడు కర్తవ్యమల్లా బ్రిటిష్ ప్రభుత్వపు యుద్ధ ప్రయత్నాలకు బేషరతుగా సహకరించడమేనని తేల్చింది. ఈలోపుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆగస్టు 8న క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించడం, 9న మహాత్మా గాంధీ సహా అనేకమంది కాంగ్రెస్ నాయకులు అరెస్టు చేయబడడం, దేశమంతటా అల్లకల్లోలం, పోలీసు కాల్పులు, కొందరు ప్రాణాలు కోల్పోవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఇంకోపక్క 1942 ఏప్రిల్‌లో కమ్యూనిస్టు నాయకుల మీద వారంట్లు రద్దు చేయబడి, అదే ఏడాది జులైలో వారి ప్రచురణల మీద నిషేధమూ తొలగించబడింది. వారి మొదటి సదస్సు బొంబాయిలో 1943 మే 23- జూన్ 1 మధ్య జరిగింది. వారి ‘పీపుల్స్‌వార్’ పత్రిక బయటికొచ్చింది. ఈలోపుగానే అంటే- జనవరి 25-మార్చి 11 మధ్య ముఖ్యమైన కమ్యూనిస్టు నాయకులు 16మంది వివిధ కారాగారాల నుంచి బయటికొచ్చారు. వారిలో రాహుల్ సాంకృత్యాయన్, ఎస్.ఎ. డాంగే, బి.టి.రణదివే వంటి ప్రముఖులున్నారు.
అప్పుడిక కమ్యూనిస్టులలో స్టాలిన్ నామజపం మొదలైంది. ఆయనెప్పుడో 1925లో రాసిన వ్యాసం నుంచి 2 వాక్యాలు, 1912లో రాసిన జాతి నిర్వచనాన్ని కమ్యూనిస్టులు ముందుకు తెచ్చారు. ఏమిటది? A nation is a historically evolved stable community of language, territory, economic life and psychological make-up manifested in a community of culture. దీనిని అనువదించేందుకు ప్రయత్నిస్తాను. ‘జాతి అంటే చారిత్రకంగా ఆవిర్భవించింది-్భషా సమైక్యత, భూభాగం, ఆర్థిక జీవనం, మానసికమైన పక్వత, ఇది దాని సంస్కృతిలో ప్రతిఫలిస్తుంది’
దీనికి ఉదాహరణగా కమ్యూనిస్టులు- 1936లో స్టాలిన్ తన రాజ్యాంగం ద్వారా 200 జాతులకు స్వయం నిర్ణయ హక్కు కల్పించాడని, ఇదే జాతుల సమస్యను పరిష్కరించడానికి మార్గమని ప్రచారం చేశారు.
చివరగా వారు తమ ‘కాంక్రీట్’ వాస్తవాన్ని ఈ విధంగా సూత్రీకరించారు. 1. ముస్లిం నాయకులు- తమ విభజన వాదం మీద నిలబడాలి. 2. జిన్నా అప్పటికే తన అభిమతం, ఆకాంక్షల మేరకు రిఫరెండంకు అంగీకరించాడు. 3. జిన్నా అంతకుముందే పాకిస్తాన్‌ను సెక్యులర్ స్టేట్ అని చెప్పాడు. 4. స్వయం నిర్ణయాధికారాలను ఇవ్వడం ద్వారా దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ చీలిపోదు. ప్రత్యేక హిందుస్తాన్, ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పడవు. పైగా ఒక సంతోషకరమైన రీతిలో, విభిన్న జాతులతో కూడిన ఒక సమైక్య యూనియన్ ఏర్పడుతుంది. ఇంతవరకూ మనం కనీవినీ ఎరుగని, అప్పటి వరకూ భారత చరిత్రలోనే చూడని దానిని చూస్తాం .. ఇలా మన కమ్యూనిస్టులు ఇంతగా మాట్లాడినా, పాకిస్తాన్ వేర్పాటువాద నాయకుడు జిన్నా ఎంత మాత్రం నమ్మలేదు.
1943లో కరాచీలో జరిగిన ముస్లిం లీగ్ సమావేశంలో జిన్నా మాట్లాడుతూ, ‘ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వానికి, హిందూ నాయకత్వానికి వస్తే చిలక పలుకులు తప్ప వేరొకటి లేదు. కమ్యూనిస్టులు చాలా తెలివైన వారు. వారికి అనేక జెండాలున్నాయి. వారికి ఎర్రజెండా ఉంది, రష్యన్ జెండా వుంది, సోవియట్ జెండా వుంది. కాంగ్రెస్ జెండా వుంది. ఇప్పుడు మన జెండాను పరిచయం చేసారు. చాలా సంతోషం. ఒక పార్టీకి ఇన్ని జెండాలుంటే అనుమానమొస్తుంది. ఏమందాం? క్లుప్తాతి క్లుప్తం కమ్యూనిస్టుల ధోరణి, వారి ఆచరణ తీరు ఇది. విచిత్రమేమిటంటే పాకిస్తాన్ ఏర్పడిన తరువాత అక్కడ కమ్యూనిస్టు పార్టీ పేరే వినబడలేదు.
చివరిగా ఇదీ చదవండి.. ‘ప్రధాని నరేంద్ర మోదీ అర్ధనారీశ్వర పాత్ర పోషిస్తున్నాడు. ఒకవైపు అందాల బొమ్మలా, మరోవైపు రక్తం తాగే రాక్షసి మాదిరిగా వ్యవహరిస్తున్నాడు. ఒకవైపు ప్రజానీకాన్ని సంరక్షిస్తానని చెబుతూ, మరోవైపు దళితులు, క్రిస్టియన్లు, మైనార్టీలను ఊచకోత కోస్తున్నాడు. ఆయనది క్రిమినల్ మైండు. రామ్‌నాథ్ కోవింద్, వెంకయ్యనాయుడు ఇద్దరూ ఆర్‌ఎస్‌ఎస్ నుంచి వచ్చినవారే. మొదటిసారి రాష్టప్రతి కార్యాలయం కాషారుూకరణం కాబోతున్నది’.. ఇది సిపిఐ నేత నారాయణ చేసిన ప్రకటన.
ఈ వైఖరిని ఏమందాం? ఇదేం.. ఇందిరాగాంధీ అత్యయిక పరిస్థితిలో అవలంబించిన పద్ధతిలాగా కాదే. ప్రజాస్వామ్యయుతంగా ఓటు పద్ధతి ద్వారా జరిగే ఎన్నికలు గదా! ప్రజాసామ్య విధానంలోనే ఎన్నికలు జరిగి, రాష్టప్రతిగా రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్టప్రతిగా వెంకయ్య నాయుడు ఎన్నికయ్యారు. మన దేశంలో కమ్యూనిస్టుల చరిత్ర గురించి నారాయణ వంటి సీనియర్ నేతలకు ఎవరైనా పాఠాలు చెప్పాలా? చారిత్రక అంశాలు తెలియని అమాయకుడు కాదు సిపిఐ నారాయణ.
*
చిత్రం.. మహాత్మా గాంధీతో పాకిస్తాన్ వేర్పాటువాద నేత జిన్నా

-చాణక్య