సబ్ ఫీచర్

కల్యాణ కారకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివదర్శనం ముక్తిదాయకం. శివనామం కళ్యాణ కారకం. ‘శం’ అంటే మేలు అని అర్థం. ‘కర’ అంటే కూర్చువాడని అర్థం. ఎల్లరకూ మేలుచేయువాడు కాబట్టి ‘శంకరుడయ్యాడు’. శివ శబ్దం మంగళం, శాంతి, శుభం, క్షేమం అనే అర్థాలనిస్తుంది. ‘శివ’ శబ్దంలో, ‘శం’ అంటే నిత్య సుఖము, ఆనందము. ‘ఇ’ కారము పరమ పురుషుడు. ‘వ’కారము- అమృత స్వరూపిణి అయిన ‘శక్తి’. ఈ ముగ్గురి సమ్మేళనమే అనగా ఆనందమయమైన శివశక్తి సంయోగమే శివ శబ్దార్ధము. శివుడు శక్త్యాత్మకుడు. అర్ధనారీశ్వరుడు. మహాశివరాత్రి పగటి భాగాన్ని శకిస్వరూపంగాను, రాత్రి భాగాన్ని శివ స్వరూపంగాను పెద్దలు వ్యవహరిస్తారు.శివతత్త్వంలో శివ, రుద్ర, ఈశ్వర అనే పేర్లు ప్రధానమైనవి. రుద్ర అనే శబ్దానికి దుఃఖ నివారకుడుఅని, శివ అంటే మంగళకరుడని, ఈశ్వర అంటే సర్వనియామకుడని అర్థాలు ఉన్నాయ.
లింగాభిషేకాలు
లింగోద్భవంలో సమయంలోనే కాదు ప్రతిరోజు శివభక్తులు శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. చిత్తం శివుని మీద ఉంచి శ్రద్ధతో మనస్సనే పూవును స్వామికి సమర్పించి పూజచేస్తే చాలు శివుడు కరుణిస్తాడు. కాని ఎవరికి నచ్చినట్లు వారు శివపూజ చేయవచ్చు. శివపూజ: ఉమ్మెత పూలతో పూజిస్తే పుత్రప్రాప్తి , జాజి పూలతో పూజిస్తే వాహన ప్రాప్తి, తుమ్మి పూలతో పూజిస్తే మోక్ష ప్రాప్తి, నందివర్థనం తో పూజిస్తే సౌందర్య ప్రాప్తి, నువ్వుపూలతో పూజిస్తే యవ్వన ప్రాప్తి, గనే్నరు పూలతోపూజిస్తే శత్రునాశనం, శిరీష పుష్పాలతో పూజిస్తే సంతోషం కలుగుతుందని శాస్త్ర వచనం. శివలింగాభిషేకం: ఇవి పరమపవిత్రాలు. వజ్ర లింగం, మరకత లింగం, పద్మరాగ లింగం, స్పటిక లింగం లాంటి వాటికి చేసే లింగాభిషేకాలు సకల వాంఛలను నెరవేరు స్తాయని పెద్దలు చెప్తారు. ప్రతి పనిని ఈశ్వరార్పణ ంచేసి చేస్తే ఫలితమే శివుడే నిర్ణయస్తాడు. శివుడే కర్తకర్మక్రియగా ఉంటూ శివుడే సర్వవేళలా సర్వావస్థల యందు తన భక్తులను తాను కాపాడుకొంటాడు.

- జంగం శ్రీనివాసులు