అంతర్జాతీయం

సూడాన్ నుంచి సురక్షితంగా 156 మంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం: సూడాన్‌లోని జుబా నుంచి 156 మంది భారతీయులను తీసుకువచ్చిన విమానం శుక్రవారం ఉదయం తిరువనంతపురం చేరుకుంది. కేరళ, తమిళనాడుకు చెందిన ప్రయాణికులు తిరువనంతపురంలో దిగగా, మిగిలిన ప్రయాణికులతో విమానం ఢిల్లీ చేరుకుంది. మరి కొందరు భారతీయులతో రెండో విమానం జుబా నుంచి బయలుదేరనుంది. రాజకీయ అనిశ్చితి, యుద్ధంలో చిక్కుకున్న దక్షిణ సూడాన్ నుంచి 156 మంది భారతీయులు సురక్షితంగా చేరుకున్నారు. వ్యాపార అవసరాల రీత్యా కొందరు సూడాన్‌లోనే ఉండేదుకు మొగ్గుచూపారని, తాము మాత్రం రక్షణ ముఖ్యమని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశామని విదేశాంగ శాఖ మంత్రి వీకే సింగ్ తెలిపారు. 550 మందికి పైగా భారతీయులు దక్షిణ సూడాన్‌లో ఉన్నట్టు చెప్పారు. 30 నుంచి 40 శాతం మంది ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్నారని, 300 మంది ఇప్పటికిప్పుడు వచ్చేందుకు ఆసక్తి చూపలేదని తెలిపారు.