స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం--141

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512

ఘోరేషు సంసారాంగారేషు పచ్యమానేన మయా శరణముపగతః సర్వభూతాభయ- ప్రదానేన యోగధర్మః స ఖల్వహం త్యక్త్వా వితర్కాన్ పునస్తానాదదానస్తుల్యః శ్వవృత్తేనేతి భావయేత్‌
- 2
3. యథా శ్వావాంతావలేహీ తథా త్యక్తస్య పునరాదదాన ఇతి॥
ఈ విధంగా దుర్మార్గాల వైపునకు తీసికొనిపోయే అత్యంత తీవ్రమైన వితర్కమనే జ్వరంతో బాధపడేవారు దానికి చికిత్సగా ప్రతిపక్షమైన వానిని గూర్చి ఆలోచించాలి. అత్యంత భయంకరమైన సంసారమనే అగ్నిజ్వాలలలో దహింపబడుతున్న నేను సమస్త భూతాలకు అభయమిచ్చే యోగధర్మాన్ని శరణుజొచ్చాను.
కాని ఆ యోగధర్మాన్ని విడిచి మరల ఆ వితర్కాలనే గ్రహించడం ద్వారా అది కుక్క వంటి స్వభావం కలదే అవుతుంది. ఎందుకంటే కుక్క తాను కక్కిన పదార్థానే్న తిరిగి నాకుతుంది. అలాగే నేను ముందు విడిచి పెట్టిన కుతర్కాన్ని మరల గ్రహిస్తే అటువంటిదే అవుతుంది.
ఇంతకూ ఆ వితర్కాలేవి? అంటే-హింసా- అసత్యం, దొంగతనం, వ్యభిచారం, అపవిత్రత, విలాసం, నాస్తికత అనేవి. వీనినొక్కొక్క దానినే గ్రహించి వానిని గురించి బాగా విమర్శించుకోవాలి. ఆరంభమయిన విచారణ మనసుకు ఆచరణగా మారుతుంది. విచారించడం ఆత్మ ప్రధాన కర్మ. అందుచేత ‘మాయినం సక్ష- దింద్రః’మాయినం= కుటిలం అంటే పాపభావనను ఆత్మయే చెంపదెబ్బ కొడుతుంది.
***
దైవ బలాన్ని పొందితే
ఆత్మకు జ్ఞానబలం పెరుగుతుంది
ఉద్యత్సహః సహస ఆజనిష్ట దేదిష్ట ఇంద్ర ఇంద్రియాణి విశ్వా
ప్రాచోదయత్ సుదుఘా వవ్రే అంతర్వి జ్యోతిషా సంవవృత్వత్తమో- వః॥
ఋ.5-31-3.
భావం:- దైవంనుండి ఆత్మ ఏ బలాన్ని పొందుతుందో దానిచేత అది ఇంద్రియాలకు సంపూర్ణంగా సన్మార్గోపదేశాన్ని చేస్తుంది. వానికి సత్కార్యాచరణ పట్ల మంచి ప్రేరణను కలిగిస్తుంది. ఇంద్రియాలు చేసే ఉత్తమమైన కార్యాలవలన సిద్ధించే సత్ఫలితాలనే గ్రహిస్తుంది. ఓ ఆత్మా! నీలో ఉండే బలీయమైన అజ్ఞానపు చీకటిని జ్ఞాన జోతిస్సులతో సమూలంగా తరిమికొట్టు.
వివరణ:- ఆత్మ- ఆత్మబల సంపన్నతకోసం భగవంతుడిని శరణుజొచ్చి అపార బల- సంపన్నమై ‘దేదిష్టే ఇంద్ర ఇంద్రియాణి విశ్వా’ ‘‘సర్వేంద్రియాలకు సన్మార్గోపదేశం చేస్తుంది’’ జీవనదాత మరియు బలప్రదాతయైన వానిని మాత్రమే విద్వాంసులు ఉపాసన చేసి ఆయన ఆజ్ఞలను శిరసావహిస్తారని-
య ఆత్మద బలదాయస్య విశ్వఉపాసతే ప్రశిషం యస్య దేవాః॥ శు.య.వే.25-13
శుక్ల యజుర్వేదం వర్ణిస్తూంది. అలా ఎందుకు ఉపాసన చేస్తారో ఛాందోగ్యోపనిషత్తు ఇలా వివరిస్తూంది.
బలం వావ విజ్ఞానాద్ భూయః, అపి హ శతం విజ్ఞానవతామేకో బలవానాకంపయతే. స యదా బలీ భవతి, అథోత్థాతా భవతి. ఉత్తిష్ఠన్ పరిచరితా భవతి. పరిచరన్నుపసత్తా భవతి. ఉపసీదన్ ద్రష్ట్భావతి, శ్రోతాభవతి, మంతాభవతి, బోద్ధ్భావతి, కర్త్భావతి, విజ్ఞాతాభవతి. బలేన వై పృథివీ తిష్ఠతి. బలేనాంతరిక్షం, బలేన ద్యౌః, బలేన పర్వతాః, బలేనదేవ- మనుష్యాః, బలేన పశవశ్చ వయాంసి చ, తృణవనస్పతయః, శ్వాపదాన్యాకీటపతంగ పిపీలికం. బలేన లోకస్తిష్ఠతి, బలముపాస్వ॥
(్ఛందోగ్యం. 7-8-1,2)
భావం:- శారీరక బలం నిజంగా విజ్ఞానంకంటె చాల బలిష్ఠమైనది. బలిష్ఠుడైనవాడు వందలకొలది శాస్తజ్ఞ్రులను సహితం వణికింపచేయగలడు. బలం గలవాడే ఉత్సాహవంతుడుగా ఉంటాడు. ఉత్సాహంకలవాడే ఏవిధమైన సేవనైనా చేయగలడు. సేవవలన ప్రయోజనం దగ్గర అవుతుంది. సామాన్య స్థితివలన అన్నింటిని చూడగలడు. వినగలడు. ఆలోచించగలడు. అన్ని తెలుసుకోగలడు. అన్నింటిని చేయగలడు. బలంచేతనే భూమి అంతరిక్షం, ఆకాశం, పర్వతాలు, విద్వాంసులు, సామాన్య జనులు, పశు, పక్షి, క్రిమి, కీటకాదులు, క్రూరమృగాలు, చీమలు ఇలా సమస్త లోకమూ స్థిరంగా జీవించగలుగుతున్నాయి. అందుచేత మానవులారా! బలాన్ని ఉపాసించండి.
బలానికి పరంధామం పరబ్రహ్మమే. ‘బలముపాపాస్వ’ అన్న ఛాందోగ్య అంతిమ వాక్యోపదేశానికి భావం బలప్రదాతయైన పరబ్రహ్మను ఆరాధించుమనియే.

--ఇంకావుంది...