స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
*
మాటలో ఒకటి మరియు చేతలో మరొకటి ఉండుట దుష్టజనుల స్వభావం’’కాబట్టి. నీవు దుష్టుడవు కాదు కదా! మరియు ‘సోమకామం హి తే మనః’ (ఋ.8-61-2) నీ మనస్సు శాంతిని కోరుకొంటున్నది.
నిజానికి సోమ= శాంత రసాభిలాషి మనస్సు ననుసరించియే ఋత= మాట ధర్మబద్ధమై యుంటుంది. అంతేగాక ‘ఋతస్య జిహ్వా పతతే మధుప్రియమ్’ (ఋ.9-75-2) ‘‘ఋత సహితమైన (్ధర్మబద్ధమైన) మాట వినేవారి మనసున అది మాధుర్యాన్ని ప్రీతిని జనింపచేస్తుంది’’. విద్వాంసులు నిన్ను శాంతరసానుభవానికి ప్రోత్సాహపరుస్తూ నీకు సహాయపడే సమయంలో ‘నియుత్వతా రథేనా యాహి దావనే మఖస్య దావనే’ ‘‘శీఘ్రంగా నడుప నైపుణ్యంగల చోదకులతో కూడిన రథాన్ని అధిరోహించి దాన- యజ్ఞాలను చేసేందకు త్వరితుడవై రమ్ము.’’ అదే నీ కర్తవ్యం.
**
మృతుని జీవుడు
అనచ్ఛయే తురగాతు జీవమేజద్ ధ్రువం మధ్య ఆ పస్త్యానామ్‌
జీవో మృతస్య చరతి స్వధాభిరమర్త్యో మర్త్యేనా సయోనిః॥

భావం:- పరబ్రహ్మం శాశ్వతుడైన జీవునకు ప్రాణదానం చేస్తూ, ఇంద్రియాలకు చైతన్యాన్ని కలిగిస్తూ అన్నింటికి గమనశక్తిని కల్పిస్తూ శరీరాలలోనే ఉంటున్నాడు. మరణించిన వానిలోని శాశ్వతుడైన జీవుడు తన స్వాభావిక శక్తులతో మరో మరణశీలమైన శరీరంలో ఉంటూ జీవన వ్యవహారం చేస్తున్నాడు.
వివరణ:- పరమాత్మ జీవుడికి అసత్= జీవనాన్ని అనగా ప్రాణాన్ని ప్రదానం చేస్తున్నాడు. అతడి ఇంద్రియాలకు ‘తురగాతు’చైతన్యాన్ని (చలనశక్తిని) ఏజత్= గతిశక్తిని కల్పిస్తున్నాడు. అయినా జీవునికంటే వేరుగానే ఉంటున్నాడు. తలవకారమహర్షి కేనోపనిషత్తులో ఈ మంత్ర పూర్వార్థ్భావానే్న ఇలా వివరించాడు.
శ్రోతస్య శ్రోత్రం మనసో మనో యద్వాచో హ వాచం స ఉ ప్రాణస్య
ప్రాణశ్చక్షుషశ్చక్షుః॥ (కేనోపనిషత్తు 1-2)
‘‘కంటికి కన్ను, చెవికి చెవి, మనస్సుకు మనస్సు, వాక్కుకు వాక్కు, ప్రాణానికి ప్రాణం అయినవాడెవడో అతడే దైవం.’’ ఇదే భావాన్ని మరొక అధ్యాయంలో మరింత విపులంగా ఆ మహర్షియే ఇలా వివరించాడు.
యద్వాచా- నభ్యుదితం యేన వాగభ్యుద్యతే 4
యన్మనసా న మనుతే యేనాహుర్మనో మతమ్ 5
యచ్చక్షుషా న పశ్యతి యేన చక్షూంషి పశ్యతి 6
యచ్ఛోత్రేణ న శ్రుణోతి యేన శ్రోత్రమిదం శ్రుతమ్ 7
యత్ప్రాణేన న ప్రాణితి యేన ప్రాణః ప్రణీయతే 8
తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే 9
॥ 2-4-8॥
‘‘మాట పలుకలేని జిహ్వ దేనితో పలుకుతూందో, చింతన చేయజాలని మనస్సు దేనితో చింతన చేయగలుగుతూందో, చూడలేని కన్ను దేని తేజస్సుతో చూడగలుతూందో, వినలేని చెవి దేని శక్తితో వినగలుగుతూందో, జీవనం సాగించలేని ప్రాణం దేని చేతనశక్తితో జీవిస్తూందో దానినే బ్రహ్మగా తెలుసుకో. లోకులందరూ దానినే నిత్యమూ ఉపాసిస్తూ ఉన్నారు.’’ తలవకార మహర్షి చెప్పిన ఈ మాటలన్నీ పై వేద మంత్రంలోని ‘అనత్, తురగాతు, ఏజత్’ శబ్దాలకు మనోహరమైన వ్యాఖ్యానమే.
ఇక మంత్రంలోని ఉత్తరార్ధం జీవునకు దేహంతోగల సంబంధాన్ని వివరిస్తూంది. అమృత= అవినాశి అయిన జీవాత్మ వినాశి మరియు మరణశీలియైన శరీరంతో చెలిమి చేస్తూంది. అంతమాత్రమే కాదు దానినే స్వస్థానంగా కల్పించుకొంది. దీనివలన శాశ్వతమైన జీవుడు అశాశ్వతమైన శరీరం రెండూ కలిసియే ఉంటున్నాయి. విశేషమేమంటే అమృత= మరణ రహితమైన శాశ్వతమైన జీవుడు మర్త్య= మరణించిన దేహాన్నికూడ పునరుజ్జీవింపచేయగల్గుతూంది. ఇది ఎంత అద్భుత విషయం!
మరో అద్భుత విషయమేమంటే అమర్త్యజీవుడు మర్త్యశీలంగల దేహాన్ని విడిచిపెట్టగానే ఆ దేహం మట్టిగా మారిపోతూ ఉంది. కాని దేహమే జీవుణ్ణి విడిస్తే ఆ జీవుడు ‘స్వధాభిః’= తన స్వాభావిక శక్తిసంపన్నతతో స్వేచ్ఛగా సంచరింపగలుగుతూ ఉందని ‘జీవో మృతస్య చరతి స్వధాభిః’అన్న వాక్యంతో జీవుని శాశ్వతత్వాన్ని స్వేచ్ఛావిహరణ సామర్థ్యాన్ని వేదం చాటి చెప్పింది. ఈ జీవన సత్యాన్ని ప్రతిదినమూ ఎందరు చూడటం లేదు. కాని నిత్యమూ అందరూ దుఃఖభాజనులే అవుతున్నారు. ఇదే లోకంలోని నిత్య సత్యం.
**
ఈశ్వరా! మా యజ్ఞాన్ని దేవతల వద్దకు చేర్చు

యేన వహసి సహస్రం యేనాగ్నే సర్వవేదసమ్‌
తేనేమం యజ్ఞం నో నయ స్వర్దేవేషు గంతవే॥
శు.య.వే.15-55॥
భావం:- ఓ అగ్నిదేవా! ఎవని శక్తిసామర్థ్యాలచేత ఈ సహస్రాధిక బ్రహ్మాండాలను వహిస్తున్నావో, ఎవనిద్వారా సమస్త జీవులకు సమస్త సంపదలను సంప్రాప్తింపచేస్తున్నావో అట్టి పరమాత్ముని ద్వారా రుూ యజ్ఞాన్ని మా ఆనందంకోసమై దేవతలవద్దకు చేర్చుము.
వివరణ:- ప్రకాశించేవాని యందు ప్రకాశమైనవాడా! సకల జ్ఞానభాండారమా! జ్ఞానకాంతులను ప్రసాదించి సమస్తాన్ని దర్శింపచేసేవాడా! ఓ భగవాన్! ఎక్కడ ప్రకాశముందో అది నీవే. సూర్య, చంద్ర, నక్షత్ర, తారాదులన్ని నీవల్లనే ప్రకాశమానమై వెలుగుతున్నాయి. ఓ ప్రభూ! అనంతశక్తులకు నీవే ఆధారభూతుడవు. ఈ అనంత విశ్వంలో ఎనె్నన్నో సౌర మండలాలు. వానిని అనాయాసంగా వహిస్తున్నవాడవు నీవే. సర్వశక్తిమంతుడా! నీవు ధన్యుడవు. ఈ జగత్తు ఈ జగత్తునకు కారణమైన ప్రకృతి రెండూ జడాలే. ఈ జడ ప్రకృతులకంటె భిన్నుడవు నీవే. ఓ దేవా! సమస్త జీవులలో చైతన్యంగా వెలిగేవాడవు నీవే. ఇప్పుడు నాదొక అభ్యర్థన. దానిని సఫలం చేయి. నా సమస్త కార్యాలలో నీవే ఉన్నావు. నా అన్ని కార్యాలను నీవే నిర్వహిస్తున్నావు. నాకు శరీరాన్ని, ఇంద్రియాలను, మనస్సును, వానికి భోగ్యమైన సమస్త భోగాలను నీవే ప్రసాదించావు. నా జీవనానికి నీవే ఆధారం. ఓ జగన్నాథా! నేను చేసే ఈ అభ్యర్థనను మన్నించు. ఏమంటే మేమందరం కలిసి యజ్ఞాన్ని సంకల్పించాం. ‘యజస్వ’(శు.య.వే.23-15) ‘‘యజ్ఞాన్ని చేయి’’అన్నది నీ ఆజ్ఞయేకదా! తదనుసారంగా మేము యజ్ఞాన్ని ఆరంభించాం. నీ దయలేక అది సఫలం కాదు. సర్వజ్ఞా! నీనుండి మేమేదీ దాచడం లేదు.
ఇంకాఉంది