స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
*
అతడు ఆధ్యాత్మిక మరియు భౌతిక సంపదలుగల ధనవంతులకంటె ధనవంతుడుగా అవుతున్నాడు. సదా ఆనందాభిలాషియైన ఆ యోగి మహోన్నత ఋతధర్మాన్ని వహించినవాడై బుద్ధిశాలి యవుతున్నాడు.
వివరణ:- చిత్తవృత్తులను నిరోధించి ఏకాగ్రత స్థితికి తెచ్చుటయే సంప్రజ్ఞాత సమాధి. పరిపక్వస్థితి నందిన ఈ సమాధియందు ‘ఋతంభరా ప్రజ్ఞ’ సిద్ధిస్తుంది. దీనిని గురించి పతంజలి మహర్షి ఇలా వివరించాడు. ‘శ్రుతానుమాన ప్రజ్ఞామన్యవిషయా విశేషార్థత్వాత్’(యో.ద.1-49)
‘‘ఆ ఋతంభరాబుద్ధి శబ్ద మరియు అనుమాన ప్రమాణాలకంటె విలక్షణంగా ఉంటుంది.’’ ఎందుకంటె ఆ ఋతం భరాబుద్ధివలన కలిగే విషయజ్ఞానం విశేషరూపంగా ఉండటమే.
పదార్థాలలోని స్వరూపం సామాన్యం, విశేషమనే రెండు రీతులుగా ఉంటుంది. విశేష స్వరూపమే సత్యమైన పదార్థస్వరూపం. కారణం దాని ద్వారా తెలిసిన జ్ఞానం ఇతర ప్రమాణాలవలన తెలియబడిన జ్ఞానంకంటె భిన్నంగా ఉంటుంది. మరియు అదే వాస్తవ స్వరూపమైయుంటుంది. అనుమాన, శబ్దప్రమాణాలు పదార్థజాత సామాన్యజ్ఞానాన్ని మాత్రమే తెలియచేస్తాయి. దానివలన పదార్థాల యథార్థజ్ఞానసిద్ధి అసంభవం. వస్తుస్వరూపం కేవలం ప్రత్యక్ష ప్రమాణంచేతనే పరిపూర్ణంగా సాధ్యం. సంప్రజ్ఞాత సమాధిసిద్ధిద్వారా లభించే ‘ఋతంభరాప్రజ్ఞ’ పరమ ప్రత్యక్షమైనది. అందు అసత్యమన్నది లవలేశం కూడ ఉండదు. అందలి పరిశుద్ధమైన ‘ఋతం’సర్వధా సత్యమైయుంటుంది. ఎవనికీ ఋతంభరా ప్రజ్ఞ సిద్ధిస్తుందో అతడు ‘నృచక్షాః’ క్రాంతదర్శి అయినవాడని వేదం ప్రశంసించింది. వారి స్వభావం జనుల శ్రేయస్సును కోరుకోవడం మాత్రమే అయిఉంటుంది. మరియు పాప సంపర్కంనుండి సామాన్య జనులను రక్షించే సహజ కరుణామూర్తులయి యుంటారు. తాము చేసే పవిత్రకర్మల ద్వారా తమను మరియు తోడివారిని పాపవిముక్తులను చేసి విశుద్ధాత్ములుగా చేసి రక్షించేందుకు ఆతృత కలిగినవారుగా ఉంటారు. ఆ విధంగా తాము పవిత్రకర్మలనాచరిస్తూ ఆ కర్మలయందు ఇతరులు కూడ ఉత్సాహం చూపేవారుగా చేయటంచేత వారు ‘పవమానః’ పవిత్రకారులవుతున్నారు.
ఆ విధంగా సంప్రజ్ఞాత సమాధిసిద్ధిద్వారా ఋతంభరా ప్రజ్ఞను పొందినవారు జీవన్ముక్తులైనవారికి మరియు అసామాన్యులకు సహితం రాజా= రాజుగా అంటే మహాతేజస్వంతులై వెలిగిపోతారు.
ధనం రెండువిధాలు. ఒకటి భౌతికం. రెండు ఆధ్యాత్మికం. ఎవరు సంప్రజ్ఞాత సమాధిసిద్ధిని పొందిన మహాత్ములో వారీ రెండు విధాలయిన ధనాలకు అధిపతులే. సమాధిసిద్ధి రూపమైన ఆధ్యాత్మిక ధన సంపత్తి ముందుగా వారివద్ద పుష్కలంగా ఉంది. ఇక యమనియమాది అష్టాంగయోగ విధాన సిద్ధిచేత సాంసారికమయిన భౌతిక సంపదకు వారు లోటు కలిగినవారు కాదు. అందుకే వారు ఉభయ ధనాధిపతులకు వారు ప్రభువులు. ఇలా ఎందుకో ‘అస్తేయప్రతిష్ఠాయాం సర్వరత్నోపస్థానమ్’ (యో.ద.2-37) ‘‘అస్టేయ (దొంతనం చేయకుండుట) సిద్ధివలన సమస్త రత్నాలు (్ధనాలు) లభిస్తాయి’’అని పతంజలి యోగదర్శనంలో స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ అస్టేయమన్నది యోగ అష్టాంగాలలో ఒకటి. అది తక్కినవానికి సూచకం. అష్టాంగాభ్యాసం చేసిన వాడికి భౌతికమైన ధనానికేమీ లోటుండదని పతంజలి అభిప్రాయం.
**
ప్రభూ! మా బంధాలను త్రెంచివేయి
గ్రంథిం న వి ష్య గ్రథితం పునాన ఋజుం చ గాతుం వృజినం చ సోమ:
అత్యో న క్రదో హరిరా సృజానో మర్యో దేవ ధన్వ పస్త్యావాన్ ॥
భావం:- శాంతిప్రదాతవైన ఓ దేవా! చిక్కుముడులవలె ముడులు పడిపోయి యున్నవానిని విప్పివేయి. సరళమూ మరియు విడువదగిన పాప, కుటిల మార్గాలను తెరువుము. మహాజ్ఞానివలె హితోపదేశం చేస్తూ సర్వులకు హితోపదేశం చేసే ఓ మానవుడా! దివ్యగుణ సంపన్నుడవైన విద్వాంసుడా! పిల్లాపాపలు గల సామాన్య గృహస్థునివలె నన్ను చేరుకో!
వివరణ:- ‘గ్రంథిం విష్య’ ‘ముడిని విప్పు’అని కాకుండ ‘గ్రంథిం న విష్య గ్రథితమ్’ ‘‘ముడులవలె ఉన్న బంధాలను విప్పు’’మని రుూ మంత్రంలో చేయబడిన ప్రార్థన చాల విశిష్టమైనది. మానవుడి జీవితంలో ఎనె్నన్నో సంసార పాశబంధాలుంటాయి. ప్రస్తుత మంత్రంలో వలెనే-
ఉదుత్తమం ముముగ్ధి నో వి పాశం మధ్యమం చృత అవాధమాని జీవసే॥ ॥
‘‘ఓ సర్వేశ్వరా! మా ఉత్తమ సంసార బంధాలను విప్పు. మధ్యమమైన వాటిని ఛేదించు. సుఖజీవనార్థంగా అధమ పాశాలనుకూడ త్రెంచివేయు.’’ అని ఋగ్వేదం మరో సందర్భంలో కూడా ఈ విషయానే్న పునరుద్ఘాటించింది. వాచికంగా ఈ ప్రార్థననెవడైనా చేయవచ్చు. అతడికి తన ప్రార్థనానుగుణంగా పాశగ్రంథులు విడివడతాయా? లేదు. మరి ఎవరికి విడివడతాయి? స్వసామర్థ్యాలను త్రికరణశుద్ధిగా భగవదర్పణం చేసి భగవానుడే సర్వాశ్రయుడని విశ్వసించి ధ్యాననిష్ఠుడైన వాని ఎడల ప్రసన్నుడైన సర్వేశ్వరుని దర్శనంవలన మాత్రమే ఆతడి పాశగ్రంథులు విడివడిపోతాయని ముండకోపనిషత్తు ఈ ప్రశ్నకు సమాధానంగా ఇలా వివరించింది.
భిద్యతే హృదయగ్రంథిశ్చిద్యంతే సర్వసంశయాః
క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే॥ ముండకోపనిషత్తు 4-10॥
హృదయగ్రంథి విడివడిపోతుంది. సమస్త సంశయాలు పటాపంచలవుతాయి. బంధన హేతువులయిన కర్మలు శిథిలమైపోతాయి. ఎప్పుడు? పరమాత్మ దర్శనభాగ్యం చేత మాత్రమే.
ముండకోపనిషత్తు చెప్పిన ఈ వివరణమంతా వేద మీమంత్రంలో ‘గ్రంథిం న విష్యం గ్రథితం’అన్న ఒక్క చిన్న వాక్యంగా సూత్రీకరించింది.
ఈ మంత్రంలో చిత్రమైన సాధకుని ప్రార్థన మరొకటి ప్రస్తావించబడింది. ఏమంటే ‘ఋజుం చ గాతుం వృజినం చ’ ‘‘సత్యస్వరూపమైన సరళమార్గాన్ని వర్జనీయమైన కుటిల మరియు పాపయుక్తమైన మార్గాన్ని కూడ ఓ దేవా! తెరచియుంచు’’మని. ఈ ప్రార్థనలో వర్జనీయమైన మార్గాన్ని కూడ తెరచియుంచమన్న అభ్యర్థన కర్థముందా? అన్న సందేహం ఎవరికయినా కలుగవచ్చు.
కాని అందులో ఒక గంభీరమైన తాత్త్విక రహస్యముంది. అది ఏమంటే ముండకోపనిత్తు చెప్పిన పై భగవద్దర్శన స్థితి సవికల్ప సమాధికి చెందింది. అందులో దైవదర్శనభాగ్యం పొందిన సాధకుడికి పూర్తిగా పూర్వవాసనా క్షయం కాదు. దానివలన మరల సాధకుడు పతనావస్థకే చేరుకొంటాడు. కాబట్టి సాధకుడు ఆ పూర్వవాసనా క్షయాన్ని కూడ స్వయంశక్తితో పొందగలగాలి.
ఇంకాఉంది