స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-196

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిద్రించుటకు శయ్యమీద వాలినా వెంటనే ఓంకారాన్ని జపించు. నిద్రవచ్చేవరకు ఆ జపాన్ని కొనసాగించు. ఆ స్మరణలోనే నిద్రపో. వాసనామయ శరీరం అణగిపోతుంది. దానివలన ప్రయోజనమెంతో ఉంటుంది’’.
పరమాత్మ ధ్యానం చేత సకల దురితాలు నశిస్తాయి. స్వప్నమంటే అది కేవలం మిథ్యయే. జాగ్రద్దశలోని సంస్కారాల ఖేలనమే స్వప్నం. ఈ స్వప్నాన్ని గూర్చి వేదమిలా హెచ్చరించింది.

యత్‌స్వప్నే అన్నమస్నామి ప్రాతరధిగమ్యతే
సర్వం తదస్తు మే శివం నహి తద్ దృశ్యతే దివా
భావం:‘‘స్వప్నంలో నేను తిన్న అన్నం ఉదయాన అది లభించదు. అది పగటిపూత కనబడదు గాన అదంతా నాకు శుభదాయకమే అగుగాక’’- అంటే కనబడిన కల అంతా కేవలం మనోఖేలనమే. దీనిని దృష్టిలో పెట్టుకొనియే-
తనే్న మనః శివ సంకల్పమస్తు
‘‘నా మనస్సు శుభసంకల్ప పరిపూర్ణమగుగాక’’ -అన్నప్రార్థన శుక్ల యజుర్వేదంలో కనబడుతుంది. దీనిని బట్టి దైవనామ స్మరణరూపమైన శుభసంకల్పంతో మనస్సు పరిపూర్ణమై దురితం దూరమైపోయి జీవితం శివమయం (ఆనందమయం) కాగలదని అథర్వవేద ప్రార్థనా సందేశం. దీనిని శిరసావహించి జనులందరు జీవితాన్ని శివమయం చేసికొందరుగాక!
ఆతతాయులను వధించు
ఇంద్ర జహి పుమాంసం యాతుధానముత స్ర్తీయం
మాయయా శాశదానామ్‌ విగ్రీవాసో మూరదేవా ఋదంతు
మా తే దృశ్యన్ త్సూర్యముచ్చరంతమ్‌॥ అథ.8-44-24॥
భావం:- ఓ రాజా! తమ దుర్మార్గ ప్రవర్తనచేత ఇతరులకు దుఃఖాన్ని కలిగించే రాక్షస ప్రవృత్తి గల ఆతతాయులు- హంతకులు, మోసకారులు స్ర్తిలే కాని పురుషులే కాని వారిని చంపివేయి. హింసయే ప్రధాన స్వభావం గలవారు శిరచ్ఛేదం పొంది నాశనం కావాలి. ఉదయించే సూర్యుణ్ణి ఇక వారు చూడనే చూడరాదు.
వివరణ:- రాజుకు ప్రధాన ధర్మం దేశంలో శాంతి భద్రతలను కాపాడటమే. ఈ ధర్మాన్ని రాజు నిర్వహించకుంటే దేశంలో శాంతిభద్రతలు కోల్పోవుటేగాక రాజ్యంలో ధన ధాన్య సమృద్ధి- ఆర్థికాభివృద్ధి, విజ్ఞానాభివృద్ధి, నాగరికతాభివృద్ధి ఇలా అన్నివిధాల అభివృద్ధులు కుంటుపడిపోతాయి. వీటిని అరికట్టి దేశాన్ని పురోగామిగా నడిపించడమే రాజుకు ప్రధాన ధర్మంగా వేదం పేర్కొంది. విప్రులకు సంధ్యావందనమెంత విధ్యుక్త్ధర్మమో రాజులకు రాజధర్మాన్ని నిర్వహించడం విధ్యుక్త్ధర్మంగా ఆధునిక మహర్షులైన దయానందులు తమ సత్యార్థప్రకాశంలో (6వ సముల్లాసంలో) ఇలా వ్రాసారు.
‘‘రాజు తన రాజధర్మ నిర్వహణలో సదా నిమగ్నుడు కావాలి. బ్రాహ్మణులకు సంధ్యాపాసన వేదాధ్యయనం మొదలగువని వలె రాజు రాత్రింబవళ్లు ఈ రాజధర్మ నిర్వహణలో జాగరూకుడై ప్రవర్తిస్తూ రాజధర్మాదులు చెడిపోకుండ శ్రద్ధవహించాలి.’’
ఏ కారణం చేతనయినా రాజ్యంలో రాజ్య ధర్మ నిర్వహణకు భంగం కలిగిస్తూ ప్రజలు హింసించే రాక్షస ప్రవృత్తిగల ఆతతాయులు అనగా 1. హత్యలు చేసేవారు 2. గృహాలకు నిప్పుపెట్టేవారు 3. విషప్రయోగం చేసి జనులను చంపేవారు- ఆయుధాలతో చంపేవారు 4. స్ర్తిలను- స్ర్తి ధనాదులను అపహరించేవారు 5. దోపిడీ దొంగతనాలు చేసేవారు ఇట్టి అనేక రాక్షస కృత్యాలు చేసేవారు విజృంభిస్తే వారి ఎడల ‘ఇంద్రో యాతూనామ భవత్ పరాశరో హవిర్మథీనామభ్యావివసతామ్’॥ (అ.8-4-21)
‘‘జనుల జీవన సాధనాలను నాశనంచేసి వారిని నిర్వాసితులనుగాచేసే రాక్షసులు అంటే ఆతతాయుల ఎడల ప్రభువు వినాశకుడు కావాలి’’అని అథర్వణవేదం సంపూర్ణ్ధాకారాన్ని రాజుకు ప్రదానం చేసింది.
ఈ అధికార ప్రదానంలో వేదం లింగ వివక్ష చూపలేదు. ఆర్యధర్మంలో స్ర్తిలు అవధ్యులు (చంపరానివారు)గా గౌరవింపబడ్డారు. కాని పై విధంగా రాక్షసులవలె దుర్మార్గపు పనులను చేసేవారు స్ర్తిఅయితే అంతమాత్రంచేత వారిని శిక్షింపక విడిచిపెట్టరాదని నిర్దాక్షిణ్యంగా రాజునకు అథర్వవేద మనుమతించింది. ఈ ఆదేశం ప్రస్తుత మంత్రంలోని ప్రథమ వాక్యం ‘‘ఇంద్రం జహి....శాసదానామ్’’అనే దానిలో స్పష్టంగా కనబడుతుంది. అంటే ఏమిటి? స్ర్తిలు అవధ్యులు అన్నమాట వారు రాక్షసులుగా ఆతతాయి పనులను చేయనంతవరకే వేదం సమ్మతించిందని ఈ మంత్రార్థాన్నిబట్టి గ్రహించాలి. మనుస్మృతికారుడు ఈ మంత్రార్థానే్న క్రింది శ్లోకాలలో యథాతథంగా పేర్కొన్నాడు.
గురుం వా బాలవృద్ధౌ వా బ్రాహ్మణం వా బహుశ్రుతమ్‌
ఆతతాయినమాయాంతం హన్యాదేవా విచారయన్‌॥ (మనుస్మృతి 8-350).
భావం:- ‘‘గురువుగాని, పుత్రుడు గాని, బాలుడు గాని, తల్లిదండ్రులు గాని, వేదవేదాంగాలను చదివినవాడు గాని, బహుశ్రుతుడు గాని ధర్మాన్ని విడిచి అధర్మాసక్తుడై నిరపరాధులను హత్యలుచేస్తూ ఆతతాయిగా ప్రవర్తిస్తూ ఉంటే విచారించకనే రాజు వధించాలి’’ కాబట్టి ధర్మశాస్త్రానుసారం ‘‘ఆతతాయిలను చంపితే చంపిన వానికి పాపం సంభవించదు.’’
కాబట్టి వేదం ఆతతాయులకు, రాక్షసులకు పూర్తి వ్యతిరేకం.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు