స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-199

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్టికర్త సమస్తమూ ఇచ్చుగాక!
సవితా పశ్చాతాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్సవితాధరాత్తాత్‌
సవితా నః సువతు సర్వతాతిం సవితా నో రాసతాం దీర్ఘమాయుః॥
భావం:- సృష్టికర్తయైన పరమేశ్వరుడు వెనుక, ముందు, పైన, క్రింద ఉన్నాడు. ఆయన మాకు సర్వవిధాలైన అనేక పదార్థాలను, సుదీర్ఘమైన ఆయువును ప్రసాదించుగాక!
వివరణ:- ఈ మంత్రం ఋగ్వేదంలోని పదవ మండలంలో ముప్పది ఆరవ సూక్తంలో పదునాల్గు మంత్రాలలో పదునాల్గవ మంత్రం. 1,13,14 మంత్రాలను విడిచి తక్కిన పదకొండు మంత్రాలలో ‘తద్దేవానామవో అద్యా వృణీమహే’ ‘‘నేడు దేవతల ప్రసిద్ధమైన అవస్= రక్షణ, ప్రేమ, సాహాయ్యాలను కోరుకొంటున్నాం’’ అను వాక్యం మకుటంగా ఉంది. ఈ విషయంలో ఎవరికి- ఎప్పుడూ మరో అభిప్రాయం కలుగకుండా ఉండేందుకు ‘సవితా నఃసువతు సర్వతాతిమ్’ ‘‘విస్తారమైన సర్వపదార్థాలను జగదుత్పాదకుడైన సర్వేశ్వరుడు మాకు ఇచ్చుగాక’’ అని ఈ పదునాల్గవ మంత్రంలో నిశ్చయాత్మకంగా చెప్పడం జరిగింది. అంటే సమస్త విశ్వసృష్టికర్త అయిన పరమాత్ముడే గాని మరెవ్వరిని మేమర్థించమని భావం. ఆయన ‘సర్వతాతి’ సమస్త ప్రదాతృతా శక్తిని ప్రకటించేందుకు సర్వత్ర విద్యమానుడైయున్నాడని సవితా పశ్చాతా... అధరాత్తాత్’ ‘‘్భగవానుడు వెనుక, ముందు, పైన, క్రింద అంతట ఉన్నాడు’’ అని వేదం స్పష్టంగా వర్ణించింది. కాబట్టి మేమెక్కడ ఉన్నా తప్పక ఆయన సర్వమూ అనుగ్రహిస్తాడనే విశ్వాసంతో అర్థించిన కోరికలు క్రమంగా పదకొండు మంత్రాలలో (2 నుండి 12) క్రింది విధంగా కనబడుతున్నాయి.
1. మొదటి మంత్రంలో సర్వప్రాకృతిక శక్తులు వర్ణింపబడ్డాయి.
2. మా దుర్విదత్రా నిరృతిర్న ఈశత- ‘‘దుష్టజ్ఞాన ప్రభావితమైన పాపవాసన మాపై అధికారం వహించకుండుగాక!’’.
3. స్వర్వజ్జ్యోతిరవృకం నశీమహి- ‘‘మేము ఆనందమయమూ సరళమూ అయిన జ్ఞానజ్యోతిని పొందెదము గాక!’’
4. ఆదిత్యం శర్మ మరుతామశీమహి- ‘‘మేము యాజ్ఞికుల నిరంతర శుభాశీస్సులను పొందెదము గాక!’’.
5. సుప్రకేతం జీవసే మన్మ ధీమహి- ‘‘మేము జీవించేందుకు ఉత్తమమైన ధ్యానసాధనలను ఆచరించెదము గాక!’’.
6. దివి స్పృశం యజ్ఞమస్మాకమశ్వినా జీరాధ్వరం కృణుతం సుమ్నమిష్టయే ప్రాచీన రశ్మిమాహుతం ఘృతేన... ‘‘అశ్వి= ప్రాణ- అపానాలు, దివిస్పృక్ ఆకాశపర్యంతము వ్యాపింపచేసేది, పరమాత్మతో సంయోగపరిచేది సకల జీవులను హింసింపనిది, అభీష్టసిద్ధిని సులభంగా కలిగించేది అయిన మా యజ్ఞంలోని ప్రకాశవంతమైన ప్రకాశంతో జీవితాన్ని ఆహుతి చేస్తాం.’’
7. రాయస్పోషం సౌశ్రవసాయ ధీమహి- ‘‘ఉత్తమ కీర్తి కొఱకై మేము ధనాన్ని కలిగియుంటాం.’’
8. సురశ్మిం సోమమింద్రియం యమీమహి- ‘‘ఉత్తమ రశ్మియుక్తమైన అనగా శ్రేష్ఠమైన మనస్సుతో సంయుక్తమై శాంతిదాయకమైన ఇంద్రియాలను మేము వశం చేసుకొంటాము.’’
9. బ్రహ్మద్విషో విష్వగేనో భరేరత- ‘‘బ్రహ్మద్వేషులు, జ్ఞాన శత్రువులు, ధర్మవిరోధులు చేసే అపరాధాన్ని పరమాత్మ క్షమించుగాక!’’.
10. జైత్రం క్రుతుం రయిమద్వీరవద్యశః- ‘‘విజయసాధకమైన కర్మ, ధనవంతులు జనబలం కలవారు కీర్తివంతులగుదురు గాక!’’.
11. యథా వసు వీరజాతం నశామహై- ‘‘వీరులను సిద్ధం చేసే ధనాన్ని పొందెదము గాక!’’.
12. శ్రేష్ఠే స్యామ సవితుః సవీమని- ‘‘మాలో భగవంతుడు గొప్ప ప్రేరకుడై ఉండుగాక!’’.
ఈ కోరికలను గమనించండి. వీనిలో పాపరహితులం కావాలనే కోరిక నుండి మాలో భగవంతుడు గొప్ప ప్రేరకుడై యుండుగాక అనే గొప్ప భావనాక్రమ వికాసముంది. వీనికి చివరగా సమస్త వాంఛలు సంపూర్ణంగా నెరవేరాలనే ఆశాదృక్పథంతో సూక్తం ముగించబడింది.
చివరగా దేవానా మవః (ఋ.10-36-10) ‘‘దేవతల రక్షణ’’ అనే కోరిక ఏమిటిః ఈ కోరికలో గొప్ప వ్యూహముంది. అదే భగవన్మార్గంలో నడిచేవారే అభీష్ట సిద్ధిని పొందుతారు అని. భగవన్మార్గమంటే ఏమిటి? దైవానికి ప్రియాతిప్రియమైనవారు నడిచే మార్గమే భగవన్మార్గం. మనువు కూడ మనుస్మృతిలో
‘తేన యాయాత్సతాం మార్గం తేన గచ్ఛన్న రిష్యతే’ (మనుస్మృతి. 4-178)
‘‘సత్పురుషుల మార్గంలో నడిచే వారెన్నడూ చెడిపోరు’’ అని ఈ మంత్రార్థమే వివరించాడు. కాబట్టి భగవత్ప్రాప్తి పొందే ముందు భగవత్ప్రేమికులు ప్రీతిపాత్రులు కావాలి. అందుకే ‘తద్దేవానామవో అద్యా వృణీమహే’ (ఋ.10.36-10) ‘‘దేవతల రక్షణ- సంప్రీతి కోరి నేడే అర్థిస్తాము’’ అని పూర్వ మంత్రంలో కంఠోక్తంగా చెప్పబడింది. అంటే భగవత్ప్రీతికి పాత్రులైన వారిలో దేవతలు మరియు విద్వాంసులు అగ్రేసరులని భావం.
* * *
విద్వాంసుల మహత్వం
క్రతూయంతి క్రతవో హృత్సు ధీతయో వేనంతి వేనాః పతయంత్యా దిశః
న మర్దితా విద్యతే అన్య ఏభ్యో దేవేషు మే అధి కామా అయంసత॥
భావం:- కర్మశీలురయిన మహాత్ములు ఎల్లప్పుడు కర్మలను చేస్తూనే ఉంటారు. హృదయంలో దైవధ్యానం చేస్తారు. అట్టి బుద్ధిమంతులు జ్ఞానవర్చస్సుతో వెలిగిపోతూ ఉంటారు. తమను అన్యాయంగా ఆజ్ఞాపించేవారిని ధిక్కరిస్తారు.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు