స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వేషాం మంగళం భూయాత్ సర్వేసంతు నిరామయాః
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్‌॥
॥ పు.ఉత్తరాఖండం. 35-51॥
ఈ శ్లోక భావమే అర్ధ శ్లోకంగా మహాభారతంలో కనబడుతూంది.
సర్వస్తరస్తు దుర్గాణి సర్వో భద్రాణి పశ్యతు
మహా.్భ.శాంతి. 327-48॥
**
ప్రజలు రాజును ఎన్నుకుంటారు
త్వాం విశో వృణతాం రాజ్యాయ త్వామిమాః ప్రదిశః పంచదేవీః
వర్ష్మన్ రాష్టస్య్ర కకుది శ్రయస్వ తతో న ఉగ్రో వి భజా వసూని॥
॥ 3-4-2॥
భావం:- రాజు కావాలని కోరుకొనేవాడా! రాజకార్య నిర్వహణకు ప్రజలే నిన్ను ఎన్నుకొందురుగాక! తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఊర్ధ్వం అనే ఐదు దిశలు మరియు ఆ దిశలలో మూల దిశలలో ఉండే దివ్యగుణ సంపన్నులైన ప్రజలు (విదిశులు) నినే్న ఎన్నుకొందురుగాక! ఎన్నుకొన్న తరువాత దేశ సింహాసనాన్ని అధిష్ఠించి మాకు సంపదలను సమంగా పంచి యిమ్ము.
వివరణ:- నేను అతణ్ణి రాజ్యాధికారిగా చేసానని అహంకరిస్తారు. ఆ విధంగా వారు తమకుతాము ఆత్మవంచితులవుతున్నారు. కాని సమస్త దేశాలు తమ రాజునుతామే ఎన్నుకొనే అధికారాన్ని సంపాదించుకొనేందుకు తహతహలాడుతున్నాయి. ఇది దేశంలోని ఎన్నికలకు గొప్ప సూచన. ప్రపంచంలో ఎన్నికల ప్రణాళిక మేమే కనుగొన్నామనే భ్రమ ఉంది. కాని ఎన్నికల ప్రణాళిక మొదట కనుగొన్నది ప్రచారం చేసింది వేదమే. చూడండి. ప్రపంచ సాహిత్యంలోనే మొట్టమొదటి గ్రంథమైన వేదం తాను రాజు కావాలని భావించేవానినుద్దేశించి ‘త్వాం విశో వృణతాం రాజ్యాయ’ ‘‘రాజుగా రాజ్యకర్యనిర్వహణకు నిన్ను ఎన్నుకోవలసినది ప్రజలే’’అని స్పష్టంగా శాసించింది.
ప్రజలంటే ఎవరు? అన్నదాన్ని కూడా వివరిస్తూ ఆ అథర్వణవేదమే ‘సర్వాస్త్వా రాజన్ ప్రదిశో హ్వయంతు’ (అథ.3-4-1) ‘‘సమస్త ప్రదిశలు నిన్ను రాజుగా ఎన్నుకోవాలి అని వివరించింది. ప్రదిశలు అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఊర్ధ్వదిశ. వానికి చెందిన మూలదిక్కులలో ఉండే ప్రజలు అని అర్థం. వారంతా రాజు నెన్నుకోవాలని వేదాభిప్రాయం. ఆ ప్రజలెట్టివారు కావాలో అథర్వణవేదం మరో మంత్రంలో ‘యే రాజానో రాజకృతః సూతాగ్రామణ్యశ్చ’ (అథ.3-5-7) ‘‘సామంతరాజులు సూతులు రాజును చేస్తారు’’ అని ప్రతిపాదించింది.
అంటే రాజు కావలసిన వానిని అభ్యర్థిగా నిలబెట్టే పనిని వారు చేస్తారు. ఇది ఒక పార్టీ ప్రజాప్రతినిధి (ఎం.ఎల్.ఏ) పేరును ప్రతిపాదించడం వంటిది. ఆ పిమ్మట ప్రజలు నేడు ఎన్నుకొనేవిధంగా దిశలు మరియు ప్రదిశలలోని ప్రజలు రాజును ఎన్నుకొంటారు. ఇది దాదాపు నేటి ఆధునికమైన ఎన్నికల విధానానే్న పోలియుంది కదా!
ఎన్నికల విధానంతోబాటు ఈ మంత్రం రాజు కర్తవ్యమేమిటో కూడా ప్రస్తుత మంత్రంలోని రెండవ చరణంలో ‘వర్ష్మన్ రాష్టస్య్ర కకుది శ్రయస్య’ ‘‘రాజ్య సింహాసనంమీద కూర్చో.’’ కూర్చుని ‘తతో న ఉగ్రో’ ‘‘బలవంతుడవై అహంకరించకు’’ ‘విభజా వసూని’ ‘‘రాజ్య సంపదను జనులందరికి సమానంగా పంచు’’అని శాసించి చెప్పింది.
రాజ్యాధికారం రాగానే మనిషి బధిరాంధకవశంగా మారిపోవడం యుగ యుగాలుగా చూస్తున్నదే. దానితో రాజ్యసంపదను ప్రజలకు సమానంగా చేర్చకుండ అసమర్థులుగా పరులపాలో నియంతలుగా స్వార్థానికో వినియోగించుకొన్న దుష్టరాజుల్ని లోకం ఎంతమందిని చూడలేదు.
అట్టివారందరు ఈ వేదోపదేశాన్ని వినకపోవడమో లేక విన్నా పెడచెవిని పెట్టిన వారో అయి యుంటారని చెప్పవలసి యుంది. అయితే వేదాదేశాన్ని ఆచరించిన మహాపురుషులైన రాజులు భారతదేశంలో లేరని చెప్పజాలం. రాజకీయపు గంజాయి వనంలో తులసి మొక్కల్లా వేదోపదేశాన్ని శిరసావహించి రాజ్యసంపదను ప్రజలందరకు సమానంగా పంచి కన్నబిడ్డల్లా పాలించే ప్రాచీన మహాచక్రవర్తులకు వారసులుకాగల ప్రజాపరిపాలకులకోసం చకోర పక్షుల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.
**
నా నేల తల్లియే
నా గౌరవ చిహ్నం
సత్యం బృహదృతముగ్రం దీక్షా తపో బ్రహ్మ యజ్ఞః పృథివీం ధారయంతి
సా నో భూతస్య భవ్యస్య పత్న్యురుం లోకం పృథివీ నః కృణోతు॥ ॥
భావం:- సృష్టిలోని అన్నిటికన్న మిన్నగా కోరదగినది, సర్వశ్రేష్ఠమైనది సత్యధర్మమే. అదే ఋతాన్ని, మహాబలసంపన్నతను దీక్షావిధిని, తపస్సును, బ్రహ్మజ్ఞానాన్ని, బ్రహ్మచర్యాన్ని, యజ్ఞాన్ని, భూమిని వహిస్తున్నది. ఆ సత్యమే గడిచిన, రాబోయే కాలాలకు సంరక్షురాలైన ఈ భూమండలాన్ని మాకు విస్తారమైన గౌరవ చిహ్నంగా చేయునుగాక!
వివరణ:- మాతృభూమి స్వాతంత్య్ర పరిరక్షణకై దేశ పౌరులు ఎట్టి గుణాలు కలిగియుండాలో ఈ మంత్రం వివరిస్తూంది.
సత్యమ్:- శాశ్వత ధర్మం. దేశభక్తులయిన పౌరులు ఈ సత్యధర్మంపైన బహుశ్రద్దాళువులై యుండాలి.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు