స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక మానవుని ఆత్మ సృష్టికూడ వాటికి తక్కువేమీకాదు. సూర్యతాప ప్రభావం తనమీద పడకుండ ఎన్నో శీతలీకరణ సాధనాలను కనుగొన్నాడు. బడబానలాన్ని పూర్తిగా చల్లార్చివేసే జలాన్నికూడా గొట్టాల ద్వారా తన గృహసీమలోనకి తెచ్చుకోగలిగాడు.
ఇక విద్యుత్తు. దానిని తీగలలో బంధించి ఇంటిని వెలుగులతో నింపుకొంటున్నాడు. ప్రయాణసాధనాలుగా మలుచుకొన్నాడు. ప్రపంచానే్న ఒకపెట్టెలో బంధించి (టి.వి.) వీక్షిస్తున్నాడు. ఇలా ప్రాకృతిక శక్తులన్నీ మానవుడికి సేవకులయిపోయాయి. ఇది ఎలా సంభవమైంది? కేవలం మానవుని శక్తివల్లనే. దానిని గుర్తించిన వేదం మానవుని, మానవుని శక్తిని ఉత్తమ పురుష వచనంగా శ్లాఘిస్తూ ‘అయతో-హ మయుతో మ ఆత్మా’నేను ‘‘అయుత (పదివేలు) శక్తిసంపన్నుడను. నా ఆత్మ అయుత బల సంపన్న’’అని ఘనతను చాటిచెప్పింది. అంతటితో తృప్తిచెందని వేదం ‘అయుతంమే...సర్వః’ ‘‘నా కళ్లు, చెవులు, ప్రాణాలు, అపాన, వ్యానాలు, అయుత శక్తివంతమైనవి. అందుకే నేను సర్వసంపూర్ణుడను’’ అని ఆత్మ విస్తారశక్తిని వివరించింది.
ఆత్మకు ఆ అయుతమైన శక్తి ఎలా సిద్ధిస్తుంది? శరీరంతోబాటే సిద్ధిస్తుందని అథర్వవేదం ‘ఏక శతం లక్ష్మ్యో మర్త్యస్య సాకం తన్వా జనుషో- ధి జాతాః’ (అథ.7-115-3) ‘శరీరంతోబాటే వందలకొలది లక్ష్మీశక్తులు ఆత్మకు జనిస్తాయి’’అని వివరించింది.
అయితే వానితోబాటు అలక్ష్మీశక్తులు పుట్టవా? పుట్టకపోతే దుష్టాత్ములు లోకంలో ఉండకూడదు కదా. కాని అట్టివారు లోకంలో స్పష్టంగా కనబడుతున్నారు. ఆ అలక్ష్మీశక్తులు సహజలక్ష్మీ శక్తులను దుష్ప్రభావితం చేస్తాయి. కాబట్టి అదే మంత్రంలో అథర్వవేదం ‘తాసాం పాపిష్ఠా నిరితఃప్ర హిణ్మః శివాఅస్మభ్యం జాతవేదో ని యచ్ఛ’ (అథ.7-115-3)
‘లక్ష్మీ శక్తులతోబాటు పుట్టే అలక్ష్మీ (దుష్ట)శక్తులను మా ఆత్మనుండి దూరం చేసి ఓ దేవా! మాకు శుభాన్ని కలిగించు’’మని మరో మంత్రంలో ‘సహస్రం ప్రాణామయ్యా యతంతామ్’ (అథ.17-1-30) ‘‘నాలో వేలకొలది ప్రాణాలు(దైవీశక్తులు) కార్యనిర్వహణచేయుగాక’’అని సాధకుడు దైవాన్ని ప్రార్థిస్తూ ఉండాలని ఆదేశించింది.
ఇట్టి ఆత్మ శక్తిసామర్థ్యాన్ని పొంది కూడ మానవుడు ప్రబలుడై గర్విష్ఠుడు కాక ‘దేవస్య త్వా సవితుః ప్రసవే... ఆరభే’ ‘‘దేవా! నీ ప్రేరణతో నేను ప్రాణ- అపానాలనబడే అశ్వినుల పోషణ, సంహార శక్తులనే బాహువులతో మరియు పుష్టి, ధైర్యాలనే హస్తాలతో ప్రేరేపింపబడి కార్యారంభం చేస్తాను’’ అని వినమ్రంగా విన్నవించుకోవాలి. అంటే ఆత్మశక్తితో తానుచేసే ప్రతి కార్యమూ దైవప్రేరణఘా సదా భావిస్తూ ఆరంభం చేయాలని భావం.

- ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు