స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
దేవా! సర్వజన హితైషివి కదా! నీవు మాయెడల సుమనస్కుడవుకమ్ము. మాకు మంచి మనసు నిమ్ము.
**
ఆత్మ సాక్షాత్కారం చేసుకో
అయం హోతా ప్రథమః పశ్యతేమమిదం జ్యోతిరమృతం మర్త్యేఘ
అయం స జజ్ఞే ధ్రువ ఆ నిషత్తో- మర్త్వస్తన్వా వర్థమానః॥ ఋ.6-9-4॥
భావం:- ఈ ఆత్మ మొదటగా ఇచ్చి- పుచ్చుకొనే లక్షణశీలి. ముందుగ దీనిని దర్శించు. మరణశీలి అయిన శరీరంలో ఇది నాశనం లేక స్థిరంగా ఉండే జ్యోతి. ఈ ఆత్మ శరీరంలో ధ్రువంగా ఉంటూ గర్భంలో జన్మిస్తుంది. మరియు నాశనం లేనిదై నశించే శరీరం ద్వారా ఆత్మవృద్ధి చెందుతుంది.
వివరణ:- సంతానాపేక్షతో స్ర్తిపురుషులు సంగమించినా పలుమార్లు నిష్ఫలమవుతుంది. కారణం కేవలం రజో వీర్య సంయోగంవల్లనే సంతానోత్పత్తి జరుగదన్నది స్పష్టం. ఆ సంయోగంలో జీవుడు ప్రవేశించనంతవరకు సంతానోత్పత్తికి అవకాశముండదు. గర్భంలో జీవోత్పత్తి, శరీర నిర్మాణం, బుద్ధివికాసం మున్నగునవి ఆత్మను ఆశ్రయించుకొనే జరుగుతాయి. కాబట్టి అన్నింటికంటే ముందుగా ఆత్మయే గర్భప్రవేశం చేస్తుంది. ఈ విషయానే్న వేదం తన అపూర్వశైలిలో ‘అయం హోతా ప్రథమః’ ‘‘ఈ ఆత్మయే మొదటి దానకర్త మరియు దాన ప్రతిగ్రహీత’’గా వర్ణించింది. ఆత్మ శరీరాన్ని ఇంద్రియాలను ముందుగా స్వీకరిస్తుంది కాబట్టి అది ప్రతిగ్రహీత. అట్లే శరీరాభివృద్ధి, చేష్టలకు ఆత్మహేతువు కాబట్టి అది దాత. ఆత్మకుగల ఈ రెండు కార్యాలను దృష్టియందుంచుకొనే వేదం ఆత్మను ‘హోత’గా వ్యవహరించింది. ఈ ఆత్మనే ముందుగా దర్శించుమని ‘ఇమం పశ్యత’ అని వేదమాదేశించింది. మరి ఆత్మ నేవిధంగా దర్శించాలి?. దానికి సాధనాలు రెండే రెండు. హృదయం మరియు మనస్సు. దీనికి ప్రమాణమేమిటి? అంటే ఋగ్వేదమే ‘పతంగమక్తమసురస్య మాయయా హృదా పశ్యంతి మనసా విపశ్చితః’‘‘ప్రాణదాత పరమేశ్వరుని కుశలత చేత ఏర్పడిన శరీర సంబంధం కారణంగా ఆత్మను పండిత జనులు హృదయం మరియు మనస్సుతో తెలుసుకొంటారు’’.
- ఇంకాఉంది