స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగు వర్ణాలు
బ్రాహ్మణో- స్య ముఖమాసీద్ బాహూ రాజన్యః కృతః
ఊరూ తదస్య యద్వైశ్యః పద్భ్యాం శూద్రో- అజాయత॥ ॥
భావం:- బ్రాహ్మణులు భగవంతుని ముఖం-వంటివారు. బాహువుల వంటివారు క్షత్రియులు. తొడల వంటివారు వైశ్యులు. శూద్రులు పాదాల వంటివారు.
వివరణ:- అలంకారిక రీతిలో ఈ మంత్రం చాతుర్వర్ణ్య వ్యవస్థను వర్ణిస్తూంది.
భగవానుని శిరస్థానంగా ఆధ్యాత్మిక విచారణాతత్పరుడైనవాడు బ్రాహ్మణుడు; భుజద్వయస్థానంగా సమాజ రక్షణాశీలుడైనవాడు క్షత్రియుడు, మధ్యభాగమైన ఉదర మరియు తొడల స్థానంలో మానవ సమాజానికి ఐశ్వర్య కేంద్రంగా ఉన్నవాడు వైశ్యుడు, శరీరాన్నంతను మోసే పాదాల స్థానంలో మానవ సమాజ సేవా తత్పరులైనవారు శూద్రులు అని ఈ మంత్రం చాతుర్వర్ణ్య వ్యవస్థను వర్ణించింది.
చారిత్రక పరిశోధకులు మాత్రం వేదాలలో వర్ణవ్యవస్థలేదని, ఆర్య- దాస అనే రెండే వర్ణాలున్నాయని చెబుతూ వారు తమ వాదానికి ప్రమాణంగా క్రింది వానిని ఉదాహరిస్తూ ఉంటారు.
1. దాసం వర్ణమధరం గుహాకః- ఋ.2-12-4.
2. ప్రార్యం వర్ణమావత్- ఋ.3-34-9.
వీని నాధారంగా వారు 1వ ప్రమాణానుసారం దాసవర్ణాల వారిని నీచులు గాను, 2వ ప్రమాణానుసారం ఆర్యవర్ణాల వారిని రక్షించేందుకు ఋగ్వేదంలో ఆ విధంగా చెప్పబడిందని చాతుర్వర్ణ్వ వ్యవస్థను తిరస్కరిస్తారు. అట్టివారికి మా నివేదన ఏమంటే వర్ణ శబ్ధం ఋగ్వేదంలో 13మార్లు ప్రయోగింపబడిందని, వానికి వివిధ విశేషణాలు జత చేయబడ్డాయని వానిని పరిశీలించుడని మాత్రమే.
1. కృష్ణం చ వర్ణమరుణం చ సం ధుః..
. ఋ.1-73-7
2. సమానం వర్ణమఖి శుంభమానా...
ఋ.1-92-10
3. ప్రేమం వర్ణమతిరచ్ఛుక్రమానామ్...
ఋ.3-34-5
4. సుశ్చంద్రం వర్ణం దధిరే సుపేశసమ్..
ఋ.2-34-14
5. యస్య వర్ణం మధుశ్చుతం హరిం హిన్వంత్యద్రిభిః. .. ఋ.9-65-8

- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు