స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గృభ్ణీత’ అన్న క్రియాపదం లోట్ లకార రూపం ఇది వ్యాకరణ శాస్త్ర సంబంధి. దీనికి విధి (ఆజ్ఞ) ఆశీర్వాద పూర్వకమైన అర్థాలుంటాయి. ఆ ప్రకారంగా ఈ పై పూర్తివాక్యానికి ‘ఎవరివలన దేనివలన ఒత్తిడి లేక మానవ శరీరంలోనికి రండి’ అని అర్థమేర్పడుతుంది.
ఈ మంత్రాలలో పునరుక్తమైనది అంగిరస శబ్దం. దీనికి 1. జ్ఞాని 2. ప్రాణశక్తి సంపన్నం 3. జ్ఞానానందయుక్తుడు 4. బ్రహ్మానందప్రాప్తి అని నాలుగు అర్థాలు చెప్పబడుతున్నాయి. వీనికి వేద ప్రామాణ్యముంది.
1. జ్ఞాని:- ‘తస్మాదంగిరసో-్ధయానః’ (గోపథ బ్రాహ్మణమ్ 1-9) అంగిరస శబ్దం స్వాధ్యాయం చేసిన మహాజ్ఞానిని బోధిస్తుంది.
2. ప్రాణశక్తి సంపన్నత:- ‘ప్రాణో వై అంగిరాః’ (శతపథ బ్రాహ్మణం 6-5-3-3) ప్రాణవాచకమే అంగిరస శబ్దం.
జ్ఞానానందమ్:- ‘యో-జ్గిరసః స రసః’ (గోపథ బ్రాహ్మణమ్ 1-9) అంగిరసమే రసం- ఆనందవాచకం.
‘సుమేధసః’మరియు ‘అంగిరసః’ శబ్దాలు ఆలోచనాత్మకమైనవి. ఇవి మిక్కిలి రసాస్యార్థకాలు. ముక్తికి పూర్వస్థితిని ముక్తికి ఉత్తర స్థితిని తెలిపే విశేష వాచకశబ్దాలు.
ప్రథమ మంత్రంలోగల ‘దక్షిణా’మరియు కర్మా శబ్దాలకు ముక్తిసాధనమని అర్థం చెప్పబడింది. ఋగ్వేదంలో ఈ శబ్దాలు ఈ అర్థాలలోనే ప్రయోగింపబడ్డాయి.
దక్షిణావంతో అమృతం భజంతే దక్షిణావంతః దక్షిణావంతః ప్రతిరంత ఆయుః॥ (ఋ.1-125-6)
దక్షిణావంతః = సత్యర్మపరాయణులు ముక్తికి పొందుతారు. అట్లే దక్షిణావంతు ఉత్సాహవంతుడై కర్మల నాచరించే స్వభావంగలవాడు తన ఆయుష్షును సుదీర్ఘంగా చేసుకొంటాడు. అంటే మృత్యువును పారద్రోలతాడని భావం. శుక్లయజుర్వేదంలో ‘విద్యాం చావిద్యాం చ’ (శు.య.వే.40-14) మంత్రంలో కూడ ఈ అర్థమే చెప్పబడింది.
‘సూర్య’శబ్దానికర్థం ‘చరాచరాలలో వ్యాపించియున్న ఆత్మ’అని చెప్పబడింది. దీనికి ప్రమాణం సంధ్యామంత్రాలలో కనబడుతుంది.
‘సూర్య ఆత్మాజగతస్తన్థుషశ్చ’ (శు.య.వే.7-42)= జగత్= జంగను, చర; చ= మరియు తస్థుషః= స్థావర= అచర= ఈ చర- అచరాలకు ఆత్మ సూర్యుడు.
‘పృథివీ’శబ్దానికి ‘వాణి’(మాట) అని చెప్పబడింది. జైమిని బ్రాహ్మణమే దీనికి ప్రమాణం. అందులో ‘వాగితి పృథివీ’అని సూత్రీకరింపబడింది.
నాల్గవ మంత్రంలో ముక్తినుండి విముక్తులైనవారిని దేవపుత్రాః= పరమాత్మ పుత్రులు అని చెప్పబడింది.
‘నాభా’శబ్దం ‘ణహ బంధనే’అను ధాతువునుండి పుట్టింది. ‘సుమేధసః’మరియు ‘అంగిరసః’శబ్దాల భావం బోధపడితే 1. భద్రం 2. దీర్ఘాయుత్వం 3. సుప్రజాస్త్వం 4. సుబ్రహ్మణ్యం శబ్దాలకర్థం తెలియడం కష్టంకాదు. ఈ శబ్దాలు మంత్రాలలో ఇదే క్రమంలో ప్రయోగింపబడ్డాయి. వాని అర్థాలు క్రమంగా 1. భద్రం = ధర్మం 2. దీర్ఘాయుత్వం = చిరాయువు 3. సుప్రజాస్త్వ= కామం 4. సుబ్రహ్మణ్యం = మోక్షం. అంటే ముక్తినుండి బహిర్గతుడై తిరిగి వాని సాధనకొరకు మానవ శరీరాన్ని ధరించి ప్రయత్నశీలుడు కావాలని అర్థం. ‘గృహ’శబ్దానికి ‘అంతఃకరణ’మని చెప్పబడింది.

- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512