స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజాన్ని ఆదర్శవంతంగా, సుందరంగా నిర్మాణం చేసేందుకు విశేష వ్యవస్థలను ఏర్పరచవలసిన అవసరముంది. ఈ విషయంలో వేదం ‘‘ఓ మానవుడా! నీవు నీ మిత్రులతో ప్రణీతీ = ఋజుమార్గంలో - నీతి మార్గంలో నడిచి నలుదిశల ఉత్తమప్రవర్తనలను ప్రచారం చేయు’’మని ఆదేశిస్తూ ఉంది. కాబట్టి మనం వేద దేశాన్ని శిరసావహించి నడుద్దాం!.
***
చిరాయువునకుపాయం
జీవతాం జ్యోతి రభ్యేహ్యర్వాజౌ త్వా హరామి శతశారదాయ
అవముంచన్ మృత్యుపాశన శస్తిం ద్రాఘీయ ఆయుః ప్రతరం తే దధామి
భావం: జీవితులైనవారి జీవనజ్యోతిని ఆదర్శంగా పెట్టుకొని ప్రయత్న పూర్వకంగా జీవనజ్యోతిని పొందుము. నేను నిన్ను నూరేండ్ల జీవితానికై లోకంలోనికి తెచ్చాను. అవాంఛనీయమైన మృత్యుపాశాలను నీకు దూరంగా ఉంచుతున్నాను. మహత్తరమైన సుదీర్ఘమైన ఆయువును నీకిస్తున్నాను.
వివరణ: మానవుని సాధారణ జీవితకాలం నూరేండ్లు. ఆ నూరేండ్లు జీవించాలని మనిషి భావించాలి. ‘జిజీవిషేచ్ఛతః సమాః’ అని శుక్ల యజుర్వేదం పేర్కొంది. ప్రస్తుత అథర్వణ వేద మంత్రం కూడా ‘ఆ త్వా హరామి శతశారదాయ’- నీవు నూరేండ్లు జీవించేందుకై నేనీలోకానికి తెచ్చాను అన్న భగవద్వచనాన్ని మానవజాతికి వినిపిస్తూంది. వెలిగేదీపం నుండి మరో దీపం వెలిగినట్లుగా జీవించి, జీవింపజేసేవారి వలన జీవనజ్యోతి లభిస్తుంది. ‘జీవతాం జ్యోతిరభ్యేహి’ అని వేదం హితవు పలికింది. అంటే సుదీర్ఘకాలం జీవించేవారి వద్దకు చేరి వారా సుదీర్ఘ జీవనభాగ్యాన్ని ఎలా పొందారో పరిశీలించు. సాంగత్యాన్ని బట్టి మనిషికి సదాచారాలు అలవడతాయి.
కాబట్టి చిరాయువు కోరేవారు చిరాయువు కలవారిని స్నేహం కోరుకోవాలి. అదేవిధంగా మరణించినవారిని పదే పదే స్మరించరాదు. దీర్ఘనిద్ర చెందిన వారదే రూపంలో రారు. అట్టివారిని మిక్కిలి చింతన చేయడంవలన మనిషిలో మృత్యుభీతి సంస్కారరూపంగా మదిలో నిలిచిపోతుంది. కాబట్టి మృతులను తరచుగా స్మరింపవద్దని ‘మా గతానామ దీదీథా యే నయంతి పరావతమ్’- మృతులను చిరస్మరణ చేయకు. వారు ఈ జీవితాన్ని విడిచి పరలోకానికి వెళ్లిపోయారు అని అథర్వణవేదం నిస్సంకోచంగా చెప్పింది. వేదం అంతటితో తృప్తి చెందలేదు. ‘ఆ రోహ తమసో జ్యోతిః’- మృతులను గుర్తించి సదా చింతనరూపమైన అంధకారంనుండి బయటపడి నీవు నీ జీవనజ్యోతిని వెలిగించుకో అని గట్టిగా శాసించింది కూడా.
మృత్యువు మనిషిని ఒకేసారి చంపుతుంది. కాని దురభ్యాసాలు, దురాచారాలు, దుర్వ్యసనాలు మొదలైనవి మనిషిని నిత్యమూ చంపుతాయి. అవి తొలగనిదే జీవనం సుఖంగా గడవదు. నూరేండ్ల జీవితానికి వాని నుండి మనిషి విముక్తుడు కావాలి. భగవంతుడు ‘అవముంచన్ మృత్యుపాశాన శస్తిమ్’ అవాంఛనీయమైన మృత్యుపాశాలను పోలిన దురభ్యాసాదులనుండి నిన్ను విముక్తుణ్ణి చేస్తున్నాను అని దయతో వచించాడు. కాబట్టి మనిషి మృత్యుపాశ సదృశాలయిన దురభ్యాసాదులనుండి విముక్తుడు కావాలి. ఆ దురభ్యాసాదులన్ని మృత్యువు వద్దకు మున్ముందుగా తీసుకొనిపోయేవే. వానిలో మృత్యువునకు చాలా సన్నిహితమైనది వ్యభిచారం. దానినుండి కాపాడుకొనే దివ్యసూత్రం బ్రహ్మచర్యం. విద్వాంసుడు ‘బ్రహ్మచర్యేణ తసా దేవా మృత్యు ముపాఘ్నత’- బ్రహ్మచర్య రూపమైన తపస్సు ద్వారా మృత్యువును హతమార్చుతాడు అని అథర్వణవేదం అకాల మృత్యుపాశావిముక్తికి ఉపాయం చెప్పింది. బ్రహ్మచర్యం వలననే సుదీర్ఘ జీవనం సంప్రాప్తమవుతుంది అని అథర్వణవేద మీ విధంగా అభయమిస్తూ ఉంది.
యాం త్వా పూర్వే భూతకృత ఋషయః పరిబేధిరే
సా త్వం పరి ష్వజస్వ మాం దీర్ఘాయుత్వాయ మేఖలే
‘‘ఓ మేఘలమా! (గోచి) సత్యసంధులయిన ఋషులు నాకు ధరింపజేసిన నీవు నాకు దీర్ఘాయుష్షును ప్రదానం చేయుము’’ కౌపీనం (గోచి) బ్రహ్మచర్యానికి బాహ్య చిహ్నం. దానిని నిష్ఠగా ధరించినవానికి భగవానుడే స్వయంగా ‘ద్రాఘీయ ఆయుః ప్రతరం తే దధామి’ సుదీర్ఘమైన ఆయువును నీకు ప్రదానం చేస్తున్నాను అని వాగ్దానం చేశాడు.
- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512