స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదవ్యాసుడు ధర్మపథాన్ని విడువరాదని ఇలా చెప్పాడు.
న జాతు కామాన్న భయాన్న లోభాత్‌
ధర్మం త్యజేజ్జీవితాస్యపి హేతోః॥ (మహాభారతం. ఉద్యోగ పర్వం 40-11)
‘‘కామనకు (కోరికకు) వశపడిగాని, లోభంచేత గాని, అవమానానికి భయపడి గాని, ప్రాణానికి ఆశపడి గాని ధర్మమార్గాన్ని వీడరాదు.’’ ధర్మమైనా న్యాయమనా రెండు ఒకటే. ఏదీ విడువరానిదే. ఆలోచించి ధర్మాన్ని, న్యాయాన్ని విడువనివాడే మనిషి. అదే వేదమతం. ఆర్షమతం.
**
ఆర్తసేవాపరాయణునినే అందరూ ప్రశంసిస్తారు
అను త్వాహిఘ్నే అధ దేవ దేవా మదన్విశే్వ కవితమం కవీనామ్‌
కరో యత్ర వరివో బాధితాయ దివే జనాయ తనే్వ గృణానః॥ ॥
భావం:- ఓ దివ్యగుణ సంపన్నుడా! ఏమరుపాటుతనం చేత శరీర పోషణకోసం బాధలకు గురిఅయి దీనంగా అర్థించే జనులకు నీవు సేవ చేసినప్పుడే దివ్యగుణ సంపన్నులైనవారు నిన్ను జ్ఞానులలో సర్వశ్రేష్ఠునిగా సమ్మతించి ఆనందిస్తారు.
వివరణ:- జ్ఞాని ఎవరు? ఎవనికి పాపకర్మ ఎడల అసహ్యముంటుందో అతడే జ్ఞాని. మహాకవి. కవిరాజు.

- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512