స్వాధ్యాయ సందోహం
స్వాధ్యాయ సందోహం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాజు
తూర్వన్నోజీయాంత వసస్తవీయాన్
కృతబ్రహ్మేంద్రో వృద్ధమహాః
రాజాభవన్ మధున. సోమ్యస్య
విశ్వాసం యత్పురాం దుర్త్నుమావత్॥॥
భావం:- శత్రునాశకుడను, గుణ సంపన్నత చేత ఆధిక్యం కలవాడును, బలవంతులకంటె బలవంతుడును, అన్న- ధన- జ్ఞానాదుల నధికంగా సమకూర్చుకొన్నవాడును, జ్ఞానులను సన్మానించేవాడును అయిన రాజు పూర్తిగా శత్రు నగరాలను విధ్వంసం చేయగల మహాసేనను సిద్ధపరచుకొన్నప్పుడే శాంతిదాయకుడై- ప్రియమైన రాజుగా ప్రజల చేత మన్నన పొందుతాడు.
వివరణ:- రాజ్యానికి ముఖ్యాంగాలయిన రాజు, ప్రజ, సభ (లెజిస్లేటివ్ కౌన్సిల్) సమితి (మిలిటరీ కౌన్సిల్) పరిషత్ (కేబినెట్), సభాసద్ (ఎం.ఎల్.ఏ) మొదలైనవాని వివరణలు వేదంలో విస్తారంగా కనబడతాయి. కాని ఇక్కడ ఆ అన్నింటిని గూర్చికాక రాజ్యంగాలలో ప్రధానుడైన ‘రాజు’ లక్షణాలను ఈ మంత్రం వివరించింది.
1. తుర్వన్:- శత్రు సంహారకుడు కావాలి. ‘ప్రజారంజనాత్ రాజా’ ప్రజలను సంతోషపరచువాడే రాజు అని రాజ శబ్దానికి నిర్వచనం. ప్రజలకెప్పుడు సంతోషం కలుగుతుంది? అంతరంగంలోగాని, బహిరంగంగా గాని మనస్సులలో శత్రువుల భయం లేనప్పుడే కలుగుతుంది. అంతరంగంలో భయరాహిత్యమంటే దేశంలో శాంతిభద్రతలు సురక్షితమై ఉండటం. బహిరంగ భయరాహిత్యమంటె పర దేశాలనుండి యుద్ధ్భయం లేకుండటం. ఈ రెండింటిని సమర్థవంతంగా నిర్వహించేందుకు అంతర్భహి శత్రువులను సంహరించి శాంతిని నెలకొల్పే రాజు ప్రజారంజకుడైన రాజుగా మన్నన పొందుతాడు.
- ఇంకాఉంది