స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజ సువ్యవస్థలను ధ్వంసంచేసి సమాజానికి చెరుపు కలిగించే శత్రువులు మరొక రకం. దేశాన్ని దురాక్రమణ చేసే విదేశ శత్రువులొక రకం. దేశంలోనే ఉండి దేశాన్ని బలహీనపరస్తూ దేశద్రోహంచేసే శత్రువులు మరో రకం. శత్రువులెవరైనా, ఎట్టివారయినా వారిని అణచివేయాలికదా! స్థూలంగా అది స్వశక్తితో సాధ్యపడుతున్నట్లు కనబడినా నిజానికి భగవత్సాహాయ్యం చేత మాత్రమే సాధ్యపడుతుంది. ఆ విధంగా శత్రువులపై విజయాన్ని సాధించే శక్తిని ఇమ్మన్న ప్రార్థనాంశమే ఈ మంత్ర విషయం.
శత్రు సంహారానికి తోడ్పడమని భగవంతునిగూర్చి చేసే ప్రార్థనలు వేదాలలో పలుచోట్ల కనబడుతున్నాయి.
‘వయం శూరేభిరస్తృభిరిద్ర త్వయా యుజా వయమ్‌ సాసహ్యామ పృతన్యత!’ (ఋ.1-8-4). ఓ ఇంద్ర! శస్త్ర విద్యానిపుణులైన వీరులతో కూడిన మేము నీ సహాయంతో జగడాలమారి శత్రువులను అణచివేయగల్గుదుము గాకై.
‘వయం జయేమ శతినం రసహస్రిణం వైశ్వానర వాజమగ్నే తవోతిభిః’ (ఋ.6-8-6). ఓ అగ్నీ! నీ దయవలన వందలవేల శక్తివంతులైన దురాక్రమణదారులను మేము జయించగలం.
‘వయం జయేమ త్వయా యుజా వృతమ్’(ఋ.1-102-4). దేవా! నీ తోడుతో దురాక్రమణదారులను మేము జయించగలం.
‘త్వయా యుజా పృతనాయూంరభిష్యామ్’ (ఋ.7-1-13). నీతో కూడిన వారమైన మేము తగాదాలమారి శత్రువులపై విజయం సాధించగలం.
ఇక మంత్రం ద్వితీయార్థంలో భగవంతుణ్ణి మానవుడే విధంగా భావించాలో తెలిపే ‘త్వమస్మాకం తవస్మిసి’ ‘‘నీవు మావాడవు మేము నీవారలం’’ అనే అద్భుత శరణాగతి భావన ప్రతిపాదింపబడింది. ఋగ్వేదంలో ఈ భావన ఈ ఒక్కచోటునేగాదు అనేక సందర్భాలలో పునరుద్ఘాటింపబడింది.
‘తే స్యామ దేవ వరుణ తే మిత్ర సూరభిః సహ’ (ఋ.7-66-9). ‘‘ఓ వరుణ! మేము నీవారం కావాలి. ఓ మిత్ర! అవ్యాజ స్నేహీ! మేము విద్వాంసులతో కూడినవారమై ఉండాలి.’’ భగవంతుడు నిజంగా మనవాడే. సమస్త విపత్తులలో ఆయన సదా మనవెంట ఉండి రక్షిస్తూనే ఉంటాడు. జీవనయాత్రకవసరమైన సమస్త సామగ్రిని ఆయనే ప్రదానంచేస్తాడు. అందుకే వేదంలో దైవం తల్లి-దండ్రి- బంధువు-రక్షకుడు అని నిర్ధారింపబడ్డాడు.‘త్వం జామిర్జనానామగ్నే మిత్రో అసి ప్రియః సభా సఖిభ్య ఈడ్యః’ (ఋ.1-75-4) ‘‘నీవే జీవులమైన మాకు బంధువుడవు. ప్రియమిత్రుడవు. మిత్రులలో పూజ్యుడనైన మిత్రుడవు’’ మనమూ అట్టి జనులలో ఒకరు అయితే ఇక కావలసినదేముంది? ఈ మాటనే ఔపనిష మహర్షి ఇలా ప్రకటించాడు.
‘మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా మా బ్రహ్మ నిరాకరోత్’ నేను పరబ్రహ్మను నిరాకరించను. ఎందుకంటే పరబ్రహ్మ నన్ను నిరాకరించలేదు. మహోన్నతమైన ఈ భావనకంటే ‘త్వమస్మాకం తవస్మసి’ ‘‘నీవు మావాడవు. మేము నీవారం’’అన్న భావన ఇంకా మహోన్నతమైనది. లౌకిక విషయ లంపటత్వంలో మునిగిన మనం ఇట్టి మహోన్నత భావనకు చేరుకొనే ఆ దినమెప్పుడో!!
**
మహాపురుషుడు
వేదాహమేతం పురుషం మహాంతమాదిత్యవర్ణం తమసః పరస్తాత్‌
తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాన్యః పంథా విద్యతే-యనాయ॥ ॥
భావం:- పెంజీకటి కావల- ప్రకృతికి బాహ్యంగా మరియు మహోత్కృష్టంగా సూర్యాధిక తేజస్సుతో ప్రకాశించే దైవాన్ని నేను తెలుసుకొన్నాను. మానవుడా పురుషుని తెలుసుకొని మృత్యువును దాటగలడు. మోక్షానికి గాని సద్గతికి గాని దానికి మించిన మరొక మార్గమే లేదు.
వివరణ:- భగవానుడు మహత్తుకంటె మహత్తు అయిన వాడని శుక్లయజుర్వేద మీవిధంగా వర్ణించింది.
సహస్ర శీర్షాపురుషః సహస్రాక్షః సహస్ర పాత్‌
స భూమిం సర్వతః స్పృత్వాత్యతిష్ఠద్ దశాంగుళమ్ (శు.య.వే.31-1)
‘‘వేలకొలది శిరస్సులు, వేలకొలది నేత్రాలు, వేలకొలది పాదాలు కలిగి బ్రహ్మాండమంతా వ్యాపించిన పరమపురుషుడు సర్వజీవుల హృదయాలలో విరాజమానుడైయున్నాడు’’. ఈ మంత్రానికే వ్యాఖ్యానమా అన్న రీతిగా శుక్లయజుర్వేదంలోనే మరో మంత్రం కనబడుతూంది.
‘విశ్వతశ్చక్షురుత విశ్వతోముఖో విశ్వతో బాహురుత విశ్వతస్పాత్’ (శు.య.వే.17-19)
- ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు