స్వాధ్యాయ సందోహం
స్వాధ్యాయ సందోహం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
ఆయన నేత్రాలు, ఆయన ముఖాలు, ఆయన పాదాలు విశ్వంలో సర్వదిశలా అభివ్యాప్తమై యున్నాయి.
సామాన్యంగా కళ్లున్నచోట పాదాలుండవు. భుజాలున్నచోట ముఖముండదు. కాని ఈ మహాపురుషుని ముఖ మెక్కడుంటుందో అక్కడే నేత్రాలు, చరణాలు, భుజాలు ఇలా సర్వావయవాలు ఉంటాయి. అంటే ఆయన సమస్త శక్తులు సర్వత్ర వ్యాపించియుంటాయని అంతరార్థం. ఆ శక్తుల మాహాత్మ్యాన్ని ప్రశంసిస్తూ శుక్లయజుర్వేదమే మరో మంత్రంలో ఇలా పేర్కొంది.
సర్వే నిమేషాజజ్ఞిరే విద్యుతః పురుషాదధి
నైనమఃర్థ్వ న తిర్యంచం న మధ్యే పరి జగ్రభత్॥ (శు.య.వే.32-2)
‘‘ప్రకాశమానుడు- సర్వవ్యాపకుడు అయిన భగవానుని నుండి ఉత్పన్నమయిన శక్తులను పైనుండి గాని క్రిందనుండి గాని, అడ్డంగా గాని, మధ్యలో గాని పట్టుకొనజాలం.’’
పై మంత్రంలోని ‘పురుష’ శబ్దానికర్థం వ్యాపకుడని. అథర్వణ వేదం పురుష శబ్దానికి ‘‘సూత్రానికి సూత్రం’’అని కూడ అలా వివరించింది.
వేదాహం సూత్రం వితతం యస్మిన్నోతాః ప్రజాఇమాః
సూత్రం సూత్రస్యాహం వేదాథో యద్ బ్రాహ్మణం మహత్॥
అథ.వే.10-8-38॥
‘‘సమస్త జనులతో కట్టబడి సర్వత్ర వ్యాపించిన ఈ సూత్రాన్ని (దారం) మరియు ఏది మహా బ్రహ్మజ్ఞానమో దానిని తెలుసుకొన్నాను’’. ఆ బ్రహ్మజ్ఞానం చేతనే మృత్యుపాశంనుండి విముక్తి సిద్ధించి మోక్షం ప్రాప్తిస్తుంది అని ప్రస్తుత వేదమంత్రం ‘తమేవ విదిత్వాతి మృత్యుమేతి’ ఆ పరమపురుషుని తెలుసుకొన్న ‘‘మానవుడు మృత్యువును అనగా జన్మమరణ రూపమైన చక్రాన్ని దాటి పోగలడు’’ అని స్పష్టంచేసింది. ఈ మంత్రార్థానే్న అథర్వణ వేదమంత్రం ఈ విధంగా వివరించింది.
అకామో ధీరో అమృతః స్వయంభూ రసేన తృప్తోన కుతశ్చనోనః
తమేవ విద్వాన్ న బిభాయ మృత్యోరాత్మానం ధీరమజరం యువానమ్॥ (అథ.10-8-44)
‘‘నిష్కాముడు, ధీరుడు, అవినాశి, స్వయంభువుఅయిన భగవానుడు రవంత కూడ కొదువలేని బ్రహ్మానందంతో పరిపూర్ణుడైయుంటాడు. ఆ ధీరమూ, అజరమూ, సదావనవంతమా అయిన పరమాత్మ నెరిగినవాడు మృత్యువునకు జంకడు’’. అది సత్యమే. భగవద్విజ్ఞానం భయనాశకమే కదా.
**
జీవులారా!
భోగసాధనాలను మీకు ముందే సిద్ధపరచాను
దధామి తే మధునో భక్షమగ్రే హితస్తే భాగః సుతో అస్తు సోమః
అసశ్చ త్వం దక్షిణతః సఖా మే- ధా వృత్రాణి జంఘనావ భూరి॥
॥
భావం:- ఓ మానవుడా! ముందుగా నీకోసం మధురమైన ఆనందానుభవాన్ని సిద్ధంచేసియున్నాను. అది భద్రంగా, హితకరంగా ఉంచబడింది. సోమరసం నీకోసం సిద్ధంగా ఉండుగాక! నీవు నాకు మిత్రుడవై కుడిపార్శ్వంలో ఉండు. నీవు నేను కలిసి పాపాలను సర్వవిధాలుగా నాశనం చేద్దాం.
వివరణ:- భక్తుడు జ్ఞానపూర్వకంగా ఇలా విన్నవిస్తున్నాడు.
అయం త ఏమి తన్వా పురస్తాత్ విశే్వ దేవా అభి మా యంతి పశ్చాత్
యదా మహ్యం దీధరో భాగమింద్రా- దిన్మయా కృణవో వీర్యాణి॥
(ఋ.8-100-1)
‘‘హే ఇంద్ర! నేను నా శరీరంతో నీముందుకు వస్తున్నాను. మరి వెనువెంటనే నా వెంటనే నా ఇంద్రియాలు నా వెన్నంటి రాగా నాకోసం భోగాలను సిద్ధపరుస్తావా? లేదా నాకు పురుషార్థాన్ని సిద్ధపరుస్తావా?’’అంటే ‘‘నా మనోవాక్కర్మలను సర్వాత్మనా నీ కర్పణ చేసేందుకు నేను నీవద్దకు వస్తున్నాను. నాకు భోగాలను ఇస్తున్నానని, పాప వినాశనంలో తోడుంటానని ఒక్క మాట చెప్పు’’అని అర్థం.
భక్తుని వినతికి భగవంతుడు ఇలా సమాధానమిచ్చాడు.
దధామి తే మధునో... జంఘనావ భూరి.
మధురమైన నీ భోగభాగ్యాన్ని ముందే ఇచ్చాను. భద్రంగా హితకరంగా అది ఉంచబడింది. సోమరసం సిద్ధం కావలసియుంది. నీవు నా మిత్రుడవై కుడివైపునకు రమ్ము. (పురుషార్థ తత్పరుడవై అని) పిమ్మట మనమిద్దరం కలిసి పాపాలను సర్వవిధాల నాశనం చేద్దాం.
ఇక్కడ భక్తుడు భోగభాగ్యాలతోబాటు భగవంతుని తోడ్పాటును కూడ అర్థించాడు.
- ఇంకావుంది...