స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దానికి భగవంతుడు ‘‘్భగభాగ్యాలను ఎప్పుడూ ప్రదానం చేస్తూనే ఉన్నాను. నేను ప్రదానం చేసేది నీకు హితకరమైనది భద్రప్రదాయకమైనది. పాపనాశనంకోసం నీవు సహాయమర్థిస్తే నా కుడి పార్శ్వానికి రా. నీకు నీవే నాకు ఉపకరణం కా. అహంకార మమకారాలను విడిచి నాకాయుధంగా మారిపో’’అని ఆదేశించాడు.
భోగాలను ముందే ఇచ్చానన్నమాట విశేషమైనది. ఈ విశ్వంలోనికి జీవుని తీసుకొని వచ్చేముందు అతడికి సర్వోపయోగకరమైన పదార్థ జాతాన్ని సృష్టించియే తీసుకొని వస్తున్నానని పరమాత్మ వేదాలలో పలుమార్లు చెప్పాడు. తల్లి గర్భంనుండి శిశువుగా జీవుడు జన్మించగానే తల్లి స్తనాలనుండి పాలు సహజంగా అతడికోసమే స్రవిస్తున్నాయి. అది భగవత్ సృష్టిలో సహజ వ్యవస్థ. ఈ వ్యవస్థ సృష్టి అంతా పరివ్యాప్తమై ఉంది. సృష్టిలోని ప్రతి పదార్థం మరియు ప్రతి ద్రవ్యమూ జీవుని భోగానుభవానికి భగవంతుడు ముందుగానే సిద్ధపరచియున్నాడు.
కాకపోతే ఆ భోగానుభవాన్ని భగవదుపదేశానుసారం అంటే వేద ధర్మానుసారం అనుభవిస్తున్నాడా? అన్నది ప్రధానాంశం. అట్లే చేస్తే అది పుణ్యకర్మ. కాకుంటే అది పాపకర్మ. వీనిలో దేనిని చేసేందుకయినా జీవుడికి స్వేచ్ఛఉంది. కాకపోతే ఏది పుణ్యకర్మ ఏది పాపకర్మ అన్నదాన్ని నిర్ణయించుకొనేందుకు సృష్టిలో లక్షలాది జీవరాశులకు లేని బుద్ధివైభవాన్ని ఒక్క మానవుడికే దైవమిచ్చింది. దానిని సద్వినియోగపరచుకొని గాని దుర్వినియోగపరచుకొనక గాని కర్మచేస్తే ఆ కర్మవలన కలిగిన ఫలం ‘సుతో అస్తు సోమః’ ‘‘సోమరస రూపంగా సిద్ధమైయుంటుంది.’’ అది పుణ్యరూపంకావచ్చు. లేదా పాప రూపం కావచ్చు. పాప రూపమైన ఫలంనుండి విముక్తుడవు కావాలనుకొంటున్నావా?
‘అసశ్చ త్వం దక్షిణతః సభా మే’ ‘‘మిత్రుడవై దక్షిణ పార్శ్వానికి రా’’ అని దైవమాహ్వానిస్తూంది. కుడిపార్శ్వం దక్షిణాచారానికి అంటే సదాచారానికి సంకేతం. దీనికి భిన్నమైనది వామా (ఎడమ)చారం. దీనిని విడిచి దక్షిణాచార సంకల్పుడవై రమ్మని అందునా నా మిత్రుడవుగా రమ్మని ఆహ్వానించే భగవదాలంబాన్ని ఎవరూ విడుచుకోరు కదా.
**
అల్పజ్ఞులు సహితం
వేదవాక్కును విడువరాదు
వచోవిదం వాచముదీరయంతీం విశ్వాభిర్ధ్భీరుపతిష్ఠమానామ్‌
దేవీం దేవేభ్యః పర్యేయుషీం గామా మావృక్త మర్త్యో దభ్రచేతాః॥

భావం:- వాక్కును ప్రసాదించేది, వాగ్రహస్యాలను బహిరంగపరచేది, వాక్కును వృద్ధిపరచేది, వాగింద్రియాన్ని పలికించేది, సమస్త ఆలోచనా విధానాలను సంస్కరించేది, దేవతలను ప్రాప్తింపచేసేది, దేవతలచేత ప్రాప్తింపచేసేది అయిన దివ్యగుణయుతమైన వేదవాణిని అల్పజ్ఞుడైన మానవుడెన్నడూ విడువరాదు.
వివరణ:- ఈ మంత్రం వేదవాణి విశేష గుణాలను వర్ణించి చివరగా ‘గామా మావృక్త మర్త్యోదభ్రచేతాః’ ‘‘అల్పజ్ఞుడవైన మానవుడా! వేదవాణి నెన్నడూ విడువకు’’మని ఆదేశించింది. వాక్కునకు మూలం వేదవాణియే. అది ‘వాచోవిత్’ వాక్కును ప్రసాదించేది. అంటే లోకంలోని సర్వశబ్దాలు ఆ వేదవాక్కునుండి జనించినవే అని భావం. ఆ వేదవాణి వాక్కును సమున్నతంగా చేస్తుంది. జ్ఞానమయమూ విజ్ఞానవంతమూ మరియు భగవన్మహిమా గాన సమన్వితమూ అయిన వాక్కును అధ్యయనంవలన మనిషిలోని వాక్‌శక్తి ప్రవృద్ధమవుతుంది. అట్టి శబ్దవ్యవహారం చేతనే మనిషి సభ్యజనుడా కాదా అన్న విషయం నిర్ధారింపబడుతుంది.
అంతేకాదు. ఆ వేదవాణి ‘విశ్వాభిర్ధ్భీరుపతిష్ఠమానామ్’ మానవుని సమస్త ఆలోచనా విధానాలను సంస్కరిస్తుంది. మానవుని సమున్నతుని చేయడమే వేదవాక్కు పరమలక్ష్యం. ఆ కారణంగా మానవోన్నతికెనె్నన్ని విచార ధారలున్నాయో అవన్నీ వేదాలలో ఉపదేశరూపకంగా ఉన్నాయి. ఈ దృష్టితోనే ఈ మంత్రంలో ‘విశ్వాభిర్ధ్భీరుపతిష్ఠమానా’ సమస్త విచార ధారలను సంస్కరించునది అని వేదవాణి చేత ప్రశంసింపబడింది. ఈ వేదవాణి మానవుణ్ణి సంస్కరించి దేవతలుగా తీర్చిదిద్దుతుంది. అందుచేతనే ‘దేవేభ్యః పర్యేయుషీ’ దివ్యగుణాలను, దివ్య వ్యవహారాలను ప్రాప్తింపచేస్తుంది అని మంత్రం వేదవాణి ప్రాశస్త్యాన్ని కీర్తించింది. ఈ కారణంచేతనే వేదవాణి ‘దేవి’వ్యవహార శిక్షకమైనదిగా చెప్పబడుతూంది. ఇట్టి వేదవాణి జ్ఞానులే కాదు జ్ఞానశూన్యులు సహితమభ్యసింపవలసి యుంది. వేదవాణిని అభ్యసించకపోవడం గోహత్యతో సమానం- ఋగ్వేదం
- ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512