స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాతా రుద్రాణాం దుహితా వసూనాం స్వసాదిత్యానామమృతస్య నాభిః
ప్ర ను వోచం చికితుషే జనాయ మా గామనాగామదితిం వధిష్ట॥ ॥
వేదవాణి రుద్రులను సత్కరించేది. వసువుల మనోభీష్టాలను పరిపూర్ణం చేసేది. ఆదిత్యులయందంతర్గతమైన శక్తిస్వరూపం. అట్టి నిర్దోషమైన వేదవాణిని హత్యచేయవలదని జ్ఞానాభిలాషులనందరికి హితవు పలుకుచున్నాను
**
329. ఆత్మ చంపబడదు
న యం రిపవో న రిషణ్యవో గర్భే సంతం రేషణా రేషయంతి
అంధా అపశ్యా న దభన్నభిఖ్యా నిత్యాస ఈం ప్రేతారో అరక్షన్‌॥ ॥
భావం:- ఆత్మసూక్ష్మమైనది. అంతర్లీనంగా ఉండేది. దీనిని శత్రువులు, హింసా ప్రవృత్తికలవారు, హంతకులు చంపలేరు. ఆ ఆత్మను చూడలేనివారు, అంధులు. ఆ ఆత్మను అన్నిదిశల దర్శించగల జ్ఞానులు మాత్రమే రక్షించగలరు.
వివరణ:- ఈ మంత్రంలో ఆత్మ నిత్యత్వం ప్రతిపాదింపబడింది. దీనికి దేవత అగ్ని, శతపథ బ్రాహ్మణ్యంలో ‘ఆత్మా వా అగ్నిః’(శత.7-3-1-2) ‘‘నిశ్చయంగా ఆత్మయే అగ్ని’’అని చెప్పబడింది. శరీరంలో ఆత్మ ఉన్నంతకాలమే అగ్ని ఉంటుంది. దేహాన్ని ఆత్మ విడిచిపెట్టినంతనే అది వెంటనే చల్లబడిపోతుంది. అందుకే ఆత్మ అగ్నియే. అగ్నికి ‘‘తీసుకొని వెళ్లేవాడు’’అన్న మరో అర్థముంది. శరీరాన్ని ఒకచోటునుండి మరొక చోటుకు తీసుకొనిపోయేది ఆత్మయే. కాబట్టి ఆత్మ అగ్నియే. ఆత్మ శరీరంలో ఉన్న కారణంచేతనే అది వృద్ధిపొందుతుంది. కాబట్టి ఆత్మ అగ్నియే.
మనకి వందలాది మంది శత్రువులుంటారు. వారిలో చాలమంది బ్రతికుండగానే చంపాలని ప్రయత్నిస్తారు. వారు మనిషి శరీరాన్ని ఖండఖండాలుగా చేసి చంపగలరు. హింసించగలరు. కాని ఆత్మను మాత్రం ‘న రేషయంతి’ హింసింపలేరు. పంచభూతాలు జీవనప్రదాతలయినా అవి ప్రళయకారులు కూడ. అగ్ని అన్నింటిని భస్మం చేస్తుంది. గాలి సర్వాన్ని ఎగురగొడుతుంది. వరదల రూపంలో జలం అన్నింటినీ ముంచివేస్తుంది. కాని అవి ఏవీకూడ ‘న యం రిపనో న రిషణ్యవో గర్భే సంతం రేషణా రేషయంతి’ ‘‘శరీరగతమైన ఆత్మను శత్రువులుగాని, హింసాశక్తిగల హింసకులు గాని నాశనంచేయలేరు’’. ఈ మంత్రార్థమే భగవద్గీతలో సుందరమైన రీతిలో ఇలా వర్ణింపబడింది.
నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః॥ (్భ.గీ.2-23)
ఆత్మను శస్త్రం ఖండించలేదు. అగ్ని మండింపజాలదు. నీరు తడుపజాలదు. గాలి ఎండింపచేయలేదు.
‘అచ్ఛేద్యో- యమదాహ్యో- యమక్లేద్యో- శోష్య ఏవ చ’ (గీత.2-24) ఆత్మ ఖండింపబడదు. మండింపబడదు. బాధింపబడదు. ఎండింపబడదు.
‘దేహీ నిత్యమవధ్యో- యం దేహే సర్వస్య భారత’! (్భ.గీ.2-30) ఓ అర్జున! సర్వజీవులయందున్న ఆత్మ చంపబడరానిదే. ఆత్మను చంపుతానని భావించినవాడు అజ్ఞాని.
కఠోపనిషత్తు ఆత్మనిత్యత్వాన్ని గురించి ఇలా చెప్పింది.
హంతా చేన్మన్యతే హంతుం హతశే్చన్మన్యతే హతమ్‌
ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే॥ (కఠ.ఉ.2-19)
చంపేవాడు చంపుతున్నానని, చంపబడేవాడు చంపబడుతున్నానని భావించినట్లయితే ఆ యిద్దరు అజ్ఞానులే. ఎందుకంటే ఆత్మచంపదు. చంపబడదు.
ఆత్మ దర్శనం గురించి ఈ మంత్రం గర్భేసంతమ్ అన్న వాక్యంలో ప్రస్తావించింది. దీని అర్థం కఠోపనిషత్తు(2-12) ‘తం దుర్దర్శం గూఢమనుపవిష్టమ్’అన్న వాక్యంలో స్పష్టంచేసింది. అంటే ఆత్మ చూడనలవికానంత సూక్ష్మమయినది అంతర్లీనమయినది అని అర్థం. అట్టి ఆత్మను వేదం ‘అంధా అపశ్యా న దభన్’ ‘‘కళ్లుండి చూడనివాడు కళ్లులేక చూడలేనివాడు ఇరువురూ చూడలేరు’’అని వ్యాఖ్యానించింది. ఇక్కడ గ్రుడ్డితనం బాహిరమైన నేత్రాలకు సంబంధించినది కాదు. ఆత్మను దర్శించాలనే భావనాత్మకమైన లోచూపు అంతర్దర్శన శక్తికి సంబంధించినది. అట్టి దర్శన జ్ఞానశక్తి కలిగియుండి కూడ దానిని ఆత్మదర్శనానికి వినియోగించనివాడు కళ్లుండి చూడనివాడు. అసలు ఆత్మదర్శన జ్ఞానశక్తి సుతరాము లేని అజ్ఞాని, కళ్లులేని కబోది.
- ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512