స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
ఉత్తమ కుల సంజాతుడు, కమనీయుడు అయిన పతిని కోరుతూ మహాగణపతి అయిన ఈ వధువు పతిగృహానికి వస్తున్నది. వీరి గృహస్థాశ్రమ రూపరథం దశదిశల కీర్తనీయమై ప్రసిద్ధమగుగాక! భార్యాభర్తలుగా వీరు కలిసి అనేక యజ్ఞయాగాది శుభక్రతువులను చేయుదురుగాక!
ఇలా ఈ మంత్రం వధువు భర్తగా ఎన్నుకొనే పురుషునిలోని ఉత్తమకుల సంజాతత్వం మరియు కమనీయత అనగా సౌందర్య లక్షణాలను ప్రస్తావించగా ఋగ్వేదమే మరో మంత్రంలో వరుని వన లక్షణాన్ని ప్రస్తావించింది.
తవస్మేరా యువతయో యువానం మర్మృజ్యమానాః పరి యంత్యాపః॥

‘‘బ్రహ్మచర్యాది వ్రతాలలో పరిశుద్ధయై నీటివలె చల్లని స్వభావంగల స్ర్తి గంభీరాలోచనా ముద్రితయై వనవంతుడైన పతినే వరిస్తుంది’’. ఈ మాటద్వారా వేదమేనాడో వనితలకు వృద్ధపతులతో వివాహాన్ని నిరాకరించింది. మగాడికెందుకే అందచందాలు? కొరుక్కుతింటామా? అని స్ర్తిని గదమాయించి అందవికారపురుషులతో పెండ్లిండ్లు జరిపించే సమాజంలోని దురాచారాన్ని కూడ ‘వధూరియం..’ (ఋ.5-37-3)అనే మంత్రం నిరసించింది. ఇట్టి వేద సందేశాలను అనుసరించి స్ర్తిజనోద్ధరణ జరిగేదెన్నడో!.
**
దైవాన్ని మదిలో నిలుపుకొన్నంతనే...
ప్ర మా యుయుజ్రే ప్రయుజో జనానాం వహామి స్మ పూషణమంతరేణ
విశే్వ దేవాసో అధ మామరక్షందుః శాసురాగాదితి ఘోష ఆసీత్‌॥

భావం:- ప్రజలను చైతన్యపరచి ప్రేరణ కలిగించే దైవయుక్తులు నాకుకూడ ప్రేరణ కలిగించినంతనే, బ్రహ్మాండ నాయకుడిని నేను నా హృదయంలో నిలుపుకొన్నంతనే విశ్వమంతా వ్యాపించిన సంపూర్ణ దివ్యగుణాలు నన్ను సంరక్షించినంతనే దైవం వశపడిపోయిందన్నమాట పెద్ద ఘోషగా బహిర్గతమయింది.
వివరణ:- ప్రతి ప్రాణి తన పలు పూర్వజన్మలలో ఏదో ఒక జన్మలో ఉత్తమగతిని పొందిన అనుభవాన్ని అనుభవించేయుంటుంది. లోకంలో కొంద రు మనుష్యులు అదృష్టవశాత్తు ఉత్తమజన్మను పొంది తిరిగి అధమజన్మకు జారిపోయినటువంటివారుంటారు. ధనవంతులు పేదవారుగా మారిపోతారు. ప్రమాదవశంచేత తపస్వులు తపోభ్రష్టులయిపోతారు. ‘అనభ్యాసే విషం విద్యా.’ పునశ్చరణ చేయకుంటే విద్య విషంగా మారిపోతుంది. అంటే అభ్యాసం చేయకుంటే జ్ఞాని విజ్ఞానంకూడ లుప్తమైపోతుందని భావం. ఇట్టివారందరు తమతమ పూర్వవైభవాన్ని తలచుకొని ‘ప్ర మా...ఆసీత్’ ‘‘ఆహా! ఏమి దయనీయ అవస్థ! లోకంలో నిన్నటివరకు ఎవని మాట మారుమ్రోగిందో, ఎవనిమాట శాసనమై నడచిందో, విద్వాంసులందరు ఎవనిని గౌరవించేవారో నేడతడు లెక్కలేని దురవస్థలో పడిపోయాడు’’అని విలపిస్తారు. ఈ ఆవేదన ఏ సంసారి రోదనయో కాదు. ‘వహామి స్మ పూషణమంతరేణ’ ‘‘జగత్పాలకుడైన పరమేశ్వరుని హృదయమంతా నిలుపుకొన్నాను’’అని చెప్పుకొనే ఒక దైవభక్తునిది. లోకపాలకుడగు సర్వేశ్వరుడు ఒకప్పుడు నా హృదయంలో ఉన్నాడు. కాని నేడు ఆ స్థితిని కోల్పోయాను. నేను ప్రభువును భక్తితో సేవించే కాలంలో అందరూ నన్ను సన్మానించారు. నేను దురభిమానంలోపడి నా గౌరవాన్ని కోల్పోయాను. ఇది ఆ దైవభక్తుని ఆవేదన.
‘నేను-నా గౌరవం- నా కీర్తి’అంతా భగవద్భక్తివలననే సిద్ధించింది. కాని ఆ దైవభక్తిని విస్మరింపగానే అన్నీ కోల్పోయాను. దైవాన్ని తనవానిగా చేసుకోనివాడు దేనిని పొందలేడు.
న యస్య తే శవసాన సఖ్యమానంశ మర్త్యః నకిః శవాంసి తే నశత్‌॥

‘‘బలసంపన్నులకు కూడ బలమైన సర్వేశ్వరా! నీ సఖ్యాన్ని పొందనివాడు నీవలన ఏ బలాన్నీ పొందలేడు.’’
భగవంతుడు సులభంగా వశపడనివాడు. ఆయన సఖ్యంవలన కూడా నేను ఆయనకు వశపడని వాడనయ్యాను. ఫలితంగా ఆయన చెలిమిని విడిచి సంసార సంగమం చేసాను. సంసార వేదికనెక్కగానే నాలోని సర్వశక్తులు క్షీణించిపోయాయి. జ్ఞానోదయమై నేడు ‘ప్ర మా యుయుజ్రే ప్రయుజో.’ జనులను చైతన్యవంతులనుచేసి ప్రేరణ కలిగించే యుక్తులు నాకును లభించుగాక’’అని కోరుకొన్నాను. ‘జనానాం వహామి స్మ పూషణమంతరేణ’ ‘‘విశ్వవిభుని తిరిగి నామదిలో ప్రతిష్ఠించుకొంటాను.’’ ‘విశే్వ దేవాసో అధ మామరక్షన్’ విద్వాంసులందరు నన్ను రక్షింతురు గాక!
- ఇంకావుంది...