స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సులభంగా వశపడని దైవం వశపడిందన్న ఘోష నిర్భరంగా వినవచ్చింది.’’ నిజమే భగవంతుని హృదయంలో నిలుపుకొన్న వానికట్టి ఫలాలు తప్పక సిద్ధిస్తాయి. ఋగ్వేదం ఈ విషయాన్ని ‘సో అస్త్వయం చ సోమో హృదయం బిభర్మి’ (ఋ.10-32-9) నా హృదయమంతా నిలిచియున్న భగవానుడు నా కొరకై సోమ=ఐశ్వర్యప్రదాయకుడగుగాక’’అని సూటిగా ప్రకటించింది.
**
గురుశిక్షణామహత్త్వం
నిధీయమాన మపగఃళ్హమప్సు ప్ర మే దేవానాం వ్రతపా ఉవాచ
ఇంద్రో విద్వాన్ అను హి త్వా చచక్ష తేనాహమగ్నే అనుశిష్ట ఆగామ్‌॥ ॥
భావం:- పంచతన్మాత్రలతో (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు) కూడిన దేహంలో ఆత్మనిగూఢమై దాగియుంది. దానిని గురించి పరిపూర్ణంగా విద్యాభిలాషి యయిన శిష్యుడికి శిష్యుని బ్రహ్మచర్యాది వ్రత సంరక్షకుడయిన గురువు మాత్రమే పరిపూర్ణంగా బోధించగలడని ఆయన నాకు ఉపదేశించాడు. ఓ జ్ఞానీ! నేను అట్టి గురువుచేత సుశిక్షితుడనై వచ్చి యుంటిని.
వివరణ:- ఆత్మ అంటే ఏమిటి? ఎక్కడుంటుంది? ఈ విషయాలు తెలిసినవారు లోకంలో కొందరే. అలా తెలిసినవారు సహితం తమకుతాముగా తెలుసుకోగలిగారా? లేదు. వారు కూడ ఎవరిదగ్గరనో నేర్చుకొన్నవారే. ఏ విద్యనైనా నేర్చుకోదలచినవాడు దానిని నేర్చగల ఆచార్య పురుషుల వద్దకు వెళ్లవలసి యుంటుంది. ఆచార్యుడు ఆ విద్యార్థి యోగ్యతను పరీక్షించి వానికి ఆ విద్య నేర్పుతాడు. ఆత్మ విద్యనభ్యసించాలనే జిజ్ఞాసువయిన విద్యార్థి ఆ విద్యలో పరిపూర్ణత సిద్ధించిన గురువు నాశ్రయిస్తే పూర్ణ్ఫలాన్ని పొందుతాడు. ఆత్మ విద్యను బోధించే ఆచార్యుడు ఏ లక్షణాలను కలిగియుండాలి? వేదం ‘దేవానాం వ్రతపాః’ అయి ఉండాలని చెప్పింది. దేవ శబ్దానికి అర్థం విద్యాభిలాషి అయిన జిజ్ఞాసువగు విద్యార్థి అని అర్థం.
ఆచార్యుడు అట్టి విద్యార్థి ‘వ్రతపాః’ బ్రహ్మచర్యాది పవిత్ర వ్రత ధర్మాలను సంరక్షించేవాడు కావాలి. ఇట్టి లక్షణాలుగల ఆచార్యుని ఉపనయన సందర్భంలో ఈ విధంగా ప్రార్థన చేస్తాడని ఆశ్వలాయన ధర్మశాస్త్రం ఇలా వివరిస్తూంది. ‘మమ వ్రతే తే హృదయం దధామి’ (అశ్వ.్ధ.1-21-7)
‘‘నేను నా వ్రతంలో మీ మనస్సును సంయోజనపరుస్తున్నాను. నిజమే కదా! శిష్యుని వ్రతంలో గురువు మనస్సు సంయోజనమయినపుడే అది సఫలమవుతుంది. అట్టి శిష్యవ్రత సంరక్షకుడయిన గురువే యథార్థంగా శిష్యుడికి ఆత్మోపదేశం చేయగలడు. ప్రస్తుత మంత్రంలోని ‘నిధీయమాన మపగూళ్హమప్సు ప్ర మే దేవానాం వ్రతపా ఉవాచ’ ‘‘పంచ తన్మాత్రలలో అత్యంత రహస్యంగాఉన్న ఆత్మతత్త్వాన్ని జిజ్ఞాసువుల వ్రత సంరక్షకుడగు ‘దేవానాం వ్రతపాః’ గురువు నాకు ఉపదేశించాడు’’ అన్న వాక్యార్థం ఈ విషయానే్న ప్రతిపాదిస్తూంది.
పంచతన్మాత్రమయ దేహంలో ఆత్మనిగూఢంగా ఉందని వేదం సూచించింది.
దానికోసం ఎక్కడ అనే్వషింప పనిలేదు. కాకపోతే ఆ ఆత్మ సర్వసామాన్యంగా దర్శనం కాదు అని యముడు నచికేతుడితో ఇలా అన్నాడు.
న నరేణావరేణ ప్రోక్త ఏష సువిజ్ఞేయో బహుధా చింత్యమాన.
అనన్యప్రోక్తే గతిరత్ర నాస్త్యణీయాన్ హ్యతర్క్యమణుప్రమాణాత్‌॥ కఠో.ఉ.1-2-8॥
‘‘అనేక ప్రకారాలుగా విచారణీయాంశమైన ఆత్మతత్త్వాన్ని సమర్థుడైన గురువు బోధింపకుంటే అది ఎన్నటికీ బోధపడదు. జ్ఞానికానివాడు బోధిస్తే ఆ తత్త్వ మధోగతి పాలవుతుంది. అది బాహ్య సాధనాలచే నిరూపింపబడదు. ఆత్మవిద్య పరిపూర్ణంగా సద్గురువు ద్వారా మాత్రమే లభ్యమవుతుంది.’’ ఛాందోగ్యపనిషత్తు కూడ ఈ విషయానే్న యథాతథంగా ఇలా ప్రతిపాదించింది.
అనే్య మనుష్యేభ్య ఇతి హ ప్రతిజజ్ఞే భగవాన్ స్వైవ మే కామే బ్రూయాత్‌
శ్రుతం హ్యేవమే భగవద్ దృశేభ్యః ఆచార్యాద్ధైవ విద్యా విదితా
సాధిష్ఠం ప్రాపయతీతి ॥ ఛాందోగ్య ఉ.4-9-2,3॥
మహారాజా! నాకు మనుష్య భిన్నమైన ప్రకృతి పదార్థాలు నాకాత్మవిద్యను ఉపదేశించాయి. కాని భగవత్స్వరూపులైన మీరే నాకు ఆత్మవిద్యను బోధించాలని నా కోరిక.
మహాత్ములైన మీవంటి ఆచార్యుల నుండి నేర్చిన విద్యయే అభీష్ట్ఫలప్రదాత కాగలదని మహాపురుషులు చెప్పగా విన్నాను.
- ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512