స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యస్య దేవే పరాభక్తి ర్యథా దేవే తథా గురౌ
తస్యైతే కథితా హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః॥
భగవత్సమానుడైన గురువుమీద అనన్యభక్తిగల మహాత్ముడికే గురూపదిష్ట తత్త్వబోధ హృదయంలో లగ్నమవుతుంది. అందుకే బ్రహ్మవిద్యకు గురువు నాశ్రయించుమని ‘తేనాహమగ్నే అనుశిష్ట ఆగామ్’ ‘‘ఓ జ్ఞానీ! అట్టి గురువుచే సుశిక్షితుడనయి వచ్చియుంటిని’’ అన్న గురుశిక్షితుడైన ఆత్మజ్ఞాని యొక్క అనుభవ వాక్యాన్ని ఋగ్వేదం ఇలా ప్రబోధించింది.
***
దేవా! మాకు తండ్రివి కమ్ము
సం మా తపంత్యభితః సపత్నీరివ పర్శవః
ని బాధతే అమతిర్నగ్నతా జసుర్వేర్న వేవీయతే మతిః॥
మూషో న శిశ్నా వ్యదంతి మాధ్యః స్తోతారం తే శతక్రతో
సకృత్సు నో మఘవన్నింద్ర మృళయాధా పితేవ నో భవ॥ ఋ.10-33-2,3॥
భావం:- కుత్సితభావాలు ఆత్మను తాకుతూ సవతులవలె అన్నివిధాల బాధిస్తున్నాయి. అజ్ఞానం నాకు మిక్కిలి దుఃఖాన్ని కలిగిస్తూంది. దిగంబరత్వం, హింసా స్వభావం నన్ను బాధిస్తున్నాయి. నా మనస్సు పక్షివలె చలించిపోతూ ఉంది.
భావం:- ఓ ఇంద్రా! తన అవయవాలను తానే కొరికి తినే ఎలుకవలె నినే్న స్తుతిస్తూ ఆరాధించే నన్ను శారీరక మానసిక బాధలు తినివేస్తున్నాయి. అందువలన నాపై నీవు తండ్రివిగా ఒక్కసారయినా దయ చూపుము.
వివరణ:- మానసిక దుఃఖాలెన్నివిధాలుగా కలుగుతాయో ఈ మంత్రం వివరిస్తూంది. మొదటగా మనస్సును బాధించేవి కుత్సితభావాలు. వీటి బాధకు ఉపమానంగా ‘సపత్నీ రివ’ సవతులవలె అని మంత్రం పేర్కొంది. పరిశీలిస్తే దీనిలో ఎంతో సారస్యముంది. పురుషుడికి ఒకరికంటె ఎక్కువమంది భార్యలుండటం సహజంలో సమర్థతకు గౌరవానికి చిహ్నంగా ఉండవచ్చు. కాని వ్యక్తిగత కుటుంబ జీవితంలో వారు కలిగించే మానసిక బాధ భరించరానిదిగా ఉంటుంది. అలాగే ఆత్మకు పట్టుకొన్న కుత్సిత భావాలు తాత్కాలిక ప్రయోజనాలను కలిగించి ఆనందాన్ని కలిగించినా కాలక్రమంలో అవి మనిషకి చేసే చెరుపు అంతా ఇంతా కాదు. ఈ గంభీరార్థాన్ని ఆ ‘సపత్నీరివ’ అన్న ఉపమానంలో వేదం గర్భీకరించింది. కుత్సిత భావాలతోపాటు అజ్ఞానం కూడా దుఃఖాన్ని కలిగిస్తుంది. దీనినే వేదం ‘అమతిః’ అని అంది. దీని తరువాత మనిషికి మరో దుఃఖదాయిని ‘నగ్నత’. దీని అర్థం దిగంబరత్వంగా వాచ్యార్థాన్ని గ్రహించకూడదు. సాధారణంగా మనిషి కేవలం శరీర సంబంధమైన సుఖ సంతోషాలతోనే ముఖ్యంగా భావిస్తాడు. దానికి మించిన ఆత్మసౌందర్య గుణాలున్నాయంటే వాటిని పరిగణనలోనికి తీసుకోడు. ఇట్టి స్వభావానే్న వేదం ‘నగ్నతా’= కేవలం శరీర సౌఖ్యభావనగా పేర్కొంది. ఇది కూడ మనిషికి దుఃఖాన్ని కలిగించేవానిలో ముఖ్యమైనది. దీని తరువాత జీవితాన్ని దుఃఖమయం చేసేది భయం. అది పక్షి పిల్లలాగ మనిషిని జీవితమంతా భయకంపితుణ్ణి చేస్తుంది. ఈ వరుసలో మానవుణ్ణి దుఃఖితుణ్ణి చేసేవి శారీరక వ్యాధులు.
వేదం మనిషికి దుఃఖాన్ని కలిగించే కారణాలుగా వీనినే పేర్కొన్నా ఇంకా అనేకమున్నాయని అందరికి అనుభవంలో ఉన్నదే.
ఈ దుఃఖాలను భరించలేక భగవంతుని రక్షించమని ఆక్రోశంతో చేసే ఒక ఆర్తుని ప్రార్థనగా ‘వ్యదంతి మాధ్యః స్తోతారం శతక్రతో!’ ‘‘అనేక కార్యభారాలను నిర్వహించేవాడా! నేను నీ భక్తుడను. నినే్న సదా స్తోత్రం చేసేవాడను. నన్ను మనోదుఃఖాలు బాధిస్తున్నాయి’’అని వేదం పేర్కొంది. ఇక్కడ ఆర్తుని ప్రార్థనా రూపంగా వర్ణించిన ఋగ్వేదమే మరొకచోట దైవాన్ని ఈ విధంగా ఉపాలంభించింది.
యదింద్రాహం యథా త్వమీశీయ వస్వ ఏక ఇత్‌ స్తోతా మే గోషఖా స్యాత్‌॥
శిక్షేయమస్మై దిత్సేయం శచీపతే మనీషిణే యదహం గోపతిః స్యామ్‌॥ ఋ.8-14-1,2॥
ఓ పరమేశ్వర! నేను కూడ నీలాగే సమస్త సంపదలకు ఏకైక స్వామిని. అయితే నన్ను స్తుచేసేవాడు గోమిత్రుడే అవుతాడు. అంటే అతడికి ధనధాన్యాలు, జ్ఞానానికి లోటే ఉండదు. ఇంద్రియాలు అతడిని వంచించవు. ఓ ఇంద్ర! నేనే గోపతిని అయితే అంటే పృథివీపతి, వాత్పతి, జ్ఞానపతి నయితే వానిని ఈ జ్ఞానికి బుద్ధిమంతుడికి నేర్పేవాడిని. ఓ ప్రభూ! నీవెలాంటివాడవు? నీ భక్తుడు మానసిక బాధలతో, ఆకలిదప్పులతో బాధపడుతున్నాడు.
- ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512