స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ తీయని ఉపాలంభన వెనుక భక్తుని ఎంత చేదయిన నిర్వేదన.
ఓ ప్రభూ! ఇప్పటికే ఎంతో దుఃఖితుడవై బాధపడ్డాను. ‘సకృత్సు మఘవన్నింద్ర మృళయ’ ‘‘పరమేశ్వర! ఒక్కసారి మాపై దయచూపు.
‘‘పితేవ నో భవ’ తండ్రివి కమ్ము. దుఃఖితుడు, ఆర్తుడు, భీతుడు, పీడితుడు అయిన కుమారుని దువస్థను చూచి తండ్రి శాంతంగా ఉండగలడా! ఓ ప్రభూ! ‘‘సకృత్ సుమృళయ’ ‘‘ఒక్కసారి మాపై దయచూపు’’. ‘పితేవ నో భవ’ ‘‘మాకు తండ్రివి కమ్ము’’. ఇలా హృదయాన్ని విప్పి ప్రార్థించే ఆర్త పుత్రుని ఆ తండ్రి ఆదుకోకుండా ఉంటాడా? మనమూ అలానే ప్రార్థిద్దాం.
***
సత్యోపదేశం నాకు ప్రీతి కల్గించుగాక!
పిపర్తు మా తదృతస్య ప్రవాచనం దేవానాం యన్మనుష్యా అమన్మహి
విశ్వా ఇదుస్రాః స్పళుదేతి సూర్యః స్వస్త్యగ్నిం సమిధానమీమహే॥ ॥
భావం:- విద్వాంసులు ప్రబోధించే సత్యోపదేశాన్ని మానవులమైన మేము హృదయంలో చింతన చేస్తూ ఆచరిస్తాం. అది మాకు సంప్రీతిని కలిగించుగాక! సూర్యుడు సమస్త కిరణాలను వ్యాపింపచేస్తూ ఉదయించే రీతిగా విద్వాంసుడు వెదజల్లే ఉత్తమ జ్ఞానప్రకాశాన్ని మేమ కోరుకొంటున్నాం.
వివరణ:- సత్యం పలకడం కష్టం. వినడమూ కష్టమే. సత్యాన్ని విని ఇష్టపడటం కూడ మరీ కష్టం. కాని సత్యాన్ని మించిన హితకారిణి మరొకటి లేదు. ఎవడో భాగ్యవంతుడే‘పిపర్తు మా తదృతస్య ప్రవాచనమ్’ ‘‘ఋత సంబంధమైన సృష్టి లేదా భగవత్ నియమాలు. ధర్మాలు, శాసనాలు నాకు ప్రీతిని కలిగించుగాక!’’ అని సాహసంతో పలుకగలడు. ఋతోపదేశం చేత సంప్రీతి కలిగినవాడే ‘అగ్నే యాహి సువిదత్రేభిరర్వాజ్ సతె్తైః కావ్వైః’ (ఋ.10-15-9) ‘‘ఓ మహాజ్ఞానీ! సుప్రసిద్ధ సత్యోపదేశాలతో నీవు మా ముందుకు రమ్ము’’ అని వినమ్రంగా పలుకగలడు. ఋతానుసరణ ప్రతి వ్యక్తికి జీవితంలో అత్యంతావశ్యకం.
‘పరిచిన్మర్తో ద్రవిణం మమన్యాదృతస్య పథా నమసా వివాసేత్’ (ఋ.10-31-2) ‘‘మనిషి జీవితంలో ఐశ్వర్యాన్నికోరుకొంటే వినయంతో ఋత మార్గాన్ని అనుసరించాలి.
ఈ సత్యం తెలిసిన వాడికి సత్యోపదేశం చాలా మధురంగా ఉంటుంది. అది తెలిసినవాడే విద్వాంసులతో ‘తన్నో దేవో యచ్ఛత సుప్రవాచనం ఛర్దిరాదిత్యాః సుభరం నృపాయ్యమ్’ (ఋ.10-35-12)
‘‘నిర్మల హృదయులైన విద్వాంసులారా! పాపనాశకమూ మరియు మానవ హితకారిణి అయిన ఉత్తమ సత్యోపదేశాన్ని ప్రతి వ్యక్తి హృదయంలో చింతన చేయాలని వేదం ‘దేవానాం యన్మనుష్యా అమన్మహి’ ‘‘మనుష్యులమైన మేము విద్వాంసుల సత్యోపదేశాన్ని హృదయంలో మననం చేయుదుము గాక’’ అని సత్యాభిమాని అయినవాని ప్రతిజ్ఞా వాక్యరూపంగా ప్రబోధించింది.
సత్యాన్ని మనస్సులో చింతన చేయడం ద్వారా సత్యం నిశ్చయరూపంగా హృదయ గతమవుతుంది. వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్ర గ్రంథాలలో మననం లేదా చింతన చేసే విధానాలెన్నో వివరింపబడ్డాయి. సూర్యుడు తన సహస్ర కిరణాలను ప్రకాశింపచేస్తూ ఉదయించే రీతిగా విద్వాంసుడు అందరి ఎదుట జ్ఞానజ్యోతులను ప్రకాశింపచేస్తాడు.
అందుకే సూర్యసమానులైన విద్వాంసులను అందరు తమవద్దకు ఆహ్వానించి ప్రయోజనాన్ని పొందేందుకు ఇలా అభ్యర్థిస్తారు.
‘త ఆదిత్యా ఆగతా సర్వతాతయే వృధే నో యజ్ఞమవతా సజోషసః’ (ఋ.10-35-11) ‘‘ఓ ఆదిత్యులారా! సమస్తము ననుగ్రహించేందుకు రండు. మా ఎడల ప్రసన్నులై మా అభివృద్ధికి కారణమయ్యే యజ్ఞాన్ని రక్షించండి’’ ఆ విధంగా వచ్చిన విద్వాంసులే యజ్ఞ= విద్వాంసులతోడి సత్సంగమనే యజ్ఞరక్షణోపాయాన్ని ప్రబోధింపగలరు. ఆ కారణంగా ఆ జ్ఞానులందరు ఋతజ్ఞానాన్ని, ఋతాచరణను అభ్యసింపచేస్తూ ‘మహో దేవాయ తదృతం సపర్యత’ (ఋ.10-37-1).
‘‘మహత్తరమైన ఆ ఋతాన్ని మరియు సత్యాన్ని భగవదారాధనలో అనుసంధానింపచేయండి’’ అని మానవులు ప్రార్థిస్తారు. ఎందుకు? ఉపదేశ లేక ఋత జ్ఞానం సిద్ధించదు గదా? అది సిద్ధింపకుండ దానిని భగవదారాధనకు వినియోగించడమెట్లు? కాబట్టి మనమూ విద్వత్సత్సంగంలో సత్యోపదేశాన్ని పొంది తదాచరణకు పూనుకొందాం.
*** - ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512