స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యం నన్ను రక్షించుగాక!
సా మా సత్యోక్తిః పరి పాతు విశ్వతో ద్యావా చ యత్ర తతనన్నహాని చ
విశ్వమన్యన్ని విశతే యదేజతి విశ్వాహాపో విశ్వాహోదేతి సూర్యః॥ ॥
భావం:- సత్యాన్ని ఆశ్రయించే లోకంలో రాత్రింబవళ్లు విస్తారంగా ఏర్పడుతున్నాయి. ఈ విశ్వమంతా సత్యాశ్రయుడైన భగవానుని యందు విలనమవుతున్నది. సత్యం పునరుత్థానం పొందడంవలన జగత్తులో మరలా రాత్రింబవళ్లు, నడుస్తూ ఉన్నాయి. సూర్యుడు ప్రతిదినమూ ఉదయిస్తున్నాడు. అట్టి సర్వాధారమైన సత్యోక్తి నన్ను రక్షించుగాక!
వివరణ:- ఈ మంత్రంలో సత్యవాఙ్మహిమ వివరించబడుతూంది. రాత్రింబవళ్లు జలం, అగ్ని సమస్త జగజగత్తు జీవచైతన్య శక్తి సత్యం మీదనే ఆధారపడి యున్నదని వేదం వచిస్తూంది. సత్యమంటే త్రికాలాబాధ్యమైనదని అర్థం. అంటే భూత- భవిష్యత్- వర్తమాన కాలాలలో పరిణామం చెందక ఏకైక రూపంగా ఉండేదని భావం. భగవంతుని నియమాలన్ని సత్యస్వరూపమైనవే. అవి త్రిలాబాధ్యమైనవి. భగవానుని నియమాలలోని సత్యతయే వైజ్ఞానిక సత్యం. వైజ్ఞానిక సత్య పరిశోధనలో నిమగ్నమైన వైజ్ఞానికులు సృష్టి నియమాలలో ఏకాత్మగా ఉన్న సత్య ధర్మం మీద ఆధారపడియే ఎనె్నన్నో నూతన విజ్ఞానావిష్కరణలను బహిరంగపరచి సమాజాభివృద్ధికి తోడ్పడుతున్నారు.
సృష్టి నియమాలే ఏకైకమైన సత్యాధర్మాన్ని కలిగియుండకపోతే వైజ్ఞానిక రంగంలో నూతన పరిశోధనలే సంభవించవు. ఈ కారణం చేతనే వేదం విశ్వమంతా సర్వదా సత్యంమీదనే ఆధారపడి యుంది. ‘సత్యేనోత్త్భితాభూమిః’ (ఋ.10-8501( ‘‘్భమి సత్యానికి నిలయంగా చేయబడింది’’అని సూత్రీకరించింది. అంతేకాక ‘ఋతే నాదిత్యా స్తిష్ఠంతి’ (ఋ.10-85-1) ‘‘ఋతం (దైవ శాసనాలు, ధర్మాలు, నియమాలు)మీద ఆధారపడియే ఆదిత్యులు ప్రకాశిస్తున్నారు’’ అని ఋత విశిష్టతను ఉద్ఘాటించింది. కాబట్టి జీవనయాత్రకు ప్రతి వ్యక్తికి ఋతజ్ఞానమెంతో ముఖ్యం. ఈ దృష్ట్యా వేదంలో ‘కద్వఋతం కదనృతమ్’ (ఋ.1-105-5) ఋతమేది? అనృతమేది? అనే చర్చ కనబడుతుంది. విశ్వమే సత్యం మీద ఆధారపడి అన్న దృష్టితో వేదం సత్యామాశిషం కృణుత (ఋ.10-67-1) ‘‘ఇచ్ఛ కూడ సత్యవంతంగా చేయి’’ అని ఆదేశించింది.
ఈ మంత్రంలో మరో ముఖ్య విషయం. సత్యవాక్కు నన్ను రక్షించుగాక అన్నది. ఎందుకంటే సత్యం మీదనే ఆధారపడి నడుస్తున్న రాత్రింబవళ్లు, జలాది పంచభూతాలు, సమస్త జడ ప్రకృతి, సమస్త జీవ చైతన్య సంబంధమైన విజ్ఞానమంతా మానవుడికి సత్యరక్షణ సిద్ధించినప్పుడే లభ్యమవుతుంది. అంటే సమస్త సృష్టి విజ్ఞానమంతా సత్యసిద్ధి వలననే ప్రాప్తిస్తుందని భావం. సృష్టి యథార్థతత్త్వమదే. అట్టి జ్ఞానోదయంలోనే మానవుని రక్షణ ఇమిడియుంది. అందుకొరకై వేదోపదేశానుసారం మానవుడు సత్య-ఋత జ్ఞానాచరణ కర్మఠుడు కావాలి. **

దివ్యజన్మకై యజ్ఞకర్మ నాచరించు

ఏతే నరః స్వపసో అభూతన య ఇంద్రియ సునుథ సోమమద్రయః
వామంవామం నో దివ్యాయ ధామ్నే వసువసు వఃపార్థివాయ సున్వతే॥ ॥
భావం:- ఓ మానవుడా! సత్కర్మాచరణుడవగుటకు ఉద్యుక్తుడవగుచూ ఐశ్వర్యంకోసం సోమరసాన్ని యజ్ఞార్థం వినియోగించే నీవు దివ్యమైన జన్మకొరకై అందమైన ద్రవ్యాలను అర్పించు. ఎందుకంటే భౌతిక సుఖసంతోషాలకోసం యజ్ఞం చేసేవానికి గొప్ప ధనం లభిస్తుంది.
వివరణ:- కర్మ ప్రాశస్త్యాన్ని తెలుపుతూ ఋగ్వేదం-
‘ఏతే సోమాస... ఇందవః ప్రయస్వంతశ్చమూ సుతాః ఇంద్రం వర్ధంతి కర్మభిః॥ (ఋ.9-46-3)
‘‘యజ్ఞాలలో ఓషధీ శ్రేష్ఠమైన సోమరస త్యాగరూపమైన కర్మల ద్వారా ఐశ్వర్యమభివృద్ధి చెందుతుంది’’అని పేర్కొంది. అంటే యజ్ఞకర్మలను చేయడం ద్వారా ఐశ్వర్యమభివృద్ధియవుతుందని భావం. ఐశ్వర్యాభివృద్ధికోసం యజ్ఞకర్మలనాచరించేవాడు వేదం దృష్టిలో సుకర్ముడు. అతడి నుద్దేశించియే వేద మీ మంత్రంలో ‘ఏతే నరః స్వపసో అభూతన య ఇంద్రాయ సునుథ సోమమద్రయః’॥
- ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512