స్వాధ్యాయ సందోహం
స్వాధ్యాయ సందోహం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘‘సుకర్ములైన మీరు ఇంద్రుడినుద్దేశించి (దైవం) యజ్ఞమాచరిస్తారు’’ అని యజ్ఞకర్మానుష్ఠాన ఆవశ్యకతను హెచ్చరించింది.
కర్మలు ప్రధానంగా రెండు విధాలు. నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు అని. సంధ్యావందనం, పంచ మహాయజ్ఞాలు మొదలైనవి నిత్యకర్మలు. భగవంతునకు ప్రీతికరమైన పుణ్యదినాలు. పర్వదినాలు, పుణ్యమాసాలు, గ్రహణాది సమయాలు ప్రతినిత్యమూ సంభవించేవి కావు. కాని అవి ఆసన్నమయినపుడు విధిగా చేయవలసిన కర్మలు కొన్ని ఉంటాయి. అట్టి కర్మలను నైమిత్తిక కర్మలంటారు. ఈ నిత్య, నైమిత్తిక కర్మలను మానవుడు విధిగా ఆచరించాలి. ఆచరింపకుంటే పాపం సంక్రమిస్తుంది.
ఈ రెండింటికంటె భిన్నమైన కర్మ మరొకటి ఉంది. అదే కామ్యకర్మ. అంటే ఏదేని ఒక కోరికతో చేసే కర్మ. ఈ కర్మాచరణ ఎందరో చేస్తారు. కాని అందరూ చేయాలని నియమమేమీలేదు. విద్య, ధనం, ఐశ్వర్యం, సంతా నం, అధికారం, రాజ్యం, కీర్తి, ప్రతిష్ఠలు, ఉత్తమ లోకాలు ఇలా ఎన్నో కామ్యాలు- కోరికలు. వీనిని పొందేందుకు విశేషకర్మలు చేయవలసి యుం టుంది. వీనిని కామ్యకర్మలు అంటారు. మానవుడీ కామ్యకర్మల నాచరించేందుకు వేదమనుమతిస్తూ ‘సోమం హినోత మహతే ధనాయ’ (ఋ.9-97-4) ‘‘మహైశ్వర్యంకొరకు సోమాన్ని ప్రేరేపించు’’మని నిర్దేశించింది. సోమమంటే వనస్పతులలో శ్రేష్ఠమైన లత. దానిని సర్వశ్రేష్ఠమైన యజ్ఞంలో త్యాగంచేయడమే సోమకర్మ. అట్టి యజ్ఞం సర్వైశ్వర్య ప్రదాయకమవుతుంది.
కాని వేదం కామ్యకర్మలలో పైన పేర్కొన్న విద్యా, ధన, ఐశ్వర్యాదులకంటె ‘దివ్యాయధామ్మే’ ‘‘దివ్యమైన జన్మ’’కొఱకు చేసే కర్మనే ఉత్తమమైన కర్మగా- కామ్యకర్మగా ఈ మంత్రంలో నిర్దేశించి మానవుడు దానికొరకు మాత్రమే ‘వామంవామమ్’ బహు సుందర సుందర పదార్థాలను అంటే సోమరసాన్ని త్యాగంచేసి కామ్యత్వసిద్ధికై కర్మల నాచరించమని ఆదేశించింది. ఆ విధంగా చేసినవాడికి పారమార్థికంగా ఉత్తమ జన్మలబ్ధియేగాక బహికంగా ‘వసువసు’కొదవలేని ధన మే ధనం చేకూరుతుందని అభయమిచ్చింది. అంటే ఉత్తమ జన్మకొఱకుగాని, ఐహిక ఐశ్వర్యానికిగాని త్యాగపూర్వకమై యజ్ఞకర్మాచరణ చేయమని వేదం మానవ సమాజానికి సందేశమిస్తూంది.
***
సూర్యుడు మరో మహాప్రకాశంచేత వెలుగుతున్నాడు
న తే అదేవః ప్రదివో ని వాసతే యదేతశేభిః పతరై రథర్యసి
ప్రాచీన మన్యదను వర్తతే రజ ఉదనే్యన జ్యోతిషా యాసి సూర్య॥ ॥
భావం:- ఓ సూర్యుడా! గతిశీలుడవై కిరణాలను విరజిమ్ముతూ ప్రకాశమానుడవై రథారోహుడవైనంతనే నీముందు ప్రకాశింపని వస్తువే ఉండదు. లోకం తనకంటె భిన్నమైన పురాతనమైన తేజస్సును అనుసరిస్తుంది. మరి నీవో! మరియొక ప్రకాశంచేత ప్రకాశమానుడవై ఉదయిస్తున్నావు.
వివరణ:- సూర్యుడుదయించినంతనే ఆయన ముందు ప్రకాశింపని వస్తువే ఉండదు. సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తున్నట్లు బాహ్యంగా కనబడుతూ ఉండటంచేత ఆయన ఒక రథాన్ని ఎక్కి సంచారం చేస్తున్నట్లుగా అందరిచేత ఊహింప బడుతున్నాడు. మరి సూర్యుడి కా గమనం, ప్రకాశమానత సహజసిద్ధమా అంటే వేదమంత్రం ‘ప్రాచీనమన్యదను...సూర్య’ ‘‘లోకం తనకంటె భిన్నమైన ఒకానొక ప్రాచీన సంప్రదాయ పద్ధతిని (తేజస్సును) అనుసరిస్తుంది. మరి సూర్యుడో! మరియొక ప్రకాశమయ జ్యోతిస్సుచేత ప్రకాశింపబడుతూ ఉదయిస్తున్నాడు’’ అని వివరిస్తూ ఉంది. వాచ్యంగా ఈ మంత్రం ఇక్కడ సూర్యుణ్ణి పేర్కొన్నా అన్యాపదేశంగా ఆత్మతత్త్వాన్ని వివరిస్తూంది.
ఇక్కడ సూర్యుడు ఆత్మకు సం కేతం. సూర్యుడు రథాన్ని అధిరోహించినట్లే ఆత్మనాశన శీలమైన ఇంద్రియాలతో కూడిన రథాన్ని అధిరోహిస్తుంది. ఇక్కడ రథమంటే ఇంద్రియాలుకల్గిన శరీరమని అర్థం. శరీరంలోనికి ఆత్మప్రవేశించినంతనే కన్ను, ముక్కు, చెవి, జిహ్వ, చర్మం మొదలయిన ఇంద్రియాలు చైతన్యవంతమై దివ్యమయమవుతాయి. అంటే ఆత్మప్రవేశంతో దేహంలో చైతన్యం ప్రవేశిస్తూందన్నది అర్థం. అందుకే సూర్యుడిని ఆలంబనంగా వేదం ‘ఉదనే్యన జ్యోతిషా యాసి సూర్య’ ఓ సూర్యుడా! నీవు అన్యమైన ప్రకాశమయ జ్యోతిస్సుచేత ప్రకాశమానుడవై ఉదయిస్తున్నావు’’అని ఆత్మతత్త్వాన్ని వర్ణించింది.
- ఇంకావుంది...