స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
*
దీని వనె్న తరుగకుండ నిర్వహించడమెలా? అన్న ప్రశ్నకు వేదం ‘సూనృతాభిః’ ‘‘మధురమైన సత్యవచనాలతో’’ ‘వర్ధయ’ ‘‘వృద్ధిపరచు’’మని చక్కని ఉపాయాన్ని తెలిపింది. సత్యమూ, ప్రియమూ అయిన వచనమెవరి హృదయాన్ని కార్యోన్ముఖం చేయదు మరి ఆలస్యమెందుకు? వేదోపాయాన్ని అనుసరించండి. యువతరాన్ని సత్యధర్మానుష్ఠానపరులుగా తీర్చిదిద్దండి.
**
మనస్సునకు తగిన మధురవాక్కు
ఆ త్వా జువో రారహాణా అభి ప్రయో
వాయో వహంత్విహ
పూర్వపీతయే సోమస్య పూర్వపీతయే
ఊర్ధ్వాతే అను సూనృతా మనస్తిష్ఠతు జానతీ నియుత్వతా
రథేన యాహి దావనే వాయో మఖస్య దావనే
ఋ 1-134-1॥
భావం:- వాయు సమానమైన ఓ బలశాలీ! కామక్రోధాదుల వేగాన్ని అణచివేసి పూర్వజన్మ కర్మఫలాల ననుభవించేందుకు, శాంతిని అనుభవించేందుకు నీకిక్కడే తగిన పదార్థాలు లభించుగాక! జ్ఞాన సహితమూ, ఉన్నతమూ అయిన మధురవాక్కు నీ మనసున కనుకూలంగా ఉండుగాక!
వివరణ:- లోకానికి సుఖసంతోషాలు కలిగించే మహాత్ములు త్యాగపురుషులే అయి యుంటారు. కామక్రోధాది దుర్గుణాల ప్రకోపాన్ని నిలువరించే జితేంద్రియులైన త్యాగమయ పురుషులే మానవులను వారి అభీష్టాలను పొందేవారుగా చేస్తారు. వారి కోరిక అంతా ఆర్తులు, పీడితులు, దుఃఖ సంతప్తులు అయిన జనులు ‘సోమ’= శాంతిని అనుభవించాలన్నది మాత్రమే.
మానవులకు సోమ= శాంతి లభించడమనేది వారి వారి పూర్వన్మకర్మ- ఫలానుగుణంగా మాత్రమే. కాని ఆ సోమరస = శాంతరసానుభవ సాధన సందర్భంలో జరిగే తొట్రుపాటులో ఎప్పుడైనా మాట వశం తప్పి రావచ్చు. అది అనుచితమని వేదం ‘ఊర్ధ్వాతే అను సూనృతా మనస్తిష్ఠతు జానతీ’ ‘‘జ్ఞానసహితమైన నీ సమున్నత మధురవాక్కు నీ మనసులో భావానికి అనుకూలమై అనగా పొరపాటున ప్రతికూలంగా రాకుండా ఉండుగాక!’’ అని హెచ్చరించింది. ఎందుకంటే ‘మనస్యన్యద్ వచస్యన్యత్కర్మణ్యన్యద్ దురాత్మనామ్’ ‘‘మనసున ఒకటి,

ఇంకా ఉంది