స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం- 69

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
ఎవడు కనె్నఱ్ఱచేస్తే ప్రపంచమే నాశనమవుతుందో ఆయన కనె్నఱ్ఱపడితే మనిషికి ఎంత అనిష్టం సంభవిస్తుందో చెప్పడం సాధ్యమా? అందుకే ఈ మంత్రం అగ్నిదేవుణ్ణి అనగా భగవానుడిని ‘తవ స్వాదిష్ఠాగ్నే సందృష్టిః’ ఓ అగ్నిదేవా! నీ చూపు చాలా చల్లనిది అని శ్లాఘించింది.
దీనినిబట్టి భగవంతుని దృష్టి జీవుల ఎడల ఎప్పుడూ చల్లనిదే అని స్పష్టమవుతూ ఉంది. మరి ప్రపంచంలోని జీవులందరూ వ్యాకులచిత్తులై ఎందుకుంటున్నారు? అంటే భగవంతుడి కరుణాదృష్టికి అభిముఖులుగా గాక పరాఙ్మఖులై యుండి ప్రవర్తిస్తూ ఉండటమే ప్రధాన కారణం. ఆ విధంగా విముఖులై, కళ్లుమూసుకొని ప్రవర్తిస్తే దైవకృపాదృష్టి జీవుల ఎడల ప్రసరింపక వారు దైవదారులై వ్యాకులపడుతున్నారు. అలాకాక భగవత్ కృపావీక్షణాలకు పాత్రులైనవారు ఋగ్వేదం పేర్కొన్న రీతిగా-
‘నామాని చిద్ద్ధిరే యజ్ఞియాని భద్రాయాం తే రణయంత సందృష్టౌ’॥
ఋ.6-1-4॥
‘‘దేవా! నీ కృపాకటాక్షాలకు పాత్రులైన సజ్జనులు నీ నామ సంకీర్తనం చేస్తూ ఆనందానుభవంలో తాండవం చేస్తున్నారు’. అట్టి పుణ్యపురుషులు భగవన్నామాన్ని గాక మరొకటి ధ్యానిస్తారా?

పాపానికి మూలం అజ్ఞానమే
యచ్చిద్ధి తే పురుషత్రా యవిష్ఠాచిత్త్భిశ్చక్రుమా కచ్చిదాగః
కృధీష్వస్మా అదితేరనాగాన్ వ్యేనాంసి శిశ్రథో విష్వగగ్నే
భావం:ఓ మహాబలశాలివగు అగ్నిదేవా! అజ్ఞానులమైన మేము ఎప్పుడైనా నీచే సృష్టింపబడిన జీవుల ఎడల మరియు నీ యెడల అపరాధం చేసియుంటే క్షమించి మమ్ము జగన్నాత యెడల పుణ్యకర్ములుగా చేయి. మాలోని పాపచింతనలను నిశే్శషంగా తొలగించివేయి.
వివరణ:అజ్ఞానం చేత మానవుడు పాపపు గోతిలో పడుతున్నాడు. జ్ఞానహీనత భయంకర ఫలితాలనిస్తుంది. దీనిని విపర్యయ జ్ఞానం, విపరీతజ్ఞానం, మిథ్యాజ్ఞానం, అవిద్య- ఇలా అనేక నామాలతో వేదాంతులు వ్యవహరిస్తారు. అవిద్యా లక్షణాన్ని యోగదర్శనమిలా వర్ణించింది.

శాశ్వతం కానిదానిని శాశ్వతంగా, అపవిత్రమైనదానిని పవిత్రంగా, దుఃఖాన్ని సుఖంగా; ఆత్మ కానిదానిని ఆత్మగా భావించుటయే అవిద్య. ధనధాన్యాలు, ఉన్నత భవనాలు, పర్వతాలు, నదులు, సూర్యచంద్రాదులు, పృథివ్యాదులు నశించిపోయేవే. ఇట్టివానిని శాశ్వతమైనవిగా విశ్వసించడం మూర్ఖత కాక మరేమిటి? ఇదేవిధంగా నిత్యుడైన జీవాత్మను అనిత్యంగా భావించడమూ అవిద్యయే. అట్లే అపవిత్రమైన నఖ - కేశాదులను ఘనంగా భావించడం కూడా అవిద్యయే. మల మూత్ర రక్తశే్లష్మాదులతో నిండియుండే శరీరం కూడా అపవిత్రమే. దీనిని కూడా శాశ్వతమని భావించడమన్నింటికన్నా పెద్ద అవిద్య. అట్టి శరీర సౌందర్యానికి ఆకర్షితులై స్ర్తి పురుషుల మధ్య జనించే మోహమెంతటి అవిద్య? శరీర బాహ్యాభ్యంతరాలను ఒక్కొక్కసారి పరిశీలిస్తే అందలి అపవిత్రత ఎంతటితో అర్థమవుతుంది. అయినా లోకంలో అత్యధిక జనం ఆ శరీరానే్న పవిత్రంగా విశ్వసిస్తూ జ్ఞానం కాని జ్ఞానాన్ని అంటే విపర్య జ్ఞానంలో పడిపోతున్నారు. ఇట్లే లోకంలో ఎంత దుఃఖముంది. నిత్యమూ జీవుడికి సంభవించే జన్మ మరణ చక్రమెంతటి బాధాకరమైంది? అయినా ఎందరికీ జ్ఞానముంది?
*
ఇంకావుంది...