స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం- 73

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
ఆయన ఒక్కడే జీవన సంగ్రామంలో మనిషికి ఆప్త సహాయకుడు. ఆయనెవరిని యోగ్యుడైన స్తోతగా భావిస్తాడో ఆతడిని జ్ఞాన-బల- అన్న సంపన్నుడిగా చేస్తాడు. కాబట్టి ఆయన ప్రేమకు అందరు పాత్రులు కావాలి. అంటే అలా పాత్రులు కావడానికి తగిన సచ్చీలం మనలో ఉండాలి. సత్కర్మలనే మన మాచరించాలని. వానిని చూచియే ఆ దైవం పాత్రునిగా భావించి సర్వమూ అనుగ్రహిస్తాడు. దరిద్రుణ్ణి కూడ ధనవంతుడిని చేస్తాడు. అపాత్రుడు ధనవంతుడైనా దరిద్రుణ్ణి చేస్తాడు.
అయం వృతశ్చాతయతే సమీచీర్య ఆజిషుమఘవా శృణ్వ ఏకః
అయం వాజం భరతి యటం సనోత్యస్య ప్రియసః సఖ్యే స్యామ॥ (ఋ.4-17-9)
అలా భగవత్కృపకు పాత్రులు కాగల రీతిగా సచ్ఛీలాన్ని అలవరచుకోవాలి. సత్కర్మల నాచరించాలి. దాని ద్వారా చేసిన భగవన్నుతి మహాఫలాన్ని ఇస్తుంది. అది ఎంత సుందరమో మహోన్నతమో చూడుడు. దానిని ఋగ్వేద మీవిధంగా శ్లాఘించింది.
స్తుత ఇంద్రో మఘవాయద్ధ వృత్రా భూరీణ్యేకో అప్రతీని హంతి
అస్యప్రియో జరితా యస్య శర్మన్న కిర్దేవా వారయంతే న మర్తాః॥ ఋ.4-17-19॥
భావం:- సంస్తూయమానుడయిన పరమేశ్వరుడు మాత్రమే భయంకర బాధలనుండి మానవులను విముక్తులను చేస్తాడు. ఎందుకంటె ఆ స్తోత ఆయనకు అత్యంత ప్రియుడుకదా. అతడికి సంభవించే శుభాలను దేవతాశక్తులు సహితమూ ఆపజాలవు. మనుషులెంతటివారయినా నిరోధింపలేరు.
కాబట్టి ఇక సందేహమెందుకు? ఆ సర్వబలసంపన్నుడైన దైవాన్ని స్తుతిద్దాం రండి.
***
భగవంతుడే నిజమైన తండ్రి
త్రాతా నో బోధి దదృశాన ఆపిరభిఖ్యాతా మర్డితా సోమ్యానామ్‌
సఖా పితా పితృతమః పితృణాం కర్తేము లోకముశతే వయోధాః॥ ఋ.4-17-17.
ప్రతిపదార్థం:- దదృశానః= మరల మరల దర్శనమిస్తూ; సః= ఆ భగవానుడు (అధ్యాహార్యం); త్రాతా= సంరక్షకుడై; నః= మాకు; బోధి= జ్ఞాన బోధకుడవుతాడు; స ఏవ= ఆయనయే (అధ్యాహార్యం); ఆపిః= బంధువు; అభిఖ్యాతా=ఎదురుగా నిలిచి మంచిని బోధించేవాడు; స ఏవ= ఆయనయే (అధ్యాహార్యం); సోమ్యానామ్= శాంత స్వభావులకు; మర్దితా= సుఖసంతోషాలనిచ్చి తృప్తులుగా చేయువాడు; స ఏవ= ఆయనయే (అధ్యాహార్యం); పితా=తండ్రి; పితృణామ్= సంరక్షకులలో; పితృతమః = గొప్ప సంరక్షకుడు; స ఏవ= ఆయనయే (అధ్యాహార్యం); వయోధాః= జీవనదాత మరియు జ్ఞానదాత; ఉశతే= కోరుకొన్నవారికి; లోకమ్= జ్ఞానాన్ని; కర్తా+ఇమ్+ఉ= అనుగ్రహించేవాడు; వయోధాః= సర్వజీవులకు జీవన సౌభాగ్యాన్ని అనుగ్రహించిన; ఉ=ఆ భగవానుడే; ఉశతే=్భగాలను -మోక్షాన్ని కోరుకొన్నవారికి; లోకమ్= ఈ ప్రపంచాన్ని; కర్తా+ఇమ్= సృష్టించాడు.
భావం:- జీవన యానంలో ఆ భగవంతుడు మరలమరల దర్శనమిచ్చి జ్ఞానోపదేశం చేస్తున్నాడు. ఆయనొక్కడే జీవులకు ఆప్తబంధువు. ఎదురుగా నిలిచి జ్ఞానోపదేశం చేసే గురువు. శాంత స్వభావులకు సుఖ సంతోషాలనిచ్చేవాడు. ఆయనయే జీవులకు తండ్రి. సంరక్షకులలో అగ్రేసరుడు. అసలు జీవులకు జీవనదాత మరియు జ్ఞానదాత కూడ ఆయనయే. కోరుకొన్నవారికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అనుగ్రహించేవాడు కూడ ఆయనయే. ఐహిక భోగాలను కోరుకొన్నవారికి మరియు విరాగులై మోక్షం కోరుకొన్నవారికి కూడ ఈ ప్రపంచాన్ని సృష్టించి యిచ్చాడు.
వివరణ:- మంత్రంలోని రెండవ చరణంలో చివరి భాగమైన ‘కర్తేము లోకముశతే వయోధాః’అన్న వాక్యం చాల గంభీరమైనది. దాని భావాన్ని గ్రహిస్తే తక్కిన మంత్రార్థం సులభంగా అర్థవౌతుంది.
జీవుడు జీవితాన్ని, భోగభాగ్యాలను, మోక్షాన్ని, జ్ఞానాన్ని సదా వాంఛిస్తాడు.
ఇంకావుంది...