స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం- 79

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోక్షమే సర్వోత్తమ గమ్యం
దేవేభ్యో హి ప్రథమం యజ్ఞియేభ్యో- మృతత్త్వం సువసి భాగముత్తమమ్‌
ఆదిద్దామానం సవితార్వ్యూర్ణుషే - నూచీనా జీవితా మానుషేభ్యః॥
ఋ.4-54-2॥
ప్రతిపదార్థం:- సవితః= ఓ సర్వసృష్టికర్తా! సకల కల్యాణ సాధకా!; సి = నిజంగా; త్వమేవ = నీవే; యజ్ఞియేభ్యః= యజ్ఞకర్మాచరణ ద్వారా పూజనీయులు; దేవేభ్యః= నిష్కామకర్మఠులైన మహాత్ముల కొఱకు; ప్రథమమ్= ముందుగా; ఉత్తమమ్= సర్వశ్రేష్ఠమైన; భాగమ్= సర్వసేవనీయమైన; అమృతత్వమ్= మోక్షాన్ని; సువసి= ఇచ్చుచున్నావు; త్వమేవ నీవే (అధ్యాహార్యం); అత్+ఇత్= అన్ని వైపుల నుండి; దామానమ్= జన్మబంధనాలను; వ్యూణుషే= తొలగిస్తున్నావు; మానుషేభ్యః= తోడి మానవులకు హితాన్ని కోరే ఉత్తమ మానవులకు; అనూచీనా= సానుకూలమైన ప్రవర్తనతోడి; జీవితా= సార్థక జీవితాన్ని; దదాతి= ఇచ్చుచున్నావు (అధ్యాహార్యం).
భావం:- ఓ కల్యాణ సాధకా! ఓ పరమేష్ఠీ! యజ్ఞానుష్ఠాన తత్పరులై నిష్కామకర్మశీలురైన మహాత్ములకు నీవు ముందుగా సర్వసేవనీయమూ, అగ్రగణ్యమూ అయిన మోక్షపదవిని అనుగ్రహిస్తున్నావు. వారిని నీవే అన్ని విధాలయిన జన్మబంధనాల నుండి విముక్తులను చేస్తున్నావు. తోడి మానవులకు హితాన్ని కోరే ఉత్తమ మానవులకు సానుకూల ప్రవర్తన తోడి సార్థక జీవితాన్ని నీవే కరుణిస్తున్నావు.
వివరణ:- భగవంతుడు మనకెన్నో ఉదారంగా అనుగ్రహిస్తున్నాడు. అవి ఒకదానిని మించి మరొకటి ఘనమైనవి.
వి యో రత్నా భజతి మానవేభ్యః= శ్రేష్ఠం నో అత్ర ద్రవిణం యథా దధత్‌॥ ఋ.4-54-1॥
‘‘రత్నాన్ని ప్రసాదించే విధాత ఈ జీవితోపయోగి అయిన ఉత్తమ ధనానే్న అనుగ్రహించు’’నని ఋగ్వేదమే వాగ్దానం చేస్తూంది. రేపు లభించే ధనంతో నేడుపయోగముండదు కదా! అలా పరమాత్ముడిచ్చే వానిలో ఉత్తమమైన రత్నం మోక్షరత్నమే.
దేవేభ్యోహి....... భాగముత్తమమ్ ‘‘యజ్ఞ కర్మానుష్ఠాన తత్పరులైన మహాత్ములకు ముందుగా భగవంతుడు అనుగ్రహించేది మోక్షధనమే’’నని వేదం నొక్కి వక్కాణిస్తూంది. జీవితంలో ప్రప్రథమమైనది మోక్షమే. నిజానికి ఈ జన్మచక్రబంధంలో చిక్కుకుపోకముందే జీవుడు ముక్తుడు. ఆ ముక్తస్థితిని పొందకనే జీవితావధి ముగుస్తుంది. తిరిగి దానిని పొందేందుకే మరల జీవుడు ఈ కర్మభూమిలో పునర్జన్మ పొందుతున్నాడు. అందుచేత జీవుడికి ముఖ్యమైనది మోక్షప్రాప్తియే. జీవితమో అనుషంగికం (అప్రధానం). మంత్రమీ ఉపదేశం చేసేందుకే ప్రథమం మరియు అమృతత్వం అన్న రెండు పదాలతో ఆరంభంలోనే సూచించింది.
జన్మమరణరూపమైన సంసార చక్రంలోనికి మరల మరల రాకుండుటయే ముక్తి అని భావించే నవీన వేదాంతులు కూడ అవిద్య అనే చక్రభ్రమణంలో పడిపోకముందు బ్రహ్మదేవుడు కూడ ముక్తుడేనని అంగీకరిస్తారు. ముక్తి మొట్టమొదటగా సముపార్జింపదగినది మాత్రమే కాదు అదే ఉత్తమోపార్జనీయమైనది. ముక్తివలన భయనాశనం కలుగుతుంది. గో-అశ్వాది పశుసంపద- వెండి బంగారం మొ॥ ధనం- వలన జీవితంలో ధయమే అత్యధికంగా పెరుగుతుంది. కాని మోక్ష సుఖంవలన జీవుడికి నిర్భయత్వం సిద్ధిస్తుంది. ఈ విషయమే తైత్తిరీయోపనిషత్తు బ్రహ్మానందవల్లిలో ఇలా వర్ణింపబడింది.
యతో వాచో నివర్తంతే అప్రాప్యమనసా సహ
ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి తుతశ్చన॥ తై.ఉ.బ్ర.వ.9 అను.॥
సాధారణమైన వాక్కులతో గాని, సంకల్ప వికల్పాత్మకమగు మలిన మనస్సుతోగాని ఎవడును బ్రహ్మను తెలుసుకొనజాలడు. శుద్ధాంతఃకరణుడై బ్రహ్మము యొక్క ఆనంద స్వరూపాన్ని తెలుసుకున్నవాడు ముక్తుడవుతాడు. అట్టి ముక్తజీవుడెవనికినీ భయపడడు. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు