స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-96

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
దైవం కూటస్థుడు. ఆయనలో జీవులలోవలె ధర్మం- స్వభావం- అవస్థల మార్పు సంభవించదు. సర్వకాల సర్వావస్థలయందు ఆయన ఏకైక స్వరూపుడే. ‘కుతశ్చనో నః’ (అథర్వణ వేదం- 10-8-44) అథర్వణవేద వచనానుసారం వేనిచేత కూడ లోటులేనివాడే దైవం. ఏ కోరికలూ లేనివాడు కావడంచేత ఆయనకు హర్షశోకాలే సంభవించవు. కాబట్టి జగదీశ్వరుడు ‘స హి సత్యః’ సదా సత్యస్వరూపుడు. సత్యాభిమాని- సత్యవాది మరియు సత్యశీలుడు కూడ ఆయనయే. అందుకే భగవానుని ఈ సత్యస్వరూపతను ప్రస్తుత మంత్రం ‘యం పూర్వేచిద్ దేవాసశ్చిద్యమీధిరే’ ప్రాచీనులైన నిష్కామ కర్మయోగులైన విద్వాంసులు ప్రకాశింపచేస్తున్నారని ప్రశంసించింది.
అంతటా- అన్నింట- ఎల్లవేళలా వ్యాపించియుండే పరమాత్మ సామాన్య మానవుడి కంటికి కానరావడం లేదు. కాని అతడు సాధారణంగా తన చర్మచక్షువులతోనే దర్శించాలని కోరుకొంటున్నాడు. అయితే కంటికి కానరాకపోవడంవలన అసలు దైవం ఉన్నాడనే విషయాన్ని నమ్మేందుకిష్టపడటం లేదు కూడ. అందుకే నిస్సహాయుడుగా- దీనుడుగా తిరుగుతున్నాడు. అట్టివానిని జూచి దయాళువైన బ్రహ్మనిష్ఠుడు ప్రియంగా అరె! ఏ లక్ష్యం లేకుండ లోకంలో ఎందుకు జీవిస్తున్నావు? కన్నులకు కనబడనిది. ఇంద్రియాలచేత తెలిసికో దగినదికాదు. ఆ దైవాన్ని ఇంద్రియాలతో గ్రహించాలని పట్టుదల వహిస్తావెందుకు? ఓ సోదరా! ఆ దైవం-
అశబ్ద మస్పర్శ మరూప మవ్యయం తథా- రసం నిత్య మగంధవచ్చయత్‌॥
శబ్దరహితం కాబట్టి చెవికి తెలియబడేదికాదు. అది స్పర్శగుణవంతం కాదు. గాన చర్మంద్వారా స్పర్శించి తెలిసికోలేము. అది రూపం లేనిది. మరి కళ్ళతో ఎలా గ్రహించగలం? అది గంధవంతమే కాదు. కావున నాసికతో దానిని సువాసన చూడలేము. ఆ దైవం సదా ఏకైక రస స్వరూపం.
చూడండి. కళ్లతో అన్నింటిని చూడగలం. కాని కళ్లను దేనితో చూడగలం? కాబట్టి కళ్లులేవని వ్యర్థప్రలాపమెవడూ చేయడు కదా. మరి జ్ఞానులో!!
నిత్య విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం తద్ఫూతయోనిం
పరిపశ్యంతి ధీరాః॥ ముండకోపనిషత్తు. 1-1-6॥
సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, అత్యంత సూక్ష్మస్వరూపుడు, అవికారి, సమస్త పదార్థాలలో అధిష్ఠించియున్న ఆ పరమేశ్వరుని ధీరులు సదా దర్శించగలరు. ఇక్కడ ధీరులనేవారు బుద్ధిమంతులుగాని విద్వాంసులు గాని, జ్ఞానులుగాని, దివ్యులు గాని ఎవరేని గాని వారుమాత్రమే ఆ పరమాత్మను తెలిసికొనగలరు. మరియు ఆయన అస్తిత్వాన్ని ప్రకాశింపజేయగలరు.
***
త్రికాలవేది
అతో విశ్వాన్యద్భుతా చికిత్వా అభి పశ్యతి
కృతాని యాచ కర్త్వా॥
భావం:- సమస్త జీవులచేత ఆదరణీయుడైన దైవం అంతకుముందు లేని అద్భుత పదార్థాలను, వెనుక ఎప్పుడో చేయబడియున్న పదార్థాలను మరియు ముందుచేయబోయే పదార్థాలను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నది.
వివరణ:- ఇప్పుడు, వెనుక- ముందు ఉన్న- ఉండబోయే సమస్త పదార్థాలను దైవం ప్రత్యక్షంగాచూస్తూ ఉంది అని ప్రస్తుత మంత్రం ‘విశ్వాన్యద్భుతా చికిత్వాన్’ సృష్టిలోని అద్భుత- విలక్షణ సమస్త పదార్థాలు భగవానుడికి తెలిసియున్నాయి అని వివరిస్తూంది. అంటె దైవం సర్వజ్ఞుడని వేదర్షి అభిప్రాయం. సర్వశబ్దంచేత భూత- భవిష్యత్- వర్తమాన త్రికాలాలు పరిగణనలోనికి వస్తాయి. ఈశ్వరుని దృష్టిలో జీవులమైన మన దృష్టిలో ఉన్న భూత-్భవిష్యత్-వర్తమానాలనే మూడు కాలాల విభాగమే ఉండదు. ఈశ్వరుని దృష్టి ఈ మూడు కాలాలకు అతీతమైనది.

ఇంకావుంది...