శ్రీకాకుళం

సభ్యసమాజానికే తలవంపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 18: రాష్టవ్య్రాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్న కాల్‌మనీ, సెక్స్ రాకెట్ వ్యవహారం సభ్య సమాజానికి తలవంపులు తెచ్చే విధంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి విమర్శించారు. శుక్రవారం ఈ మేరకు ఆమె విడుదల చేసిన ఓ ప్రకటనలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన నాటినుండి మోసపూరిత మాటలతో మహిళలను మభ్యపెడుతూ నేడు కించపరిచే స్థాయికి ఎదిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో
మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, అయితే చంద్రబాబు నాయుడుకు మహిళలే తగిన గుణపాఠం చెబుతారని, ఆరోజు ఎంతో దగ్గర్లోనే ఉందని అన్నారు. కాల్‌మనీ డబ్బులు తిరిగి చెల్లించవద్దని చెప్పడాన్ని విమర్శిస్తూ డబ్బులు తిరిగి చెల్లించనంత మాత్రాన మహిళ ఆత్మగౌరవం కుదుటపడుతుందా అని ప్రశ్నించారు. బాబు మాటతీరులోనే మహిళలకు భద్రత కల్పించే తీరు అర్థమవుతోందని ఆరోపించారు.

క్రీడల్లో జయాపజయాలు సర్వసాధారణం
ఎచ్చెర్ల, డిసెంబర్ 18: క్రీడాపోటీల్లో పాల్గొనే జట్లకు విజయాపజయాలు సర్వసాధారణమని ఈ స్ఫూర్తితోనే విజయాలు సొంతం చేసుకోవాలని విశాఖ రేంజ్ డిఐజి ఏ.రవిచంద్ర పిలుపునిచ్చారు. స్థానిక ఏఆర్ గ్రౌండ్స్‌లో జిల్లా స్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్‌ను గురువారం లాంఛనంగా డిఐజి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. క్రీడాపోటీల్లో పాల్గొనే వారు గెలిచేవారంతా గొప్పవారుకాదని, ఓటమి చవిచూసేవారు కుంగిపోవాల్సిన పనిలేదన్నారు. ఈ క్రీడాస్ఫూర్తిని భవిష్యత్‌లో జరిగే పోటీల్లో ప్రదర్శించి మరిన్ని విజయాలు వారి వారి ఖాతాలో జమచేసుకోవాలన్నారు. క్రీడలు పోలీస్ శాఖలో ఒక భాగమన్నారు. పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో క్రీడాకారులకు 2శాతం రిజర్వేషన్ కేటాయిస్తున్నామన్నారు. జిల్లాస్థాయి క్రీడల్లో రాణించిన వారు రాష్టస్థ్రాయి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. గత ఏడాది అనివార్య కారణాల వల్ల ఈ పోటీలను నిర్వహించలేకపోయామన్నారు. ఈ స్పోర్ట్స్ మీట్‌లో చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించి విజేతలుగా నిలవాలని ఆకాక్షించారు. ఈయనతోపాటు ఎస్పీ ఎఎస్ ఖాన్, ఎఎస్పీ తిరుమలరావు, డిఎస్పీలు భార్గవరావునాయుడు, వేణుగోపాలనాయుడు, రాంవర్మ, ఆర్.ఐ కోటిబాబు, హోంగార్డ్ ఆర్‌ఐ కె.రవికుమార్‌లు ఉన్నారు. తొలుత క్రీడాపతాకాన్ని ఆవిష్కంచి క్రీడాజ్యోతిని వెలుగించి అనంతరం పావురాలను ఎగురవేసి క్రీడాపోటీలను డిఐజి ప్రారంభించారు. క్రీడాకారుల వద్దకు వెళ్లి పరిచయ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సమీపంలో ఉన్న ఎఆర్ కార్యాయలంలో వార్షిక తనిఖీని నిర్వహించారు. ఆయుధాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ను సిబ్బంది విధుల రికార్డులను పరిశీలించారు. మూడు రోజుల పాటు ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగే ఈ పోటీల్లో ఆరు బృందాలు 20 ఈవెంట్స్‌ను నిర్వహిస్తున్నారు. 152 మంది పురుషులు, స్ర్తిలు పాల్గొంటున్నారు. విద్యార్థులు ఆలపించిన దేశభక్తిగీతాలు ఆలరించాయి. ఈ పోటీల్లో ఎఆర్ జట్టు శ్రీకాకుళం, పాలకొండ, కాశీబుగ్గ, డివిజన్‌లు హోంగార్డ్స్, ఎస్‌టిఎఫ్ జట్ల మధ్య హోరాహోరీగా తలపడుతున్నాయి.