అంతర్జాతీయం

బేషరతు చర్చలకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్‌కు సంకేతాలు పంపిన పాక్ ప్రధాని
వలెట్టా, నవంబర్ 28; ఉపఖండంలో సుస్థిర శాంతి కోసం భారత్‌లో బేషరతుగా చర్చలు జరపడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉందని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చెప్పారు. మాల్టాలోని వలెట్టాలో కామనె్వల్త్ దేశాధినేతల సమావేశం (చోగమ్) సందర్భంగా శుక్రవారం బ్రిటీష్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌తో సమావేశం సందర్భంగా షరీఫ్ ఈ విషయం చెప్పినట్లు పాకిస్తాన్ టీవీ న్యూస్ చానల్ ‘జియో న్యూస్’ పేర్కొంది. భారత్, అఫ్గానిస్థాన్ సహా తన పొరుగుదేశాలన్నిటితో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలన్నదే పాక్ ఉద్దేశమని షరీఫ్ చెప్పినట్లు ఆ చానల్ తెలిపింది. సరిహద్దుల్లో పాక్ సైన్యాలు తరచూ కాల్పుల విరమణ ఓప్పందాన్ని ఉల్లంఘించడంపై ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. గత ఆగస్టులో న్యూఢిల్లీలో జరగాల్సిన ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల భేటీ సైతం అజెండాపై వివాదం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. దేశంలో ఉగ్రవాద దాడులపై చర్చ జరగాలని భారత్ కోరగా, కాశ్మీర్‌పై చర్చించాలని పాక్ పట్టుబట్టడమే ఈ చర్చలు రద్దు కావడానికి ప్రధాన కారణం. పారిస్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల పట్ల పాక్ తీవ్రంగా బాధపడుతోందని, ఉగ్రవాదానికి బలవుతున్న దేశంగా ఫ్రాన్స్ ప్రజల బాధలను తాము అర్థం చేసుకోగలమని షరీఫ్ కామెరాన్‌తో అన్నారు. ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, అక్రమ వలసలు లాంటి ఉమ్మడి ముప్పులను తిప్పి కొట్టడానికి కలిసి పని చేయాలన్న కృతనిశ్చయాన్ని ఈ సందర్భంగా ఇరువురు ప్రధానులు పునరుద్ఘాటించారు. కాగా, తమ గడ్డపైనుంచి తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడానికి పాక్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా కామెరాన్ ప్రశంసించారు.