సంజీవని

పచ్చబొట్టు వద్దనుకుంటే తీసేయొచ్చా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె.లలిత, హైదరాబాద్
ప్ర: మా ఆయన ఆర్మీలో వున్నపుడు చేతిమీద పచ్చ పొడిపించుకున్నాడు. ఇప్పుడది వద్దనుకుంటున్నాం. ప్లాస్టిక్ సర్జరీ చేత దాన్ని పోగొట్టుకోవచ్చా?
జ: పచ్చబొట్టు చిన్నదైతే మచ్చపడకుండా శస్తచ్రికిత్సతో తొలగించవచ్చు. పచ్చ పెద్దదైతే సమస్యలున్నాయి. డెర్మాబ్రేషన్‌తో తొలగించవచ్చు కానీ మచ్చపడుతుంది. ఆ ప్రాంతంలో వెంట్రుకలు రావు. చర్మం రంగు కూడా ఆ ప్రాంతంలో మారుతుంది. ఇన్‌ఫెక్షన్ రాకుండా జాగ్రత్తపడాలి.
డి.రాజారావు, విజయవాడ
ప్ర: డెర్మాబ్రేషన్ అంటే ఏమిటి?
జ: చర్మం పైపొర ఎడిడెర్మిస్, దానిక్రింద వుండే డెర్మిస్ పైపొరని తొలగిస్తారు వేగంగా తిరిగే బ్రష్‌తో. అపుడు చర్మం, పడితే మోకాళ్ల మీద చర్మం ఎలా లేస్తుందో అలా లేస్తుంది. చర్మం తిరిగి రాగానే ఎపిడెర్మిస్ పలచగా వుంటుంది. రంగు పోయినట్లు వుంటుంది.
జి.రమణ, వరంగల్
ప్ర:ఫేస్ లిఫ్ట్ ఎలా చేస్తారు?
జ: ముఖంలో కణజాలాల్ని టైట్ చేయడం దగ్గరనుంచి ముఖ పునర్ నిర్మాణం వరకు ఫేస్‌లిఫ్ట్ శస్తచ్రికిత్సలు ఎన్నో వున్నాయి. మీకు అవసరమైన శస్తచ్రికిత్సని డాక్టర్ నిర్ణయిస్తాడు. ఎంతసేపు పడుతుందనే విషయం శస్తచ్రికిత్సను బట్టే కాకుండా మీ ఆరోగ్య పరిస్థితి, నయమయ్యే గుణం వీటన్నిటినీ కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. నొప్పి, అసౌకర్యం లాంటివి మీరు శస్తచ్రికిత్స చేయించుకునే భాగాన్ని బట్టి ఉంటాయి.
ఎస్.రాణి, చెన్నై
ప్ర: ఒక్కసారి ఫేస్‌లిఫ్ట్ చేస్తే ఆ ఫలితాలు ఎన్నాళ్లుంటాయి?
జ: మామూలు చర్మాన్ని టైటెన్ చేసేలాంటి వాటి ఫలితాలు ఐదేళ్లు వుంటాయి. అలా కాకుండా ఆధునిక విధానాలలో చేసే శస్తచ్రికిత్సలు రెట్టింపు కాలం వుంటాయి.
కె.గాంధారి, గుంటూరు
ప్ర: నా రొమ్ములు పెద్దవిగా వుంటాయి. చూడ్డానికి చాలా న్యూనతగా వుంటుంది.
జ: ఎక్కువ వున్న మామరి గ్లాండ్ కణజాలాల్ని చర్మం తీసేయడంతో పరిమాణాన్ని తగ్గిస్తారు. శరీరానికి తగ్గ సైజులోకి శస్త్ర చికిత్స ద్వారా చేయవచ్చు. అలాగే, రొమ్ములు చిన్నవిగా వుంటే ఇన్‌ప్లాంట్స్ పెట్టి పెద్దవి చేయవచ్చు.
జె.రాఘవ, విశాఖ
ప్ర:టమీటక్ అంటే?
జ: పొట్ట జారడాన్ని శస్తచ్రికిత్సతో సరిచేయడాన్ని టమీటక్ అంటారు. కడుపు ప్రాంతంలో పేరుకుపోయిన కొవ్వుని, ఎక్కువైన చర్మాన్ని తీసి పొట్ట మామూలుగా వుండేలా చేయవచ్చు. శస్తచ్రికిత్స ద్వారా ఏ ఇబ్బందీ కలుగకుండా చేయవచ్చు.

-డా.శశికాంత్ మద్దు ప్లాస్టిక్ సర్జన్, యశోద సూపర్ స్పెషాలిటీ 9581258179