అంతర్జాతీయం

అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికయిన ఐదుగురు భారతీయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 9: అమెరికా ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా భారతీయ సంతతికి చెందిన అయిదుగురు అమెరికన్లు అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు. పోటీ చేసిన భారతీయ మహిళల్లో చాలామంది ఈ ఎన్నికల్లో మంచి విజయాలు సాధించడం విశేషం. కాలిఫోర్నియా రాష్ట్రానికి రెండుసార్లు అటార్నీ జనరల్‌గా పనిచేసిన 51 ఏళ్ల కమలా హారిస్ ఆ రాష్ట్రంలో అమెరికా సెనేట్‌కు ఎన్నికయ్యారు. అలాగే 51 ఏళ్ల ప్రమీలా జయపాల్ సీటెల్‌నుంచి ప్రతినిధుల సభకు ఎన్నియిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. అలాగే ఇల్లినాయిస్‌నుంచి ప్రతినిధుల సభకు పోటీ చేసిన రాజా కృష్ణమూర్తి కూడా విజయం సాధించారు. కృష్ణమూర్తికి ప్రవాస తెలుగు సంఘాలు మద్దతు ప్రకటించాయి. కాలిఫోర్నియాలోని తమ జిల్లాలనుంచి ప్రతినిధుల సభకు పోటీ చేసిన మరో ఇద్దరు భారతీయ అమెరికన్లు రో ఖన్నా, అమీ బేరా కూడా తమ ప్రత్యర్థులపై భారీ ఆధిక్యత సాధించి విజయం దిశగా దూసుకెళ్తున్నారు. కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో 56 శాతం ఓట్లు లెక్కించే సమయానికి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి బేరా 54 శాతం ఓట్లతో రిపబ్లికన్ పార్టీ ప్రత్యర్థి స్కాట్ జోన్స్‌పై మెజారిటీలో ఉన్నారు. జోన్స్‌కు 46 శాతం ఓట్లు వచ్చాయి. అలాగే కాలిఫోర్నియా 17వ జిల్లానుంచి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అయిన రో ఖన్నా 72 శాతం ఓట్లు లెక్కించే సమయానికి డెమోక్రటిక్ పార్టీనుంచి పోటీ చేసిన 68 శాతం ఓట్లు సాధించి 50,952 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే అమెరికా ప్రతినిధుల సభకు వెళ్లేందుకు పోటీపడిన మరో ఇండియన్ అమెరికన్ పీటర్ జాకోబ్ ఓటమి పాలయ్యారు. భారత్‌లోని కేరళకు చెందిన పీటర్ న్యూజెర్సీనుంచి డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేశారు. సోషల్ వర్కర్ అయిన ఆయన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన లియోనార్డ్ లాన్స్ చేతిలో 15 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఆసక్తికరమైన అంశం ఏమిటంటే హారిస్, కృష్ణమూర్తి, బేరా అభ్యర్థిత్వాలను ఒమాక్ ఒబామా ప్రతిపాదించగా, మాజీ అధ్యక్షుడు జిమీ కార్టర్, సెనేటర్ బెర్నీ శాండర్స్ జయపాల్ పేరును ప్రతిపాదించారు. కాలిఫోర్నియాలోని ఓక్‌లాండ్‌లో పుట్టిన హారిస్ తల్లి భారతీయురాలు కాగా, తండ్రి అమెరికన్. 1960లో ఆమె తల్లి అమెరికాకు వలసవెళ్లారు. కాలిఫోర్నియాలోని డెమోక్రాట్లందరు కూడా ముక్తకంఠంతో హారిస్ అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు. కాగా, చెన్నైకి చెందిన ప్రమీలా జయపాల్ తన తొలి ప్రయత్నంలోనే విజయం సాధించడం విశేషం. ఆమె అయిదేళ్ల వయసులోనే తండ్రి ఉద్యోగ రీత్యా ఇండోనేసియా, సింగపూర్‌కు వెళ్లి చివరికి అమెరికాలో స్థిరపడ్డారు. 25 ఏళ్ల తర్వాత 1995లో భారత్‌కు వచ్చి కొద్దికాలం ఇక్కడికి గడిపినప్పుడు తన జీవితంలో మెరుగైన మార్పు వచ్చిందని ఆమె అంటారు. తన భారత దేశ పర్యటన జ్ఞాపకాల ఆధారంగా ఆమె రాసిన ‘పిలిగ్రేమేజ్ టు ఇండియా: ఎ ఉమన్ రీవిజిట్ హర్ హోమ్‌లాండ్’ పుస్తకం 2000 సంవత్సరంలో మార్కెట్లో విడుదలైంది.