ఆంధ్రప్రదేశ్‌

బ్రహ్మోత్సవ బహుమానం యథాతథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:బ్రహ్మోత్సవాల్లో పనిచేసే టిటిడి ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి బ్రహ్మోత్సవ బహుమానంగా ఇచ్చే మొత్తాన్ని తగ్గిస్తూ దేవాదాయశాఖ జారీచేసిన జీఓను రద్దుచేస్తూ గతంలో టిటిడి పాలకమండలి నిర్దేశించిన విధంగానే చెల్లింపులు ఉండేలా కొత్తగా జీవో జారీ చేశారు. దేవాదాయశాఖ జీవోపై టిటిడి ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం చురుకుగా కదిలి చర్యలు తీసుకుంది. టిటిడి ఉద్యోగులకు రూ.12,200, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి రూ.6000 చొప్పున బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని గతంలో టిటిడిబోర్డు తీర్మానం చేసింది. కాగా ఈ మొత్తాన్ని 10,000, 5,000 రూపాయలుగా నిర్ణయిస్తూ, భవిష్యత్‌లో బ్రహ్మోత్స బహుమానాన్ని పెంచరాదంటూ దేవాదాయశాఖ జీవో జారీచేయడంతో వివాదం రేగింది. కాగా పాత విధానమే అమలు చేయాలంటూ మళ్లీ ప్రభుత్వం జీవో జారీచేయడంతో పరిస్థితి చక్కబడింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియకుండానే దేవాదాయశాఖ జీవో జారీచేసినట్లు ప్రచారం జరుగుతోంది.