అంతర్జాతీయం

ఆహారోత్పత్తి, నీటి భద్రతకు ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, మే 31: వాతావరణ మార్పు లు ఆహార ఉత్పత్తి, నీటి భద్రత, కెనడానుంచి భారత దేశం దాకా వాతావరణాల తీరు తెన్నులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ప్రపంచ దేశాల నేతలను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. చరిత్రాత్మక పారిస్ ఒప్పందంనుంచి వైదొలగుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్న నేపథ్యంలో పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఉద్దేశించిన ఈ ఒప్పందాన్ని అమలు చేయని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ప్రపంచ దేశాలను హెచ్చరించడం గమనార్హం. పర్యావరణ మార్పు అంతా ఓ బూటకమని ట్రంప్ గతంలో వ్యాఖ్యానించడమే కాకుండా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబా మా నిర్విరామ కృషి కారణంగా కుదిరిన పారిస్ ఒప్పందానికి ఆమోదం తెలపాలంటూ ఇటీవల సిసిలీలో జరిగిన జి-7 శిఖరాగ్ర సదస్సు సందర్భం గా అమెరికా మిత్ర దేశాధినేతలు తెచ్చిన ఒత్తిడిని సైతం తోసి రాజనడం తెలిసిందే. అయితే వాతావరణ మార్పు అనేది కాదనలేని సత్యమని గుటెరెస్ స్పష్టం చేశారు. ప్రపంచం ఇప్పుడు గందరగోళం లో ఉందని ఆయన అంటూ, కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఉద్దేశించిన పారిస్ ఒప్పందాన్ని ఒక దేశం నమ్మినా నమ్మక పోయినా మీరంతా మరింత బలంగా సంఘటితమై దాన్ని అమలు చేసేందుకు కృషి చేయాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. న్యూయార్క్ యూనివర్శిటీకి చెందిన స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో మంగళవారం విద్యార్థులు, వాణి జ్య ప్రముఖులు, విద్యావేత్తలనుద్దేశించి మాట్లాడు తూ గెటెరెస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన తన ప్రసంగంలో ఎక్కడా ట్రంప్ పేరును కానీ, అమెరికా ప్రభుత్వం పేరును కానీ ప్రస్తావించ లేదు. అయితే ఆహూతుల్లో ఒకరు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, పారిస్ ఒప్పందంనుంచి వైదొలగకుండా ఉండడం అమెరికాకు ముఖ్యమని ఐరాస భావిస్తోందని, ఒకవేళ ట్రంప్ వైదొలగినా అమెరికా సమాజం అంటే నగరాలు, రాష్ట్రాలు, కంపెనీలు, వాణిజ్య సంస్థలు వైదొలగకుండా ఉండడం ముఖ్యమని గెటెరెస్ అన్నారు.