అంతర్జాతీయం

ఏడాది పొడవునా యోగా చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్: కేవలం ‘యోగా డే’ నాడే కాకుండా ఏడాది పొడవునా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశంలో ప్రతి కుటుంబం యోగాను ఆచరించాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శారీరక, మానసిక ఉల్లాసానికి యోగా దివ్యౌషధం లాంటిదని అన్నారు. యోగాతో మంచి ఆహారపు అలవాట్లు అలవడి ఆరోగ్యవంతులు కావచ్చన్నారు. ‘యోగా డే’ను పురస్కరించుకుని ఐరాస ప్రధాన కార్యాలయంలో వేడుకలను నిర్వహించారు. యోగాసనాలను వివరించే బొమ్మలను విద్యుత్ వెలుగుల్లో ఆవిష్కరించారు. వివిధ దేశాలకు చెందిన దౌత్యవేత్తలు పాల్గొన్నారు.