విజయవాడ

చుక్కల్లో చింతపండు ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, ఫిబ్రవరి 22: వేసవి ఆరంభం కాగానే రాష్ట్ర ప్రజల్లో ఊరగాయ పచ్చళ్లు సీజన్ మొదలవుతుంది. పచ్చళ్లకు ముఖ్యమైన ముడిసరుకు చింతపండు ధరలు ఈ ఏడాది మహిళలను భయపెడుతోంది. గత ఏడాది నంబర్‌వన్ చింతపండు కిలో రూ.150 అమ్మగా నేడు కిలో మేలిరకం రూ.260 నుండి రూ.280కి పెరిగింది. గింజలు లేని (కరిపులి) చింతపండునే మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే తాజా చింతపండుతో ఊరగాయ పచ్చళ్లు పట్టడం వల్ల ఎంతో రుచిగా ఎక్కువ కాలం నిలువుంటుందని మహిళలు తెలిపారు. గత ఏడాది దసరా పండుగ దినాల్లో కరిపులి చింతపండు కిలో రూ.150 అమ్మారు. సంక్రాంతి పండుగల్లో ఏకంగా రెండింతలు పెరిగి కిలో రూ.300కి అమ్మారు. ఆ తరువాత క్రమంగా ధర తగ్గుతూ వచ్చింది. ఈనెల ఆరంభం నుండి క్రమేణా ధరలు పెరుగుతూ ప్రస్తుతం కిలో రూ.280కి చేరింది. ప్రస్తుతం పండుమిర్చి, టమాటా, ఉసిరి, పులిహార గోంగూర పచ్చళ్లు సీజన్ మొదలైంది. అలాగే క్యాలీఫ్లవర్‌లతో కూడా ఊరగాయ పచ్చళ్లు తయారు చేస్తున్నారు. దక్షణాంధ్ర నల్లమల అడవుల్లో లభించే చింతకాయలు కేరళ, కర్నాటక, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లావాసుల వినియోగానికే సరిపోతుందని ఎటొచ్చి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లా వాసుల అవసరాలు తీర్చడానికి మహారాష్ట్ర, తుంపూరు, హిందూపూర్ ప్రాంతాల్లోనే చింతపంటలు రవాణా చేసుకోవాల్సి వస్తోందని వ్యాపారులు తెలిపారు. నేడు వినియోగంలోకి తెస్తున్న చింతపండుగాని ఎండు మిర్చిగాని ఏసీ గోదాముల్లో నిలువ ఉంచి వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా వ్యాపారులు చింతపండును అంచెలంచెలుగా బయటకు విడుదల చేస్తూ కృత్రిమ కొరతను సృష్టించి ధరలు విపరీతంగా పెంచడం జరగుతుంది. కుటీర పరిశ్రమగా పచ్చళ్లు అమ్ముకునేవారు మాత్రం చింతపండు ధరను తట్టుకోలేక నిమ్మరసాన్ని వినియోగిస్తున్నారు.