విజయవాడ

ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, జూన్ 2: ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకాన్ని కలిగించేలాగా మెరుగైన వైద్య సేవలు అదించడంతోపాటు, డాక్టర్లు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. గురువారం స్థానిక ఎన్‌టిఆర్ హెల్త్ యూనివర్శిటీ ప్రాంగణంలోని కొత్త ఆసుపత్రి పక్కన పిఎంఎస్‌ఎస్‌వై 150 కోట్ల గ్రాంట్‌తో నిర్మించనున్న సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల వారు, దేశాల వారు వైద్య చికిత్సల కోసం రాష్ట్రానికి వచ్చే లాగా ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ తీరు మెరుగుపరుచుకొని రాష్ట్రాన్ని మెడికల్ హబ్‌గా, మెడికల్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుకుందామన్నారు. ప్రామాణికతకు వైద్య రంగంలో ప్రతి ఒక్కరూ అత్యధిక ప్రాదాన్యత ఇవ్వాల్సి ఉంటుందని అందుకోసం ప్రభుత్వం అన్ని విదాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అతి ఎక్కువ ఖర్చుతో కూడుకున్న డయాలిసెస్ వైద్య సేవలను నిరుపేదలకు చేరువ చేసేందుకు పది డయాలసిస్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో 104 తల్లి బిడ్డల సర్వీసుల ద్వారా 278 వాహనాలు అందుబాటులోకి తీసుకురాగలిగామన్నారు. అత్యంత మెరుగైన వైద్య సేవలతో కూడిన 270 వాహనాలు 108 సర్వీసుల ద్వారా త్వరలోనే అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 7 వేల 600 మంది పుల్‌టైమ్ ల్యాబ్ అసిస్టెంట్‌లకు ట్యాబ్‌లను అందిస్తున్నామని తెలిపారు. నైపుణ్యంతో కూడిన ల్యాబ్‌లను ఏర్పాటు చేసి ప్రభుత్వం అండగా ఉండి సహకారం అందిస్తుందని తెలిపారు. శాసనసభ్యులు గద్దె రామమోహన్ మాట్లాడుతూ ఈ ఆసుపత్రి అభివృద్ధికి, వౌలిక సదుపాయాలకు రూ.55కోట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రంమలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పార్లమెంటుసభ్యులు కేశినేని నాని, మేయర్ కోనేరు శ్రీ్ధర్, అసుపత్రి అభివృద్ధి కమిటి చైర్మన్ చెన్నుపాటి విద్య, కలెక్టర్ బాబు ఎ, యూరివర్శిటి రిజిస్టార్ రవిరాజా, డిఎంసి సుబ్బారావు, ప్రిన్సిపల్ శశాంక్, సూపరింటెండెంట్ జగన్‌మోహనరావు పాల్గొన్నారు.