మంచి మాట

శుభ సమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సృష్టి ఆవిర్భావమే ఒక శుభ సమయం. ఆ వేళ మనిషి పుట్టుక మరో శుభ సమయం. సకల జీవకోటిలో మనిషి చాలా తెలివైనవాడు. ఆ భగవంతుడికి మారు రూపమే మానవుడు. మానవుడే మహనీయుడు అన్నాడో మహా కవి. భగవంతుడు ద్వాపరమందు శ్రీకృష్ణుడుగా ఎన్నో లీలలు చూపాడు. మనలో ఒకడుగా మసులుతూ పుట్టిన వెంటనే మేనమామ కంసుని వధించాడు. యశోదానందనులింట పెరుగుతూ యశోదమ్మకు భూభోనంతరాలు చూపించాడు. గోపాలుడు గోకులంలోని బాలలతో గోవులను కాచాడు. గోవులను భక్షిస్తున్న కాళుడిని బంధించి కాళీయమర్దనం చేసాడు. ప్రకృతి విలయతాండవం చేస్తున్న వేళ గోకులవాసులందరినీ గోవర్ధన గిరి ఎత్తి ఒక చోటకు చేర్చి కాపాడాడు. మన్ను తిన్నాడు. వెన్నతిన్నాడు గోపాలుడు. ఆ నంద నందనుడు ఏమి చేసినా ఆనంద నందనమే.
ఇక త్రేతాయుగమున శ్రీరాముడిగా అవతరించాడు.దశరథ నందనుడుగా తండ్రిమాట జవదాటని పురుషోత్తముడు. తమ్ముళ్లను తండ్రిలా కాచిన అమృత నందనుడు. ముగ్గురు అమ్మలకు ప్రేమ పుత్రుడు. తండ్రి మాట కోసం అడవులకేగిన అమృతమూర్తి. శత్రువులను సైతం ఆదరించిన అజాత శత్రువు. ప్రజల మాట కోసం సతిని ఎడబాసిన త్యాగమూర్తి. నాటికి నేటికి రాజ్యమంటే రామరాజ్యం అంటారు కానీ మరోమాటకు తావులేదు.అందుకే భగవంతుడు ఏమి చేసినా మనకోసమే అన్నవి జగమెరిగిన సత్యం.
మరి కలియుగాన సాక్షాత్ భగవంతుడు మన కోసం ఏడు కొండలపై మనకై వెలిశాడు. కోరిన వారికి కొంగుబంగారం శ్రీ శ్రీనివాసుడు. భక్తులపాలిట కల్పతరువు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం..అతనికి పెరుగుతున్న రద్దీయే. శ్రీకృష్ణుడైనా, శ్రీరాముడైనా శ్రీనివాసుడైనా అంతా...ఆ భగవంతుడి మాయాలీలా విశేషమే. ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే అన్నారు మహాత్ములు. ఏ యుగమైనా ప్రజల సంరక్షణకై ధర్మాన్ని కాపాడుటకు ఆ భగవంతుడు అవతరిస్తునే ఉంటాడు. మనల్ని తరింపచేస్తునే వుంటాడు.
కానీ మానవుడు క్షణికమైన సుఖాలకోసం చేయరాని పాపాలు చేస్తూ తన గోతిని తనే తవ్వుకుంటున్నాడు. భగవంతుని దృష్టిలో పరమ పాపిగానే మిగులుతాడు. మానవత్వం మరిచి మనిషిగా మాయమై మృగంలా మారి పోతున్నాడు. తరచి చూస్తే ఈ ప్రపంచంలో ఏది మనకు శాశ్వతం కాదు. అంతా శూన్యం. పుట్టినపుడు మనం ఏమీ తీసుకురాము. పోయేటప్పుడు ఏమీ తీసుకుపోము అని తెలిసినా తప్పులు చేస్తూనే వున్నాడు. మనిషికి కీర్తి ప్రతిష్టలు చేసే మంచి పనుల వల్ల వస్తాయి. భగవంతుడు మనకు అడగకుండానే ఇచ్చాడు. మనకు ఎందరో పరమాత్ములు ఎన్నో పుణ్య ఫలాలు అందించారు. అలాటి మహాత్ములు ఈ భారతావనిలో ఎందరో ఎందరెందరో చిరంజీవులుగా మన మదిన నిలిచిపోయారు. మనమంతా వారంత గొప్పవారం కాకపోయినా వారు చూపిన మంచి మార్గాన పయనిస్తే చాలు. మనం మహాత్ములు కాకపోయినా మంచివారుగా పది కాలాలు నిలిచిపోతాము. అనే మనము భగవంతునికి ఇచ్చే నిజమైన నివాళి. ప్రతి క్షణం భగవన్నామ స్మరణతో గడిపి మనుషులుగా జీవించి తరిద్దాము.మానవుడికి దైనందిన జీవితంలో సమయపాలన చాలా అవసరం. ప్రతిమనిషి జీవితంలో నిరంతరం ఏదో ఒక పని చేయాలి.
మనిషిగా మన మనుగడ సాగాలంటే ముందు ఈ జన్మనిచ్చిన మాతా పితరులను పూజించాలి. వారికి జన్మనిచ్చిన భగవంతునికి అంజలి అర్పించాలి. మనకు జీవనమార్గం చూపే గురువులను సదా పూజించాలి. అనాధలను, ఆపన్నులను ఆదరించాలి. మానవ సేవయే మాధవ సేవ అని తలిచి మనిషిగా మెలగాలి. ఆపదలో వున్న వారిని ఆదుకోవాలి. విపత్తులు సంభవించినపుడు ఆపన్న హస్తం అందించాలి. ఎవరో వస్తారని, ఏదోచేస్తారని ఎదురు చూడకుండా అన్నీ మనమై సేవా భావంలో మమేకమై మానవ లక్ష్యంతో పరిమళించాలి. మన భారతావని కీర్తిని దిగంతాల అంచులు దాటించాలి.

-కురువ శ్రీనివాసులు